Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
idi aadithe ghanatha daanide

ఈ సంచికలో >> సినిమా >>

"లేడీస్ అండ్ జెంటిల్మెన్" తొలి చూపు

ladies and gentlemen first look

గోతెలుగు డాట్ కాం సగర్వంగా సమర్పిస్తున్న చిత్రం "లేడీస్ అండ్ జెంటిల్మెన్" తొలి చూపును ప్రసాద్ ల్యాబ్ లో విడుదల చేసింది. అదేనండీ, ఈ తొలి చూపును ఆంగ్లమున "ఫస్ట్ లుక్" అనెదరు! షిర్డీ సాయి కంబైన్స్ పతాకంపై నిర్మాణమవుతున్న ఈ చిత్రంలో మహత్, శేష్ అడవి, చైతన్య, కమల్ కామరాజు, జాస్మిన్, నికిత నారాయణ్, స్వాతీ దీక్షిత్ లు నటిస్తున్నారు. సోషల్ మీడియా వల్ల సంఘంలో వచ్చిన మార్పులు, వాటి పరిణామాలు ఈ చిత్రంలో ఇతివృత్తం. రఘు కుంచె సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి గీత రచయిత సిరాశ్రీ. మరో మూడు వారాల్లో ఈ చిత్రం ఆడియో వేడుకను జరుపుకోబోతోంది. మేలో విడుదలకు సిధ్ధం అవుతోంది.

మరిన్ని సినిమా కబుర్లు
syatilait teraga radu