Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Arthur Cotton

ఈ సంచికలో >> శీర్షికలు >>

జాతకచక్రం (మే 18 - మే 24) - శ్రీ నంద

'గోతెలుగు.కామ్' పాఠకుల ప్రశ్నలకు శ్రీ నంద గారు సమాధానాలిస్తారు. మీ యొక్క ప్రశ్నలను(ఒక్కటి మాత్రమే) మీ పేరు, పుట్టిన తేది, సమయం, పుట్టిన ఊరు జతచేసి 'goteluguastro@gmail.com ' కి పంపగలరు. 
 


 

ప్ర. నా భవిష్యత్తు ఎలా వుంటుందో చెప్పగలరు. రాధాకృష్ణ, కర్నూలు
జ. రాధాకృష్ణ మీరు ఉత్తరాభాద్ర నక్షత్రం,మీనరాశిలో జన్మించారు . మీరు తీసుకొనే నిర్ణయాలు మంచిగానే ఉంటాయి కాకపోతే కొన్నిసందర్భాలలో ఒంటెద్దు పోకడ ఉండటం చేత ఇబ్బందులను పొందుతారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మూలాన తప్పు జరిగే అవకాశం కలదు జాగ్రత్త. ప్రస్థుతం కేతు మహర్దశ లో శని అంతర్దశ,జనవరి 2014 నుండి కేతువులో బుధ అంతర్దశ జరుగుతుంది. అనారోగ్యసమస్యలు ఉంటవి. మీ కోపాన్ని తగ్గించుకోవడం మేలు. ధనం విషయంలో ఖర్చులు ఎక్కువగా పెడతారు ఈ విషయంలో కొద్దిగా ప్రణాళికా ప్రకారం వెళ్ళడం మంచిది. వ్యాపారం చేయాలనే ఆలోచన కలిగి ఉంటారు సిమెంట్,ఇనుము రంగాలు అనుకూలిస్థాయి.

భవిష్యత్తు బాగానే ఉంటుంది. ప్రస్థుతం మీకు సోదరవర్గంతో విభేదాలు కలిగే అవకాశం కలదు కొద్దిగా సర్దుకుపోవడం చేత మనస్పర్థలు తగ్గుతాయి. ఆరోగ్యం విషయంలో మాత్రం అశ్రద్ద చేయకండి. ఈ సంవత్సరం కొత్త ఆలోచనలు చేస్తే పెద్దల సూచనలు పాటించండి. ఆరోగ్యం విషయంలో మెరుగైన ఫలితాల కోసం ప్రతిఆదివారం ఆదిత్యహృదయం చదవడం,నెలకు ఒకమారు ఆదివారం శివునకు అభిషేకం చేయండి. 7 మంగళవారాలు సుబ్రమణ్య ఆరాధన చేయండి. ఉలువలు 1. 25 కే జి ధానం చేయండి.

ప్ర. నాకు వుద్యోగం ఎప్పుడు వస్తుందో తెలుపగలరు, ఇస్కపల్లి నాగరాజు - ఒంగోలు
జ. నాగరాజు మీరు సమయాన్ని పంపలేదు కావున న్యుమరాలజి ప్రకారం మీ విషయాలు తెలుపుతున్నాను. ఈ సంవత్సరం ఖర్చులు పెరుగుతాయి గట్టిగా ప్రయత్నం  చేస్తేనే  మంచి ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారం చేయలానే కోరికను కలిగి ఉంటారు బాగా ఆలోచించి వ్యాపారం చేయండి. మేనేజ్మెంట్ రంగాలు అలాగే పాల,వస్త్ర రంగాలు అనుకూలిస్థాయి. చేసేపనిలో శ్రద్దను కలిగి ఉండటం చేయండి ఒకే విషయంపైన కొంత కాలం ఉండటం మంచిది. తరుచు ఆలోచనలు మార్చకండి. 

మీయొక్క ఆలోచనలు వేగాన్ని కలిగి ఉండటం వాటిని అమలు చేసే ప్రయత్నంలో స్థిరమైన విధానం పాటించుట ఉత్తమం. 2013 జూన్ నుండి 2014 జూన్ వరకు ఖర్చులు పెరుగుతాయి. ఈ సమయంలో నూతన ప్రయత్నాలు చేయకండి. 2014 జూన్ తర్వాత బాగుంటుంది మీరు అనుకున్నవి జరుగుతాయి. ప్రతిరోజు విష్ణుసహస్రనామం చదవడం,పెరుగును దానం చేయుట అలాగే గణపతికి ప్రతిమాసం అభిషేకం చేయండి. నెలకు ఒకమారు గురువారం శివునకు అభిషేకం చేయండి మంచి ఫలితాలు కలుగుతాయి.

