Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Cine Churaka by Cartoonist Bannu

ఈ సంచికలో >> సినిమా >>

బోయపాటికి ఊపిరాడనివ్వరు

boyapatiki oopiradanivvaru

సినీ పరిశ్రమలో ప్రస్థానం విజయాల మీదే ఆధారపడి ఉంటుందని వేరే చెప్పక్కర్లేదు. వరుసగా హిట్లిచ్చిన దర్శకులు కూడా రెండు ఫ్లాపులు అందిస్తే హీరోలు ఆ దర్శకుల ముఖాలు చూడడానికి కూడా ఆలోచించే రోజులివి. అలాంటిది అగ్ర హీరోతో అదిరిపోయే హిట్టు కొడితే?! మనం చెప్పుకునేది దర్శకులు బోయపాటి శ్రీనివాస్ గురించి. బాలకృష్ణతో 2010లో "సింహా" మళ్లీ ఇప్పుడు 2014లో "లెజెండ్"తో తిరుగులేని సూపర్ హిట్స్ అందించారు. ఇప్పుడు కుర్ర హీరోలంతా ఈ దర్శకుడి వెనుకే పడుతున్నట్టు సమాచారం. అయితే ముందు అనుకున్నాట్టుగా రాం చరణ్ తో బోయపాటి తన తదుపరి చిత్రం తీస్తాడా, లేక వేరే హీరోతో ముందుకు వెళ్తారా అనేది వేచి చూడాలి. ఇప్పుడు పై చేయి బోయపాటిదే కనుక నిర్ణయం కూడా ఆయనదే మరి!

మరిన్ని సినిమా కబుర్లు
akhil natyam chooseyandi