Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

చిత్ర సమీక్ష - లెజెండ్‌

movie review Legend

చిత్రం: లెజెండ్‌
తారాగణం: బాలకృష్ణ, జగపతిబాబు, రాధికా ఆప్టే, సోనాల్‌ చౌహన్‌, సుజాతా కుమార్‌, బ్రహ్మానందం, రావు రమేష్‌, ఎల్‌.బి. శ్రీరాం, కళ్యాణి తదితరులు
ఛాయాగ్రహణం: సి. రాంప్రసాద్‌
సంగీతం: దేవిశ్రీప్రసాద్‌
నిర్మాణం: 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, వారాహి చలన చిత్రం
దర్శకత్వం: బోయపాటి శ్రీను
నిర్మాతలు: అనిల్‌ సుంకర, రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట
విడుదల తేదీ: 28 ఫిబ్రవరి 2014


క్లుప్తంగా చెప్పాలంటే
దుబాయ్‌లో వుండే కృష్ణ (బాలకృష్ణ), స్నేహ (సోనాల్‌ చౌహన్‌)ని పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు. కృష్ణ ఇండియాలోని తమ బంధువుల మధ్య తమ పెళ్ళి చేసుకోవాలని ఇండియాకి వస్తాడు. అక్కడ అనూహ్యమైన పరిస్థితులు ఎదురవుతాయి కృష్ణకి. జితేంద్ర (జగపతిబాబు) కృష్ణ కుటుంబానికి హాని తలపెడ్తుంటాడు. ఈ క్రమంలో జితేంద్రతో కృష్ణ తలపడాల్సి వస్తుంది. ఎవరా జితేంద్ర? కృష్ణ కుటుంబంతో అతనికి తగాదా ఏంటి? అనేవి తెరపై చూడాల్సిన అంశాలు.

మొత్తంగా చెప్పాలంటే
పవర్‌ఫుల్‌ మాస్‌ పాత్రల్లో బాలకృష్ణ తనకు తిరుగులేదని మరోమారు నిరూపించాడు. తెరపై అద్భుతమైన నటనా ప్రతిభతో ఆకట్టుకున్నాడు. వన్‌ మాన్‌ షో అని అనకుండా వుండలేం బాలకృష్ణ నటన ఈ సినిమాలో చూశాక. రాధికా ఆప్టే నటన పరంగా స్కోర్‌ చేసింది. గ్లామర్‌ విషయంలో సోనాల్‌ చౌహన్‌కి మార్కులు బాగానే పడతాయి. విలన్‌ పాత్రలో జగపతిబాబు రాణించాడు. బ్రహ్మానందం కామెడీ పెద్దగా పండలేదు. రావు రమేష్‌ షరా మామూలే. హంసా నందిని ఓ పాటలో మెరిసింది. సుజాతా కుమార్‌ ఓకే. మిగతా పాత్రధారులంతా తమ పరిధి మేర నటించారు.

సినిమాటోగ్రఫీ బావుంది. సినిమాకి రిచ్‌ లుక్‌ తెచ్చింది. సినిమాకి అవసరమైన రీతిలో బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సమకూర్చారు. అది సినిమాకి అదనపు ఆకర్షణగా నిలిచింది. సంగీతం బావుంది. మూడు పాటలు ఆకట్టుకుంటాయి. నేరేషన్‌ గ్రిప్పింగ్‌గా వుంది. స్క్రీన్‌ప్లే, కథలో కొత్తదనమేమీ లేదు.

పవర్‌ ప్యాక్డ్‌ స్టోరీలైన్‌తో సినిమాని రూపొందించాడు దర్శకుడు. గతంలో ‘సింహా’ సినిమాలో బాలకృష్ణను పవన్‌ఫుల్‌గా చూపిన బోయపాటి శ్రీను, ఈ సినిమాలోనూ బాలకృష్ణ మీదనే పూర్తిగా ఫోకస్‌ పెట్టాడు. ఏరోగెన్స్‌, సెంటిమెంట్‌ అన్నీ బాగా వర్కవుట్‌ అయ్యాయి.  ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ని బాగా చిత్రీకరించారు. ఫస్టాఫ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ రొమాన్స్‌ని మిక్స్‌ చేసిన దర్శకుడు, సెకెండాఫ్‌లో ఎమోషనల్‌ సీన్స్‌తో చూపించాడు. ఎక్కడా కమర్షియల్‌ అంశాల్ని దర్శకుడు మిస్‌ అవలేదు. కమర్షియల్‌ అంశాలు పుష్కలంగా వుండడంతో, సినిమా మంచి విజయాన్ని నమోదు చేసే అవకాశం వుంది.

ఒక్కమాటలో చెప్పాలంటే
హై ఓల్టేజ్‌ పవర్‌ఫుల్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌

అంకెల్లో చెప్పాలంటే: 3.5/5

మరిన్ని సినిమా కబుర్లు
Interview with samantha