Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
.ajent ekambar

ఈ సంచికలో >> సీరియల్స్

కిట్టుగాడు ఇంటర్ ఫెయిల్ ఐ ఎ స్ పాస్

kittugaadu

ఖాళీగా పెడతారా? అనే ప్రశ్న వచ్చింది. ఖరాఖండిగా  అవును ఖాళీగానే వుంచుతాము. అనే సమాధానం వచ్చింది. ఈ సివిల్స్ పరిస్థితి కూడా అంతే అన్నారు రాధాకృష్ణ. మనస్ఫూర్తిగా లెంపలు వేసుకున్నాడు కిట్టూ... ''సార్... ఈ సివిల్స్ ఎన్ని మార్కులకి? పాస్ మార్కులెంత?' అడిగాడు కిట్టూ. మొత్తం వందమార్కులకి అనుకుందాం. పాస్ మార్కులంటూ ఏమీ లేవు.

వందకి వంద మార్కులు తెచ్చుకున్నవాడు ప్రథముడిగా నిలుస్తాడు. పరీక్ష రాసిన సంవత్సరంలో ఐదొందల పోస్టులు వున్నాయనుకుందాం. ఒక ఉద్యోగం వెళ్లిపోయింది. తర్వాత ఉద్యోగం తొంభై తొమ్మిది మార్కులు తెచ్చుకున్నవాడికి అలా అయిదొందల ఉద్యొగాలు వెళ్లిపోతాయి. పోటీ తీవ్రంగా వుంటే డెబ్బై అయిదు మార్కులకే అన్నీ సర్దుబాటు అవుతాయి."

"సార్... మరి పాస్ మార్కులు ముప్పై అయిదు కదా!" అన్నాడు కిట్టూ...

"అది స్కూళ్లలోనూ, కాలేజీల్లోనూ వుంటుంది. ఈ పోటీ పరీక్షల్లో అలాంటిదేమీ వుండదు. డెబ్బై అయిదు మార్కులకే ఉద్యోగాలన్నీ సర్దుబాటు అయిపోతే, డెబ్బై నాలుగు వచ్చినవాళ్లు ఇంటికి వెళ్లడమే" అన్నారు రాధాకృష్ణ.
"లెక్క వివరంగా చెప్పండి" అన్నాడు కిట్టూ.

"ఇంతకంటే వివరంగా చెప్పడానికి లేదు. 'యు.పి.ఎస్.సి.'కి వుండే లెక్కలు దానిక్ వున్నాయి. ఒకసారి కోర్టు అడుగుతుంది యు.పి,.ఎస్.సి.ని ఎలా నిర్ణయించారు? ఎన్ని మార్కులు వచ్చినవారిని పాస్ చేశారు? ఎన్ని మార్కులు వచ్చినవారిని ఫైల్ చేశారు? అని... 'అంతా న్యాయంగానే జరుగుతుంది. మీకు వివరించాలా? అని యు.పి.ఎస్.సి. నసుగుతుందీ కాదూ, కూదదూ అని కోర్టు పట్టుబడితే తప్ప యు.పి.ఎస్.సి. వివరాలివ్వదు.

"సార్... ఇంకోమాట... ఈ సివిల్స్ పరీక్ష ఎన్ని దశలుగా వుంటుంది?"
"మూడు దశలు... "

"ఒకదశ రాసి సంవత్సరం విశ్రాంతి తీసుకుని రెండోదశ మరుసతి సంవత్సరం రాయవచ్చా? ఎందుకంటే, మరీ ఒకేసారి కష్టపడడం కంటే కొంచెం గ్యాప్ వుంటే బావుంటుంది కదా..."

