Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
saahiteevanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

వారఫలం - శ్రీకాంత్

మే 09 - మే 15 

మేష రాశి

ఈవారం మొత్తంమీద శుభకార్యములకు సమయాన్ని కేటాయిస్తారు సమయాన్ని సంతోషంగా గడిపేందుకు ప్రయత్నం చేస్తారు. పెద్దల నుండి వచ్చిన సలహాలను పాటించుట వలన మేలుజరుగుతుంది. సోదరవర్గంతో కలిసి చేసిన ఆలోచనలు ముందుకు వెళ్ళకపొవచ్చును మాటపట్టింపులకు పోకండి చాలావరకు సర్దుకుపోవడం మంచిది. నూతన ఆలోచనలు కలిగి ఉంటారు కాకపోతే అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట వలన మేలుజరుగుతుంది. ఒకవార్తమూలాన కొంత నిరాశను పొందుతారు. మానసికంగా దృడంగా ఉండుట మంచిది. విద్యార్థులకు సామాన్యమైన ఫలితాలు పొందుతారు. సరైన సమయానికి సమయంలో మంచి నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగులకు పనిఒత్తిడి తప్పదు కొత్త పనులను చేపట్టుటకు అవకాశం ఉంది. వ్యాపారస్థులకు బాగుంటుంది తమఆలోచనలు మంచి ఫలితాలనే కలగజేస్తాయి. కళారంగంలోని వారికి ఓపిక అవసరం నిదానంగా ముందుకు వెళ్ళండి లేకపోతే ఇబ్బందులు తప్పవు.  

 

వృషభ రాశి

ఈవారం మొత్తంమీద ప్రయత్నాలు వారం చివరలో అనుకూలిస్తాయి తొందరపాటు నిర్ణయాలు చేయకండి. నూతన పనులను చేపట్టుట కన్నా గతంలో ఆరంభించిన పనులను పూర్తిచేసే ప్రయత్నం చేయండి. ఆర్థికపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించుట మంచిది,అనవసరమైన ఖర్చులు అవ్వకుండా ప్రయత్నం చేయండి. బంధుమిత్రులతో సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. ప్రయాణాల విషయంలో నిర్ణయాలు బాగాఆలోచించి తీసుకోండి.విద్యార్థులకు తలపెట్టిన పనుల పట్ల శ్రద్దఅవసరం సమయాన్ని వ్రుదాచేయకండి. ఉద్యోగులకు ఉద్యోగంలో అధికారుల సూచనలు,సలహాలను పాటించుట వలన మేలుజరుగుతుంది. వ్యాపారస్థులకు నూతన అవకాశాలు కలుగుతాయి వాటికి సమయాన్ని కేటాయిస్తారు. సమయానికి ధనం చేతికి అందుతుంది. కళారంగంలోని వారికి పనిఉంటుంది సమయాన్ని బిజీగా గడిపే అవకాశం ఉంది గతంలో మీరు తలపెట్టిన పనులు కార్యరూపం దాల్చుతాయి.  
 

 


మిథున రాశి

ఈవారం మొత్తంమీద పనుల విషయంలో మొదట్లో కనభర్చిన ఉత్సాహంను చివరి వరకు కొనసాగించే ప్రయత్నం చేయండి శ్రద్ద అవసరం . దూరప్రదేశం నుండి విన్న వార్తల మూలాన సంతోషాన్ని పొందుతారు. అధికారుల నుండి కొత్త పనులను చేపడుతారు వాటిని పూర్తిచేయుటకు అధికంగా శ్రమించవలసి రావోచ్చును. ప్రతిఆలోచనను పాటించే ప్రయత్నం చేయకపోవడం మంచిది. ఖర్చుల విషయంలో మంచి ప్రణాళికతో ముందుకు వెళ్ళండి తప్పక మేలుజరుగుతుంది. విద్యార్థులు నూతన పనులను చేపట్టుటకు ఉత్సాహంను చూపిస్తారు కాకపోతే అనుభవజ్ఞుల సూచనలు పాటించుట మంచిది. ఉద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి బదిలీలు అనుకూలంగా అయ్యే అవకాశం ఉంది కొంత ప్రయత్నం చేయండి. వ్యాపారస్థులకు స్థలమార్పిడి సూచనలు కలవు వీటివిషయంలో బాగాఆలోచించి నిర్ణయం తీసుకోండి. కళారంగంలోని వారికి ప్రయత్నం మీద ఆశించిన ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది నూతన ప్రయత్నాలు చేస్తారు.  