ప్ర. నా యెక్క పూర్తి జాతకం ను నిర్మొహమాటం గా చెప్పగలరు. త్రికోటేశ్వర రావు రామరాజు, మాచెర్ల,గుంటూరు జిల్లా.
జ. రామరాజు మీరు మఖనక్షత్రం, సింహారాశికి చెందినవారు. మీకు కాలసర్పయోగం ఉంది చేపట్టిన పనులు కావోచ్చును లేదా మీరు ఆశించినది ఏదైనా సరే కొంత ఆలస్యంగా జరుగుతాయి. ప్రస్తుతం రవి మహర్దశలో బుధ అంతర్దశ నడుస్తుంది. సెప్టెంబర్ 2013 నుండి రవిలో కేతు మహర్దశ జరుగుతుంది. 2009 నుండి మిశ్రమ ఫలితాలను పొందుతున్నారు. 2010 నుండి 2011 మధ్య కాలంలో అధికమైన ఖర్చులు లేదా ఆరోగ్యసమస్యలను ఎదుర్కొన్నారు.
సుఖాన్ని కోరుకుంటారు కష్టపడటం ఇష్టపడరు. కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రం మీకు నచ్చితే బాగా కస్టపడి పనులను పూర్తిచేస్తారు. ఆర్థికంగా ఇబ్బందులను పొందుతారు. ధనంకు సంభందించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మీ మాటను ఇతరులు వినాలన్న కోరకను కలిగి ఉంటారు. అలాగే నిర్ణయాల్లో తరుచు మారుపును కలిగుంటారు.

మీరు తీసుకొనే ఆలోచనలు తొందరపాటుతో కాకుండా బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. పంచమంలో నీచబంగరాజయోగం ఉండటం చేత వ్యాపారసంభంద విషయాల్లో ఆలోచనలు చేస్తారు కాకపోతే వ్యపారాలు అనుకూలించవు. ఉద్యోగంలో స్థిరంగా పనిచేస్తే మంచిఅభివృద్దిని పొందుతారు.2013 సెప్టెంబర్ తర్వాత బాగుంటుంది. 2015 నుండి మరిన్ని మంచి ఫలితాలను పొందుతారు. ప్రతిరోజు సూర్యనమస్కారాలు చేయండి. ప్రతిరోజు ధ్యానం చేయండి అలాగే శ్రీకాళహస్తిలో సర్పదోషపూజ చేయండి.

ప్ర. వుద్యోగం  మరియు భవిష్యత్తు ఎలా వుంటుందో చెప్పగలరు. రామకృష్ణ, నరసరావుపేట.
జ.  రామకృష్ణ మీరు కృత్తికా నక్షత్రం వృషభరాశిలో జన్మించారు. ప్రస్థుతం రాహుమహర్దశలో శని అంతర్దశ నడుస్తుంది. మేరు చేసే పనిలో లాభాలను పొందలేరు. అధికంగా శ్రమిస్తే కాని పనులు పూర్తికావు. మీ ఉద్యోగస్థానంలో ఒడిదుడుకులు ఉంటవి ఎక్కువకాలం ఒకే స్థానంలో ఉండటాన్ని ఇష్టపడరు. ఆలోచనలు అధికంగా చేస్తారు తక్కువగా ఆలోచించి పని పైన దృష్టిని సారించండి. దృడమైన ఆలోచనలు కలిగి ఉంటారు మంచి శరీరాన్ని కలిగి ఉంటారు. కాకపోతే అశ్రద్ద చేస్తే అనారోగ్య సమస్యలు భాదిస్తాయి.