"లేదండీ... ఆ సౌలభ్యం లేదు"

"మే లేదా జూన్ లో మొదటి దశ వుంటుంది. దీన్ని ప్రిలిమినరీ అంటారు. 'ఇప్పుడు దీన్ని సి సెట్ అంటున్నారు. దీనిలో అడిగేవన్నీ ఆబ్జెక్టివ్ ప్రశ్నలు. బిట్ ప్రశ్నలనుకోండి. ప్రశ్న కిందే ఇచ్చిన నాలుగైదు సమాధానాల్లోంచి సరైన సమాధానాన్ని ఎన్నుకోవాలి. పెన్ను పెట్టి బరబరా రాయాల్సిన పని లేదు"

"సార్... ఇదేదో తేలిగ్గానే వుంది. అయిదారువేల బిట్లు బట్టీ కొట్టుకొని పోతే పాసైపోవొచ్చు కదా..." అన్నాడు కిట్టూ.
"బిట్లు బట్టీ కొట్టి సివిల్స్ పాస్ కావడం అనేది కల్ల. ఏదన్నా ఒక కథ చదివితే దాని సారాంశం తెలుసుకోవడం ముఖ్యం. రామాయణమంతా విని సీత రాముడికేమవుద్ది? అన్నాడట ఒకడు. బిట్లు బట్టీ కొట్టినవాడి పరిస్థితీ అంతే! విషయ పరిజ్ఞానం రాదు. ఉదాహరణకి సివిల్స్ లో అడిగే ప్రశ్నలు ఎలా వుంటాయంటే, ధర్మరాజ, భీమ, అర్జున, నకుల అనే నలుగురు పాండవుల్లో కుంతీపుత్రుడు కానివారు ఎవరు?"
"సార్... పాండవులు అయిదుగురు"

"పాండవులు... పాండవులు... తుమ్మెద... పంచ పాండవులోయమ్మ తుమ్మెద అనే పాట వుంది. ఇంత తెలివి తక్కువగా పాండవులు నలుగురు అని ఎలా యు.పి.ఎస్.సి. అడుగుతుంది?"

"ఇక్కడ మేమిచ్చిన ఈ నలుగురు పాండవుల్లో అని అర్థం చేసుకోవచ్చు కదా?" అన్నారు రాధాకృష్ణ.
"సార్... సరే, పాండవులందరూ కుంతీపుత్రులే! పాండురాజు చచ్చిపోతే, నానా కష్టాలూ పడి కొడుకుల్ని పెంచుకుంది కుంతి. అందుచేత ఈ ప్రశ్నే తప్పు" అన్నాడు కిట్టూ...

"అదేమరి తొందరపాటంటే... విషయ పరిజ్ఞానం లేకపోవడమంటే... పాండురాజుకి ఇద్దరు భార్యలు. ఒకరు కుంతి, ఇంకొకామె మాద్రి. ధర్మరాజు, భీముడు, అర్జునుడు కుంతి కడుపున పుట్టినవాళ్ళు. నకులుడు, సహదేవుడు మాద్రికి జన్మించినవారు. పాండురాజు చనిపోతే, అతనితోపాటు కుంతి కూడా సతీసహగమనం చేసి నిప్పుల్లో కాలిపోతానంటే వద్దు అని వారించి మాద్రి తన పిల్లలను కూడా కుంతికే అప్పగించి తను సతీసహగమనం చేసింది. భారతం గురించి సరైన అవగాహన లేనివాళ్లకి కుంతి, కుంతి కుమారులు అయిదుగురు అనే గుర్తుకు వస్తుంది. ఆ అవగాహన రావాలంటే కథను సక్రమంగా చదవాలి. భారతం మీద లక్ష బిట్లు చదివినా భారతం అర్థం కాదు" ఓపిగ్గా వివరించాడు రాధాకృష్ణ.

"సార్... అర్థమైంది. తరువాత దశ?" ప్రశ్నించాడు కిట్టూ...