 


కర్కాటక రాశి

......ఈవారం మొత్తంమీద ఆరభంలో మాటతీరు మూలాన ఇబ్బందులు ఎదుర్కొంటారు కావున ఇబ్బందులు అధిగమించే ప్రయత్నం చేస్తారు. ప్రయాణాలకు సమయాన్ని కేటయించే అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. వ్యతిరేకవర్గం నుండి వచ్చు సమస్యల నుండి తెలివిగా మసలుకొనే అవకాశం ఉంది. నచ్చిన వ్యక్తులతో సమయాన్ని గడుపుతారు. పెద్దలతో నూతన పరిచయాలు కలుగుటకు ఆస్కారం కలదు.విద్యార్థులకు మిశ్రమఫలితాలు ఉంటవి ఆలోచనల్లో మంచి మార్పుల మూలాన మేలుజరుగుతుంది. ఉద్యోగులకు అధికారులతో మంచి సంభదాల కోసం చేసిన ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపారస్థులకు వ్యాపారపరమైన విషయాల్లో అనుభవజ్ఞుల సూచనలు పాటించుట వలన మేలుజరుగుతుంది. కళారంగంలోని వారికి నూతన అవకాశాలు పొందుతారు వాటిని సద్వినియోగం చేసుకొనే ప్రయత్నం చేయండి అందరిని కలుపుకొని వెళ్ళుట వలన మేలుజరుగుతుంది.

 


సింహ రాశి

ఈవారం మొత్తంమీద ప్రయత్నాల విషయంలో మాత్రం నలుగురిని కలుపుకొని వెళ్ళండి. తలపెట్టిన పనులను నిదానంగా పూర్తిచేసే అవకాశం ఉంది. అధికారులను కలుస్తారు మీ ఆలోచనల మూలాన వారితో గుర్తింపును పొందుతారు. మృష్టాన్నభోజన ప్రాప్తిని కలిగి ఉంటారు సమయాన్ని విందులలో గడిపే అవకాశం ఉంది. మాటను పొదుపుగా వాడుట చేత మేలుజరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యతిరేకవర్గం నుండి వ్యతిరేకతలను సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం ఉంది. విద్యార్థులకు తమఆలోచనల విషయంలో స్పష్టమైన అవగాహన ఏర్పుచుకొనే అవకాశం ఉంది. పెద్దలతో మీ ఆలోచనలు పంచుకొనే ప్రయత్నం మంచిది. ఉద్యోగులకు నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి.కుటుంభసభ్యులకు సమయాన్ని కేటాయిస్తారు. వ్యాపారస్థులకు లాభం ఉంటుంది ధనమువిషయంలో సంతృప్తిని పొందుతారు. కళారంగంలోని వారికి ఖర్చులు పెరుగుటకు అవకాశం ఉంది అలాగే నూతన పరిచయాలు అవుతాయి

 

కన్యా రాశి

......ఈవారం మొత్తంమీద తలపెట్టు పనుల విషయంలో ప్రణాళిక అవసరం సమయం వృధాచేయకండి. శుభాకర్యములలో పాల్గొనే అవకాశం ఉంది బంధుమిత్రులకు సమయాన్ని కేటాయిస్తారు. ఉద్యోగంలో నిదానంగా వ్యవహరించుట సమయపాలన పాటించుటవలన మేలుజరుగుతుంది. కుటుంభంలో స్వల్ప విభేదాలు కలుగుటకు అవకాశం ఉంది సర్దుబాటు విధానం ఆవలంభించుట ఉత్తమం. ఆరోగ్యపరమైన విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మూలాన మేలుజరుగుతుంది. అధికమైన ఆలోచనల మూలాన సతమవుతారు. శ్రమను కలిగి ఉంటారు. విద్యార్థులకు శ్రద్దకలిగి ఉండుట వలన మేలుజరుగుతుంది. సమయం వృధాచేయకండి పెద్దల సూచనలు పాటించుట మంచిది. ఉద్యోగులకు అధికారులతో కలిసి పనిచేయవలసి వస్తుంది. పనిభారం ఉంటుంది కాకపోతే ప్రణాళిక అవసరం. వ్యాపారస్థులకు మాటతీరు ప్రభావితం చేస్తంది నిదానంగా వ్యవహరించుట సూచన. కళారంగంలోని వారికి ప్రయాణాల వలన తీరిక లేకుండా ఉంటుంది