ప్రస్థుతం మీరు చేస్తున ఉద్యోగంలోనే  కొంతకాలం ఉండటం మంచిది. 2013 నవంబర్ తర్వాత నూతన ఉద్యోగ పర్య్త్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు చేయకపోవడమే మంచిది లాభాలను పొందలేరు. గట్టిగా ప్రయత్నం చేయుట మూలాన కాంపిటేషన్ ఉద్యోగంలో రాణిస్తారు. తరుచు రవికి జపాలు చేయించుట మంచిది. వరుసగా 19 శనివారాలు ఆంజనేయ స్వామికి ప్రదక్షణలు చేయుట మేలుచేస్తుంది. మంగలవారాలు దుర్గాదేవి గుడికి వెళ్ళుట అమ్మవారికి కుంకుమ అర్చన చేయించి ఆ బొట్టును దారణ చేయుట మంచిది.

ప్ర. నా పుట్టినరోజు 17-08-1989 morning 7-15 am, అద్దంకి లో పుట్టాను. నేను ఒక జ్యోతిష్కుడు ని కలిస్తే పగడం మరియు కనక పుష్య రాగం పెట్టుకోమన్నారు. ఇది నిజమేనా?
జ. మీరు పేరును తెలియజేయలేదు. మీరు ధనిస్టా నక్షత్రం,మకరరాశికి చెందిన వారు. మీరు కనక పుష్యరాగం అలాగే పగడం చెప్పారు అని వ్రాసారు. రత్నం విషయంలో చాలామంది చాలా పద్దతులు పాటిస్తారు. మీ విషయంలో పగడం మంచి ఫలితాలను ఇస్తుంది మీరు జన్మించిన లగ్నానికి ఖుజుడు రాజయోగకారకుడు కావున పగడం ధరించవచ్చును. కనకపుష్యరాగం మాత్రం దరించకండి.

రత్నాలతో పాటు శనివారాలు,గురువారాలు దేవాలయం సందర్శించుట మంచిది. ఏదైనా పనిని చేసే టప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుట మంచిది. చక్కగా ప్రణాలికా ప్రకారం నడుచుకుంటే మంచి భవిష్యత్తు కలదు.

ప్ర. నా భర్త వివరాలు కూడా పంపుతున్నాను. దయచేసి మా వివాహ బంధం ఎలా వుంటుందో చెప్పగలరు.
జ . రమగారు మీ ఇద్దరి జాతకాలు పరిశీనించిన తర్వాత. మీ ఇద్దరి వివాహాపొంతన  మధ్యస్థంగా ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో మే ఇద్దరికి వివాదములు సంభవిస్తున్నాయి అని అనిపిస్తుంది. మీ ఇద్దరి ఆలోచనా విధానాలు వేరుగా ఉంటవి మీరు నిదానంగా స్పందించడం మీ వారు తన మాటనే వినాలనే దొరనని కలిగి ఉండటం మమూలాన కూడా వివాదములుకలుగుతున్నవి. మీరు కూడా మొండితనాన్ని వీడాలి కొంత కష్టపడే విధానం అలవాటు చేసుకొవాలి. మీవారు కూడా  తననుతాను మేధావిగా అనుకోకుండా పెద్దల సలహాలను వినడం మంచిది.

శ్రీకాళహస్తీలో పూజ చేయండి అలాగే దుర్గాదేవి ఆలయంలో తరుచు పూజలు చేయడం మంచిది. ప్రతిరోజు విష్ణుసహస్ర నామం చదవడం మేలుచేస్తుంది. తరచు ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయండి మనస్పర్థలు తగ్గుతాయి. భవిష్యత్తులో తప్పక వివాదములు తొలగుతాయి. తొందరపాటు నిర్ణయాలు చేయకండి. అలాగే మీరు ప్రతిరోజు లక్ష్మీఅష్టోత్తర శతనామస్తోత్రం చదవండి.


వార ఫలాలు (మే 18  - మే 24)