"మే గానీ, జూన్ లోగానీ ప్రిలిమినరీ (సి సెట్) తర్వాత నవంబర్లో గానీ, దిసెంబర్లో గానీ మెయిన్స్ లో పెన్ను పట్టుకుని పేజీలకు పేజీలు రాయాల్సి వుంటుంది. రెండు సబ్జెక్టుల మీద పట్టు సంపాదించాల్సి వుంటుంది. ప్రిలిమినరీలోనూ, మెయిన్ లోనూ కామన్ గా జనరల్ స్టడీస్ వుంటుంది. మెయిన్స్ లో అదనంగా వ్యాస రచన వుంటుంది. పెన్ను పట్టుకుని రాయడమంటే చాట భారతం రాయడం కాదు. ఇక్కడ విషయ పరిజ్ఞానంతో పాటు 'విషయజ్ఞానాన్ని ' రకరకాలుగా వాడుకోవాల్సి వుంటుంది. దీన్ని వివరించండి అంటే దాని గురించి వివరంగా రాయాలి. దీన్ని పరిశీలించండి అంటే దానిలోని లోతులు, రకరకాల అంశాలు పరిశీలించాలి. దీన్ని విమర్శించండి అంటే తెగబడి తిట్టేయడం కాదు. తప్పులను తప్పులతో పాటు ఒప్పులను కూడా కూలంకషంగా చర్చించాలి. ఉదాహరణకి వయోజన విద్య అని కనబడగానే దాని గురించి మనకు తెలిసినదంతా పేజీలకు పేజీలు రాసి సున్నా మార్కులు తెచ్చుకుని ఈ యు.పి.ఎస్.సి. వాడు లాభం లేదు, వాడికేం కావాలో వాడికే తెలీదు. ఇంత బాగా రాసినా నన్నే ఫెయిల్ చేస్తాడా అని ఎగిరిపడిపోకూడదు.
ఈ వయోజన విద్యని వివరించమన్నాడా, పరిశీలించమన్నాడా, విమర్శించమన్నాడా? అనే విశయాన్ని కనిపెట్టి దానికనుగుణంగా ఎంత రాస్తే సరిపోతుందో అంతే రాయాలి. ఎక్కువ రాసినా వేస్ట్, తక్కువ రాసినా వేస్ట్. ఎక్కడ గురిచూసి కొట్టాలో అక్కడే కొట్టాలి. తుపాకే చేత్తో పట్టుకుని వంద గుండ్లు కాల్చినా ఒక్క పిట్ట కూడా రాలదు. సివిల్స్ ఎన్ని వందల పేజీలు రాసినా ఒక్క మార్కు కూడా రాలదు"


"సార్... ఇంటర్వ్యూ ఆఖరుది కదా?"


"ఇంటర్వ్యూ అనేది లేనే లేదు"


"అదేంటి సార్... ఇంటర్వ్యూ వుంది"


"దాన్ని ఇంటర్వ్యూ అనరు"


"మరి?"


"పర్సనాలిటీ టెస్ట్ అంటారు"


"పర్సనాలిటీ అంటే ఎత్తు, లావు అయి కాలేజీలో వున్నప్పుడు అమ్మాయిల మీద కామెంట్ చేసేవాళ్లం సార్... వెనకేమో పర్సనాలిటీ అని, ముందేమో ముంచిపాలిటీ అని..." గబగబా అనేశాడు కిట్టూ..

"పర్సనాలిటీని తెలుగులో మూర్తిమత్వం అంటారు. మూర్తిమత్వం అంటే పైన శారీరకంగా కనబడేదే కాక, నీ ప్రవర్తన గుణగ్ణాలు, నీకున్న పరిజ్ఞానం, నీకున్న అంతర్గత అభిప్రాయాలు, హాబీలు... ఒకటేమిటి... అన్నీ కలసి వుంటాయి" అన్నారు రాధాకృష్ణ.

"సార్... వాళ్లు వేసే ప్రశ్నలు అన్నింటికీ సరైన సమాధానాలు చెబితే మంచిమార్కులు వేస్తారంట కదా!" అన్నాడు కిట్టూ...

అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పి సున్నాతో బయటకు వచ్చినవాళ్లు వున్నారు. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పి, కొన్నింటికి తెలియదని చెప్పి మంచిమార్కులు సాధించినవారూ వున్నారు. చల్లగా చెప్పారు రాధాకృష్ణ.

గతుక్కుమన్నాడు కిట్టూ...


కిట్టూ వాలకాన్ని గమనించి చెప్పడం మొదలుపెట్టారు రాధాకృష్ణ.


