Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
songs recordinglo seetaaraamula premakatha

ఈ సంచికలో >> సినిమా >>

కామరాజు వాస్తు శాస్త్రం

kaamaraaju vaastu shaastram
కమల్ కామరాజు ఎవరంటే ఎవరైనా "సినీ హీరో" అని చెప్తారు. కానీ ఆయన వాస్తు శిల్పి అని పరిశ్రమ వర్గాలకి తప్ప చాలా మందికి తెలియదు. "వాస్తు శిల్పి" అంటే వాస్తు శాస్త్రం చెప్పే సిధ్ధాంతి అనుకునేరు! మ్యాటర్ అది కాదు. ఈయన విద్యాభ్యాసం రిత్యా ఆర్కిటెక్ట్. ఆర్కిటెక్ట్ ని తెలుగులో "వాస్తు శిల్పి" అనే అనాలి మరి. పలువురు ప్రముఖుల ఇళ్లకు, కార్పొరేట్ కంపెనీలకు కామరాజుకు అద్భుతమైన డెజైన్స్ అందించిన నేపధ్యం ఉంది. 
 
ఒక సరదా సమయంలో "వాస్తు శాస్త్రం చెప్పే విషయాలను కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందంటారా"? అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా, "అమెరికా, సింగపూర్, ఇంగ్లాండ్ వంటి ఏ సంపన్న దేశము మన వాస్తు పుస్తకాల్లో చెప్పినట్టు కట్టడాలు కట్టట్లేదు. అయినా అవి సంపన్నంగానే ఉంటున్నాయి. మన దేశంలో వాస్తుని ఫాలో అయ్యి కట్టే చాలా నిర్మాణాల్లో లాజిక్ ని పక్కన పెట్టేసి, అవసరం లేని మార్పులు, చేర్పులు చెయ్యడానికి కోట్లు ఖర్చుపెడుతున్నారు. అయినా మన ఇండియా ఎప్పటికీ డెవెలొపింగే కానీ డెవెలొప్డ్ కావట్లేదెందుకో! " అన్నారు. 
 
ఒక రకంగా ఇది ఆలోచించదగ్గ విషయమే. తాను వ్యక్తిగతంగా వాస్తు నిపుణులు చెప్పే ప్రతి విషయాన్ని మూఢంగా నమ్మనని, అయితే అందులో శాస్త్ర పరంగా లాజికల్ గా పనికి వచ్చే కొన్ని అంశాలు మాత్రమే తన డెజైన్స్ లో వాడతానని చెప్పారు. "నిజానికి వాస్తుని గట్టిగా నమ్మే వారితో నేను వాదించను. వాదించినా ప్రయోజనం ఉండదు. ఎవరి నమ్మకం వారిది అనుకుంటానంతే". అన్నట్టు తాజాగా ఒక సుప్రసిధ్ధ దర్శకుడి కొత్త ఇంటికి కమల్ కామరాజే ఆర్కిటెక్ట్!!
మరిన్ని సినిమా కబుర్లు
maine pyaar kiyaa navvulu