మేష రాశి
ఈవారం మీరు ఆర్థికపరమైన విషయాల్లో ముందుకు వెళ్ళగలరు. ధర్మసంభంద పనులలో పాల్గొంటారు మానసిక ఆనందంను పొందుతారు. మొదట్లో ఇబ్బందులు ఎదుర్కొన్నా మానసికదైర్యంతో ముందుకు వెళ్తారు. బంధుమిత్రులతో మాటపట్టింపులు కలుగుటకు అవకాశం కలదు అనారోగ్య సూచనలు కలవు జాగ్రత్త. చేపట్టిన పనుల్లో వారం ఆరంభంలో ఆటంకాలు కలుగుతాయి. వారం మధ్యనుంచి బాగుంటుంది అనుకున్న పనులను పూర్తిచేయగలుగుతారు. ఇతరులకు సేవచేయుట మూలాన మేలు జరుగుతుంది మీయొక్క ఆలోచనలు,విధానాలు తోటివారికి ఉపయోగపడుతాయి. ఆర్థికంగా అభివృద్దిని పొందుటకు అవకాశాలు కలవు. సౌఖ్యంను పొందుతారు అనుకున్నవి జరుగుతాయి. గాయములు అయ్యే అవకాశం ఉంది నిదానంగా ఉండండి. ప్రయాణాలు చేయునప్పుడు అలాగే ప్రమాదకర వస్తువులతో పనిచేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. సరైన ఆలోచనలు చేయండి పెద్దల సహకారం తీసుకోవడం మేలు. కుటుంభజీవితంలో సౌఖ్యంను పొందుతారు నూతన పరిచయాలు కలుగుతాయి. దూరప్రదేశప్రయాణాలు కలిసి వస్తాయి. మరింత మంచిఫలితాల కోసం సుబ్రమణ్యఅభిషేకం,దుర్గాదేవికి కుంకుమఅర్చన,ప్రతిరోజు సూర్యునికి నమస్కారం చేయడం మంచిది. 

వృషభ రాశి
ఈవారం మీరు మిశ్రమఫలితాలను పొందుతారు అలాగే ఒకింత పనిభారంను పొందుతారు అనిచెప్పుకోవచ్చును. సమయానికి భోజనం చేయడం మేలుచేస్తుంది బంధుమిత్రులతో స్వల్ప మాటపట్టింపులు కలుగుటకు అవకాశం కలదు తగిన జాగ్రత్తలు చేపట్టండి. వారం ఆరంభంలో మానసికంగా సమస్యలను ఎదుర్కొంటారు. ఒకవార్త మీలో నిరాశను కలిగిస్తుంది మానసికంగా దృడంగా ఉండటం అవసరం. వారం చివర్లో మార్పులు చోటుచేసుకుంటాయి ఆర్థికంగా అభివృద్దిని పొందుతారు. కుటుంభంలో సౌఖ్యంను పొందుతారు. ఆరోగ్యంను జాగ్రత్తగా చూసుకోండి తగిన జాగ్రత్తలు పాటించుట మేలు. చంచల మనస్సును కలిగి ఉంటారు. అకారణంగా కలహములు కలుగుటకు అవకాశం కలదు నిదానంగా వ్యవహరించుట ఉత్తమం. అధికారుల వలన భయంను పొందుతారు ఇబ్బందులు కలుగుటకు అవకాశం కలదు ధనం ఖర్చుచేసే విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. గట్టిగా ప్రయత్నాలు చేయుట మూలాన పనులు సానుకూలపడుతాయి. నూతన గృహనిర్మాణం చేయాలన్న ఆలోచన కలిగిఉంటారు. కుటుంభంలో నిరాశను పొందుతారు సర్దుకుపోవడం సూచన. ఇంకా మంచి ఫలితాలు పొందుట కోసం గణపతికిఅభిషేకం,శివారాధన,ప్రతిరోజు లింగాస్టకం చదవడం మేలుచేస్తుంది. 

మిథున రాశి
ఈవారం కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది చేపట్టే పనులను బాగాఆలోచించి ఆరంభించుట సూచన. ధనవ్యయాన్ని పొందుతారు ఖర్చును అదుపులో ఉంచుకొనుట మేలుచేస్తుంది. వారంప్రారంభంలో భోజనసౌఖ్యాన్ని పొందుతారు కాకపోతే సమయపాలనను పాటించుట మేలు. ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు. ఉల్లాసంగా గడుపుతారు ధనలాభంను కలిగి ఉంటారు. తలపెట్టినపనులలో స్వల్పంగా ఇబ్బందులను పొందుటకు అవకాశం కలదు ఆ కారణంచేత ఆందోళనను పొందు అవకాశం కలదు. అనుభవజ్ఞుల సహకారం ఉన్నచో ప్రయత్నకార్యములలో విజయాన్ని పొందుటకు అవకాశం కలదు. ప్రయాణాలు చేయుట మూలాన ధనవ్యయాన్ని పొందుటకు అవకాశం కలదు. మరొకప్రదేశానికి వెళ్ళవలసి రావోచ్చును విలువైనవస్థువుల పట్ల జాగ్రత్తగా ఉండటం అనేది సూచన. అకారణంగా భయంను పొందుతారు. కలహములు కలుగుటకు అవకాశం కలదు నిదానంగా వ్యవహరించుట మేలుచేస్తుంది. స్త్రీ మూలక ఇబ్బందులను పొందుటకు అవకాశం కలదు వివాదములకు దూరంగా ఉండటం అనేది సూచన. మంచి ఫలితాలను పొందుటకోసం ప్రతిరోజు లక్ష్మీఅష్టోత్తరం చదవడం,వేంకటేశ్వరస్వామికి అర్చన,దుర్గాదేవికి కుంకుమ అర్చన చేయడం మంచిది.