 
తులా రాశి

ఈవారం మొత్తంమీద తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. వారం మధ్యలో అనవసరమైన ఆలోచనలకు సమయాన్ని వృధాచేసే అవకాశం ఉంది కావున వాటిని నిలువరించుకొనే ప్రయత్నం చేయండి. ఆర్థికపరమైన విషయాల్లో బాగుంటుంది నూతన అవకాశాలు పొందుతారు. బంధుమిత్రులతో సమయాన్ని సంతోషంగా గడుపుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కుటుంభసభ్యులతో కలిసి చేయుఆలోచనల విషయంలో తొందరపాటు వద్దు పెద్దల సూచనలు పాటించుట మంచిది. విద్యార్థులు సమయాన్ని మిత్రులతో గడిపే అవకాశం ఉంది సమయాన్ని సరదాగా గడుపాలనే తలపంను కలిగి ఉంటారు. ఉద్యోగులకు వివిధరకములైన ఆలోచనలతో సతమతమవుతారు పెద్దల సలహాలు ఉపయోగపడుతాయి. వ్యాపారస్థులకు కొత్త కొత్త ఆలోచనలు ఉంటవి వాటిని అమలు చేసే ప్రయత్నం చేస్తారు. కళారంగంలోని వారికి మిత్రులతో కలిసి ఉన్నపుడు మాటపట్టింపుల వలన మనసపర్తలు కలుగుటకు అవకాశం ఉంది.

 

 

వృశ్చిక రాశి

.......ఈవారం మొత్తంమీద తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు కాకపోతే తలకుమించిన భారం వద్దు. బంధుమిత్రులతో సమయం గడుపుతారు. ఉద్యోగంలో చేపట్టిన ప్రయత్నాల వలన మేలుజరుగుతుంది కాకపోతే అధికారుల ఆలోచనలు పాటించే ప్రయత్నం చేయుట ఉత్తమం. నూతన ప్రయత్నాల విషయంలో తొందరపాటు వద్దు బాగాఆలోచించి నిర్ణయం తీసుకోండి. ప్రయాణాల విషయంలో నిదానంగా వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది. కుటుంభసభ్యులతో కలిసి శుభకార్యములలో పాల్గొనే అవకాశం ఉంది. విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు గోచరం కావున శ్రద్దఅవసరం. ఉద్యోగులకు మంచిగుర్తింపును పొందుతారు అయినను పూర్తిస్థాయి సంతృప్తి ఉండకపోవచును. వ్యాపారస్థులకు బాగుంటుంది సంప్రదాయక విషయంలో లబ్దిని పొందుతారు. నూతన ఆలోచనలు చేయకండి. కళారంగంలోని వారికి నూతన అవకశాలు ఉంటవి. దూరప్రదేశం నుండి నచ్చిన వార్తను వినే అవకాశం ఉంది.  

 

ధనస్సు రాశి

......ఈవారం మొత్తంమీద ఆర్థికపరమైన విషయాల్లో అనుభవం చాలావరకు ఉపకరిస్తుంది అలాగే పూర్తిస్తాయి ఆలోచనలతో నిర్ణయం తీసుకోండి. ఉద్యోగంలో అధికారులతో చర్చలు చేయుటకు అవకాశం ఉంది. ప్రయాణాల విషయంలో నూతన ఆలోచనలు చేస్తారు. కుటుంభసభ్యులతో కలిసి కొత్త కొత్త ఆలోచనలకు ప్రాదాన్యం ఇస్తారు,నూతన నిర్ణయాల విషయంలో తొందరపాటు వద్దు. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉన్నను మానసికంగా దృడంగా ఉండుట మంచిది. ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటారు.విద్యార్థులకు శ్రమను కలిగి ఉన్నను ఫలితాలు ఆశించిన విధంగా రావడం వలన నలుగురిలో మంచి గుర్తింపును పొందుతారు. ఉద్యోగులకు తోటివారితో స్వల్ప విబేదాలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త,మీకు వచ్చిన గుర్తింపుకు తోటివారు అసూయ చెందుటకు అవకాశం కలదు. వ్యాపారస్థులకు సేవాకార్యక్రమాలకు సమయం ఇవ్వాలనే కోరిక కలుగుతుంది. కళారంగంలోని వారికి మిశ్రమఫలితాలు ఉండే అవకాశం ఉంది.