"ఇందాక చెప్పినట్టుగా పర్సనాలిటీ టెస్టులో నువు ఎటువంటివాడివి, నీవల్ల దేశానికి మేలు జరుగుతుందా, లేదా... నీ గుణగణాలు, నీ ఆశయాలు, అభిరుచులు, ప్రవర్తన, నైతిక విలువలు అన్నీ గమనిస్తారు. ఒక్క నాలెడ్జి మాత్రమే కాదు. ఒక మంచి ఆఫీసరు కావడానికి దేశానికి ఉపయోగపడడానికి అవసరమైన లక్షణాలు లేనప్పుడు అన్ని ప్రశ్నలకూ సరైన సమాధానాలు చెప్పినా సరే మార్కులు పడవు.
"సార్... పర్సనాలిటీ టెస్టులో అడిగే ప్రశ్నలకు సమాధానాలు నాకు తెలుసు.


నువ్విప్పుడు ఎన్ని మెట్లెక్కి వచ్చావు? అంటారు.


తిరిగి వెళ్లేటప్పుడు ఎన్ని దిగాలో అన్నే మెట్లు ఎక్కి వచ్చాను అనాలి.


నువు దువ్వుకునే దువ్వెనకు ఎన్ని పళ్లున్నాయి? అంటారు.


నా జుట్టును సక్రమంగా దువ్వుకోవడానికి సరిపడినన్ని... అని చెప్పాలి.


మీ అమ్మగారి చేతులకు ఎన్ని గాజులుంటాయి? అంటారు.


తడుముకోకుండా ఆరు అని చెప్పాలి.


వాట్ ఇస్ ఇట్? అంటారు.


వాటి ఇస్ ఇట్? అంటే అదేమిటని కదా?


అదేటి, ఇదేంటి అని కంగారు పడకూడదు.


ఇట్ అనేది నపుంసక లింగం అని చెప్పాలి.


"నీ భార్యను ఒక రాత్రి మా ఇంటికి పంపుతావా? అని అడిగితే


తప్పకుండా మామగారూ... మీ కూతురు, మీ ఇష్టం... ఒక్క రాత్రేనా? నెలరోజులు పెట్టుకోండి. తిరిగి పంపేటప్పుడు ఒక పల్సర్ కూడా పంపించండి అని చెప్పాలి.


తనకెన్నో విషయాలు తెలిసినట్టుగా ఆనందంగా గడగడా చెప్పాడు కిట్టూ...

రాధాకృష్ణగారు ఆశ్చర్యంగా కిట్టూ వైపు చూసి "మీకు చాలా విషయాలు తెలుసే" అన్నాడు.

"సార్... ఒక విషయం చెప్పండి... కనీసం వెయ్యి పుస్తకాలు చదవాల్సి వుంటుందా సివిల్స్ కి?" అడిగాడు కిట్టూ...


"వెయ్యి పుస్తకాలు చదివితే సివిల్స్ రాదు గానీ, మెంటల్ వచ్చి ఆసుపత్రిలో చేరాల్సి వుంటుంది" అన్నారు రాధాకృష్ణ.  
"సార్... అలా వేళాకోళం చేయకండి. మీరు చదివే వుంటారు" అన్నాడు కిట్టూ...

"లేదండీ వెయ్యి పుస్తకాలు చదవక్కర్లేదు. అవసరమైన పుస్తకాలు పదో, ఇరవయ్యో వుంటాయి. వాటిని క్షుణ్ణంగా చదివితే చాలు. అంతకంటే ఎక్కువగా పోవాల్సిన పనిలేదు" అని చెప్పారు రాధాకృష్ణ.
"సార్... కోచింగ్ లేకుండా సివిల్స్ పాస్ కాలేరా?"
"కోచింగ్ వుంటే మంచిడే. లేకపోయినా తమంతట తామే చదువుకుని పాసైనవారున్నారు"
"సార్... ఏదో కుగ్రామంలో సిటీకి దూరంగా వుండేవాళ్లకు చచ్చినా సివిల్స్ రాదంట కదా?"