కర్కాటక రాశి
ఈ వారం శుభకార్యములలో పాల్గొంటారు బంధువులతో సంతోషంగా గడుపుతారు. మధురపదార్థముల యందు ఆసక్తిని కలిగి ఉంటారు. ఆర్థికంగా లాభాలను కలిగి ఉంటారు ధనలాభం ఉంటుంది. వారం ఆరంభంలో భోజనసౌఖ్యంను కలిగి ఉంటారు,ఉత్సాహంతో పనులను చేపడుతారు కాని ఆ పనిపైన సరైన శ్రద్ధను చూపకపోవడం చేత ఇబ్బందులను పొందుతారు. మాట్లాడేటప్పుడు లేదా ఇతరులతో కలిసి పనిచేయునప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. అనారోగ్యం మూలాన ఇబ్బందులను పొందుటకు అవకాశం కలదు తగిన జాగ్రత్తలు తీసుకోండి. నూతన ఆలోచనల పట్ల ఉత్సాహంను చూపిస్తారు. పూజాదికార్యక్రమాలలో పాల్గొనే అవకాశం కలదు. వ్యతిరేకవర్గం నుంచి ఎదురయ్యే సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. యత్నిత కార్యములలో ముందుకు వెళ్తారు విజయవంతంగా పనులను పూర్తిచేసేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రయాణాల మూలాన సమస్యలను పొందుతారు చిక్కులను పొందుటకు అవకాశం కలదు తగినవిధంగా ఆలోచించుట మూలాన మేలుజరుగుతుంది. మరింత మంచి ఫలితాలకోసం దుర్గాదేవిని ఆరాదించుట,ప్రతిరోజు దుర్గాష్టకం చదవండి,లక్ష్మీదేవికి అభిషేకం చేయండి.  

సింహ రాశి
ఈవారం బాగుంటుంది మంచి ఫలితాలనే పొందుతారు. రాజకీయ వ్యవహారలపట్ల ఆసక్తిని కలిగి ఉంటారు,ఆదిశగా అడుగులు ముందుకు వేస్తారు. అధికారుల సహకారంతో చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. మృష్టాన్న భోజనప్రాప్తిని పొందుతారు,మీయొక్క ఆలోచనలచేత కీర్తిని పొందుతారు. కాకపోతే మాటను జాగ్రత్తగా వాడటం అనేది సూచన. వారం మధ్యలో కొద్దిగా ఇబ్బందులను ఎదుర్కొన్నా వారం చివరలో సమస్యలను అధిగమించగలుగుతారు. చేసేపనులను ఉల్లాసంతో పూర్తిచేస్తారు. ఆరోగ్యం విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోండి భోజనం విషయంలోన జాగ్రత్తలు అవసరం. స్థానమార్పిడికి అవకాశం కలదు. కుటుంభసభ్యులు మిమ్మల్ని అపార్థం చేసుకొనే అవకాశం కలదు అందుచేత అనుకోని సమస్యలను ఎదుర్కొంటారు తద్వార శ్రమను పొందుటకు అవకాశం కలదు. మీ వ్యతిరేకవర్గం మీకు సమస్యలను కల్పించే ప్రయత్నంలో సఫలం చెందుతారు మీరు కొద్దిపాటి ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం కలదు. స్త్రీ / పురుష  మూలక సౌఖ్యంను పొందుటకు అవకాశం కలదు బుద్ధిబలం కలిగి ఉన్నచో పనులు ముందుకు సాగుతాయి. సుబ్రమణ్యాస్టకం ప్రతిరోజూ చదవడం,సాయిబాబా దేవాలయం వెళ్ళుట,దక్షిణామూర్తిని పూజించుట చేయండి మేలుజరుగుతుంది.      

