Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
nakshatra yuddham

ఈ సంచికలో >> సినిమా >>

హిందీ సీరియల్‌ నటీమణుల హవా

hindi serial actress hawa

ఒకప్పుడు తెలుగు టీవీ సీరియల్స్‌లో తెలుగువారే వుండేవారు. ఇతర భాషల నుంచి వచ్చినవారు తెలుగు నేర్చుకుని, తెలుగువారిగా తెలుగు సీరియళ్ళలో హుందాగా కనిపించేవారు. కాని తెలుగుకి తెగులు పట్టించేస్తూ, వెరైటీ కోసమంటూ తమిళం నుంచి నటీనటుల్ని తీసుకొస్తున్నారు. తమిళ సీరియల్స్‌ తెలుగులోకి డబ్‌ అవుతుండడమూ జరిగింది. వాటికి వ్యతిరేకంగా ఉద్యమం కూడా నడిచింది.

ఇప్పుడు హిందీ సీరియల్స్‌ నుంచి వస్తున్నవారితో తెలుగు బుల్లితెర నిండిపోతోంది. వారికి ప్రేక్షకుల్లో లభిస్తున్న ఆదరణతో సినిమా అవకాశాలూ పెరుగుతున్నాయి. తెలుగువాళ్ళకి తెలుగు సినిమాల్లో అవకాశాలు తగ్గుతోంటే, బుల్లి తెర నుంచి వస్తోన్న హిందీవారికీ తెలుగు వెండితెరపై అవకాశాలు వస్తుండడం వింతగానే అనిపించవచ్చు.

ఒక్కోసారి హిందీ నటీనటులకు వున్న క్రేజ్‌ దృష్ట్యా, వారు రెమ్యునరేషన్‌పై చేస్తోన్న డిమాండ్స్‌ బుల్లితెర నిర్మాతలకే కాక, వెండితెర నిర్మాతలకూ షాక్‌ ఇస్తోంది. హిందీ సీరియల్స్‌ అంటే చాలా కాస్ట్‌లీగా రూపొందుతాయి. వాటికి తగ్గట్టే అక్కడ నటీనటుల రెమ్యునరేషన్స్‌ వుంటాయి. మెగా సీరియల్స్‌లో నటించేవారికి అక్కడే పెద్ద పెద్ద రెమ్యునరేషన్స్‌ వస్తున్నప్పుడు, వాటిని వదులుకుని రావాలంటే ఇంకా ఎక్కువ డిమాండ్‌ చేయడం తప్పు కాకపోవచ్చు.

హిందీ టీవీ సీరియల్‌ నుంచి తెలుగు తెరపై హీరోయిన్‌గా ఛాన్స్‌ దక్కించుకుంది అవికా గోర్‌. ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో ఆమె హీరోయిన్‌ అయ్యింది. అవిక చెబుతున్న రెమ్యునరేషన్‌ నిర్మాతలకు షాకిస్తోందట. ఇతర నటీనటులూ ఇలానే వ్యవహరిస్తున్నారట.

మరిన్ని సినిమా కబుర్లు
varma ilaa annaaru kadaa