"నవంబర్లో ఎంప్లాయ్ మెంట్ న్యూస్ లో దీని గురించే స్పెషల్ గా ఒక బులెటిన్ వస్తుంది. దాంట్లో సివిల్స్ కి సంబంధించిన అన్ని విషయాలూ వుంటాయి. సిలబస్ వుంటుంది. ఆ సిలబస్ ప్రకారం దానికి సంబంధించిన పుస్తకాలను సంపాదించి పద్ధతి ప్రకారం చదివితే కుగ్రామం కాదు, పాతాళంలో వున్నా విజయాన్ని ఎవరూ ఆపలేరు. గ్రామాల్లో వుండి సిటీకి కోచింగ్ కు రాలేనివాళ్లు ముందుగా కొన్ని సంస్థలు రాసిన నోట్స్ సంపాదించాలి. కోచింగ్ సంస్థలు కూడా నొట్స్ తయారు చేస్తాయి. వాటిని కూడా సేకరించాలి. కోచింగ్ లేదు కాబట్టి ఏదో కంగారుగా చదవకుండా జాగ్రత్తగా, విపులంగా, విశదంగా తర్కించుకుంటూ, చదువుతూ విషయ పరిజ్ఞానాన్ని పొందాలి. ముఖ్యమైనవి టెక్ష్ట్ పుస్తకాలు, నోట్ పుస్తకాలు కాదని గుర్తుంచుకోవాలి" అన్నారు రాధాకృష్ణగారు.

"సార్... తలకిందులుగా వేలాడుతూ రాత్రనకా, పగలనకా చదవాలంట కదా..."

"కావాల్సిందేంటంటే, సిలబస్ ప్రకారం ఒక టైం టేబుల్ వేసుకుని పరీక్ష తేదీనిబట్టి, మనకున్న ఇంట్రెస్ట్ ప్రకారం పొద్దున కావచ్చు, సాయంత్రం కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు... ఏదో ఒక టైంలో  మొదలెట్టుకోవచ్చు. సిలబస్ ని కవర్ చేస్తున్నామా, లేదా అనేది చూసుకోవాలి. సిలబస్ ప్రకారం కవర్ చేస్తూంటే సినిమాలు కూడా చూడవచ్చు. ఫ్రెండ్స్ తో పార్టీ కూడా చేసుకోవచ్చు" వివరించారు రాధాకృష్ణ.
"సార్... నేను ఇంటర్ ఫెయిల్... నేను సివిల్స్ రాయవచ్చా?"
"డిగ్రీ వుండాలి..."
"డిగ్రీ అంటే బి.ఏ. పాసయ్యాను సార్... అది కూడా ఉత్త పాస్ మార్కులతో... ఆ తరువాత ఈ ఎక్స్ టర్నల్ బి.ఏ.లో అవకతవకలు జరుగుతున్నాయని ఆ బి.ఏ. కూడా ఎత్తేశారు సార్..."
"మీరు చదివిన సమయానికి దానికి గుర్తింపు వుందా?"
"వుంది సార్..."
"అలాగైతే గొడవే లేదు... కావలసినది డిగ్రీ... ఆ డిగ్రీ ఎం.బి.బి.ఎస్. కావచ్చు, బి.టెక్., కావచ్చు, బి.ఫార్మసీ కావచ్చు, బి.కాం., కావచ్చు, బి.ఎస్సీ. కావచ్చు. డిగ్రీ పాసైన ఎవరైనా సివిల్స్ రాయవచ్చు"
"అంతకు ముందు అందులో పాసయ్యాడా? ఫెయిలయ్యాడా? కంపార్ట్ మెంటల్ గా పాసయ్యాడా? అనేది అవసరం. తప్పకుండా అప్లై చేసుకోండి" చెప్పారు రాధాకృష్ణ.
"సార్... నేను మందు తాగుతాను, సిగరెట్లు కాలుస్తాను"
"ఈ అలవాట్లు నాకూ వున్నాయి. అలవాట్లు వుండడం తప్పు కాదు. కంట్రోల్ లో లేకపోవడం తప్పు" అన్నారు రాధాకృష్ణ.
"సార్... మొదలు పెట్టడం ఏ పుస్తకంతో మొదలు పెట్టమంటారు?"
"షీలాధర్ అనే ఆమె పిల్లల కోసం భారతదేశ చరిత్ర పుస్తకం రాసింది. దాంతో మొదలెట్టండి"
"మీరేదో పెద్ద లావుగా వుండే భయంకరమైన పుస్తకం పేరు చెబుతారనుకున్నాను. చిన్నపిల్లల పుస్తకమా?" అన్నాడు కిట్టూ...
చిరు మందహాసంతో చెప్పారు రాధాకృష్ణ "చిన్నగా మొదలు పెట్టండి. ఆర్భాటం, ఆరంభ శూరత్వం వద్దు. అలాగే 'ఎన్.సి.ఇ.ఆర్.టి.' వాళ్ల ఏడు నుండి పది వరకు పాఠ్య పుస్తకాలు చదవండి"
"సార్... మీరేం పుస్తకాలు చదువుతారు ఖాళీ సమయంలో?" అడిగాడు కిట్టూ...
"తెలుగులో వున్న చందమామ, బాలమిత్రలు..." చెప్పారు రాధాకృష్ణ.
"సార్... చాలా విషయాలు తెలుసుకున్నాను. చాలా చాలా థాంక్స్"