కన్యా రాశి
ఈవారం కొద్దిగా ఇబ్బందులను పొందుటకు అవకాశం ఉంది ఖర్చులు పెరుగుతాయి. అకారణంగా ఇతరులతో వివాదములు లేదా కలహములు కలుగుటకు అవకాశం కలదు. వారం ఆరంభంలో బాగున్న తర్వాతా ఇబ్బందులను పొందుతారు. భోజనం విషయంలో సరైన జాగ్రత పాటించుట మంచిది. ఆరోగ్యసంభంద సమస్యలు ఎదుర్కొంటారు. చేసేపనులలో రానురాను ఉత్సాహంను కోల్పోవుటకు అవకాశం కలదు. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం అలాగే ప్రమాదకర వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండటం సూచన. ప్రయాణాల్లో అనుకోని ఇబ్బందులను పొందుతారు. మీయొక్క ఆలోచనావిధానం మార్చుకొనే ప్రయత్నం చేయండి లేకపోతే తోటివారు లేదా ఇతరులు ఇబ్బందులు పొందుతారు. గృహలాభంను పొందుటకు అవకాశం కలదు స్థిరాస్తి విషయంలో ఆసక్తిని కలిగి ఉంటారు. పెద్దలనుంచి మంచి సహాయ సహకారాలు కలుగుట చేత కొన్నిరకాలైన పనులను విజయవంతంగా ముగించగలుగుతారు. కలహములకు దూరంగా ఉండటం చర్చల మధ్యలో కలుగజేసుకోవడం చేయకండి. ప్రతిరోజు విష్ణుసహస్రనామం పారాయణ చేయుట,ఆంజనేయ స్వామికి తైలంతో పూజ చేయండి,దుర్గాదేవికి కుంకుమార్చన అలాగే లక్ష్మీనరసింహా స్వామికి అభిషేకం మంచిది.  

తులా రాశి
ఈవారం మీయొక్క ఆలోచనలు మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి. మొత్తంమీద వారం ప్రారంభంలో శరీరసౌఖ్యానికి ప్రాముఖ్యతను ఇస్తారు. వారం ప్రారంభంలో సంతోషంగా గడిపినప్పటికిని మధ్యలో మీ మాటతీరు మూలాన ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనారోగ్యం వల్ల ఇబ్బందులు తప్పక పోవచ్చును. వారం చివరలో ఇష్టమైన వారిని కలువడం అనుకున్నవి శ్రమించి చేయుట మూలాన ధనలాభంను పొందుటకు అవకాశం కలదు. మీ వ్యతిరేకవర్గం బలపడుతుంది అనుకోని ఫలితాలను పొందుటకు అవకాశం కలదు జాగ్రత్తగా ఉండాలి. కుటుంభంలో కలహములు కలుగుతాయి అశుభవార్తను వినే అవకాశం కలదు. అల్పభోజనం చేయుటకు అవకాశం కలదు. చేసేపనిలో అకారణంగా భయాన్ని పొందుతారు మానసికంగా దైర్యం అవసరం. ఉద్యోగస్థానంలో నిదానంగా వ్యవహరించుట కోపాన్ని అదుపులో ఉంచుకొనుట చేత మేలుజరుగుతుంది. పెద్దల పరిచయం కలుగుతుంది సౌఖ్యంకు,వినోదములకు ప్రాముఖ్యతను ఇస్తారు. చంచలబుద్దిని కలిగి ఉండటం చేత కొన్ని విషయాల్లో దుఃఖాన్ని పొందుతారు. మరింత ఉత్తమ ఫలితాల కోసం కేతువుకు ప్రదక్షణలు,గణపతిని పూజించుట,శివాభిషేకం చేయించుకోవడం మంచివి.  

వృశ్చిక రాశి
ఈవారం ప్రారంభలో బాగుంటుంది. చాలావరకు అనుకున్నవి అనుకునట్లుగా జరిగినప్పటికిని చివరి వరకు ఆవిధంగా ఉండకపోవచ్చును. చేపట్టిన పనులలోమొదట్లో ఉన్న ఉత్సాహం చివరి వరకు ఉండకపోవచ్చును. ప్రయత్నాల్లో మొదట్లో అనుకూలతలు బాగున్నవి. బంధువుల గృహంలో సంతోషంగా గడుపుతారు భోజనసౌఖ్యం ