Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
aditya hrudayam

ఈ సంచికలో >> సినిమా >>

కొత్త సన్నివేశాలతో మే 9 న సంపూర్ణేష్ మళ్ళీ వస్తున్నాడు

kotta sanniveshaalato may9th na sampoornesh mallee vastunnaadu

మొదట యూ ట్యూబ్ లో సంచలనం సృష్టించి ఆ తరువాత ఏప్రిల్ నెలలో థియేటర్లలో "హృదయకాలేయం" తో ప్రేక్షకులను అలరించిన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు మళ్ళీ మన ముందుకు రాబోతున్నాడు. కొత్త సినిమాతో కాదు.. మళ్ళీ హృదయకాలేయం తోనే.

సంపూర్ణేష్ బాబు  మట్లాడుతూ...

నన్ను ఆదరించిన ప్రేక్షక దేవుళ్ళకు ఆ జన్మాంతం రుణపడి ఉంటాను. ఏప్రిల్ నెలలో ఎగ్జాంస్, ఎలక్షన్లతో బిజీగా వున్న చాలా మంది హృదయకాలేయం చిత్రం ను మళ్ళీ రిలీజ్  చేయమని ఒత్తిడి చేస్తున్నారు. అందుకే మరికొన్ని సీన్లు మరియు నా విన్యాసాలను జతచేసి  నా జన్మదినం సంధర్భంగా మే 9న మళ్ళీ  ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు  గర్వపడుతున్నాను. నా అభిమానుల కోరికను మన్నించి  రీ-రిలీజ్ చేయడానికి ఒప్పుకున్న మా దర్శక  నిర్మాత స్టీవెన్ శంకర్ (సాయి రాజేష్) కు మరియు నైజాం పంపిణీదారులు రాజ్ కందుకూరికి, హ్యాపి మూవీస్ వారికి నా కృతజ్ఞతలు అని అన్నారు.

సదా మీ ప్రేమకు బానిస మీ సంపూ...

మరిన్ని సినిమా కబుర్లు
songs recordinglo seetaaraamula premakatha