"నేను కూడా మీతో మాట్లాడుతూ చలా విషయాలు తెలుసుకున్నాను. సివిల్స్ మీద ఇన్ని అపోహలు వున్నాయని నేనూ ఇప్పుడే తెలుసుకున్నాను" అన్నారు రాధాకృష్ణ.

రెండు చేతులూ జోడించి నమస్కరించాడు కిట్టూ...
తను కూడా ప్రతి నమస్కారం చేస్తూ "నేనేం గొప్పవాడిని కాను. నన్ను మామూలుగా పలకరిస్తే చాలు. ఈ నమస్కారాలు వద్దు. ఆల్ ది బెస్ట్" అన్నారు రాధాకృష్ణ.

ఒకరోజు సాయంత్రం కిట్టూ రూంకి వచ్చేటప్పటికి కమలాకర్ తో పాటు ఇంకొకతను వున్నాడు. అతడిది వీళ్ల వయసే...
"ఇతను గిరిధర్ అనీ... రాధాకి మంచి ఫ్రెండ్... ఈరోజు ఇక్కడే వుంటాడు. ఈరోజు వంటపని నీదే... వస్తూ వస్తూ చికెన్ ఎక్కువ తెచ్చాను. వండి పడెయ్" అన్నాడు కమలాకర్.

గిరిధర్ కి హలో చెప్పి వంటగదిలోకి వెళ్లి స్టవ్ వెలిగించాడు కిట్టూ... గిరిధర్ కూడా వంటగదిలోకి వచ్చాడు. ఎంతోకాలం నుండి పరిచయమైనవాడిలాగా కబుర్లు చెబుతూ ఉల్లిపాయలు తరిగాడు. మసాలా నూరేసి కిట్టూకు రెడీగా అందించాడు. క్షణాల్లో మాటల్లోనే వంట రెడీ అయిపోయింది.

గిరిధర్ బయటకు వెళ్లి వోడ్కా బాటిల్ పట్టుకొచ్చాడు. కూర చేసిన పాత్రను మధ్యలో పెట్టుకుని ముగ్గురూ గ్లాసుల్లో వోడ్కా పోసుకుని చికెన్ తింటూ కబుర్లాడుతున్నారు.

ఈలోపు బ్యాగులో నుండి ఫ్లూట్ బయటకు తీశాడు గిరిధర్. ఏవేవో తెలుగు పాటలు పలికిస్తున్నాడు. కిట్టూ ఆ పాటల్ని గుర్తు పడుతున్నాడు. గిరిధర్ కిట్టూని తెగ మెచ్చుకుంటున్నాడు. కిట్టూ గిరిధర్ ని పొగుడుతున్నాడు. మందు బాగా పని చేస్తోంది.
"బయల్దేరారయ్యా... ఇద్దరు ఆర్టిస్టులు" అన్నాడు కమలాకర్.
ఈలోపు కిట్టూ పాటందుకున్నాడు.
 

 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
o college drop out gadi prema katha