 


మకర రాశి

......ఈవారం మొత్తంమీద సమయానికి భోజనం చేయుట మంచిది. తలపెట్టిన పనులను మధ్యలో ఆపివేసే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ద వద్దు సమయానికి భోజనం చేయుట సూచన. కుటుంభసభ్యులతో స్వల్ప విబేదాలు కలుగుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారుల వలన ఇబ్బందులు తప్పక పోవచ్చును నిదానంగా వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది. కుటుంభసభ్యులతో మనస్పర్థలు కలుగుటకు అవకాశం ఉంది పెద్దల సూచనలు పాటించుట వలన మేలుజరుగుతుంది. ప్రయాణాలు వాయిదా వేయుట వలన మేలుజరుగుతుంది.విద్యార్థులకు సమయపాలన అవసరం పెద్దలతో ఆలోచనలు పంచుకోండి వారిసూచనలు పాటించుట వలన మేలుజరుగుతుంది. ఉద్యోగులకు బదిలీలు అయ్యే అవకాశం ఉంది అనుకున్న చోటుకి బదిలీలు అయ్యే అవకాశం ఉంది. వ్యాపారస్థులకు బాగుంటుంది ధనము సమయానికి చేతికి అందుతుంది. కళారంగంలోని వారికి వ్యతిరేకవర్గం వలన ఇబ్బందులు కలుగుటకు అవకాశం ఉంది నిదానం అవసరం.

 


కుంభ రాశి

ఈవారం మొత్తంమీద నూతన పరిచయాలు కలుగుటకు అవకాశం ఉంది వారితో సమయం గడుపుతారు. నలుగురికి ఉపయోగపడే ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో బాగుంటుంది నూతన ప్రయత్నాలు మొదలు పెడతారు. సమయానికి ధనం చేతికి అందుతుంది. ప్రయాణాల విషయంలో కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. శుభకార్యములలో పాల్గొనే అవకాశం ఉంది సమయాన్ని గడుపుతారు. విద్యార్థులకు విదేశీయాన అవకాశాలు అనుకూలిస్తాయి. ఉన్నతవిద్యా అవకశాలు కలవు ప్రయత్నం చేయండి. ఉద్యోగులకు ఇబ్బందులు తప్పకపోవచ్చును అధికారులతో మాటపట్టింపులకు పోకండి. వ్యాపారస్థులకు మిశ్రమఫలితాలు కలుగుతాయి. నూతన పనులకు సమయాన్ని కేటాయించే అవకాశం ఉంది. కళారంగంలోని వారికి బాగుంటుంది ఆర్థికంగా నూతన అవకాశాలు పొందుతారు


మీన రాశి

........ఈవారం మొత్తంమీద ఉత్సాహంతో నూతన పనులను చేపట్టుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో పెద్దల ద్వార నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. సమయానికి భోజనం చేయుట మంచిది అనారోగ్యసమస్యలు కలుగుటకు అవకాశం ఉంది. నూతన పరిచయాలు కలుగుటకు అవకాశం ఉంది,మిత్రులతో సమయాన్ని గడుపుతారు నలుగురికి ఉపయోగ పడే ఆలోచనలు చేపట్టుటకు అవకాశం ఉంది. కుటుంభంలో తల్లివర్గం ద్వార ఒక విషయం తెలుసుకుంటారు. విద్యార్థులకు మాములుగా ఉంటుంది సమయపాలన ఉంటె విజయాన్ని సొంతం చేసుకొనే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఆలోచనల్లో స్థిరత్వం ఉండకపోవచును పెద్దల సూచనలు పాటించుట వలన మేలుజరుగుతుంది. వ్యాపారస్థులకు ప్రయత్నాలు అనుకూల్సితాయి పెట్టుబడలకు అనుకూలమైన సమయం. కళారంగంలోని వారికి కొత్త కొత్త అవకాశాలు కలుగుటకు అవకాశం ఉంది ఆర్థికంగా బాగుంటుంది

 


శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిష్యాలయం

మరిన్ని శీర్షికలు
nedurumallito zedplus prayaanam