కావలిసిన పదార్దాలు:
జీలకర్ర
ఉడికిన అన్నం
ఎండు మిర్చి
కరివేపాకు
ఉప్పు
పసుపు
నెయ్యి, నూనె
తయారు చేసే విధానం:
ముందుగా బాణాలిలో నూనె వేసుకుని (సువాసన కోసం కాస్త నెయ్యి కూడా వేసుకోవచ్చు) అది కాగాక జీలకర్ర తగినంత వేసుకుని కరివేపాకు, ఎండుమిర్చి, పసుపు కొంచెం, వేసి బాగా కలపాలి. తరువాత కొంచెం మంట తగ్గించి ఉడికిన అన్నాన్ని వేసి బాగా కలుపుకోవాలి. తరువాత ఉప్పు తగినంత వేసి కలిపాలి.
అంతే వేడి వేడి జీరా రైస్ రెడీ...
|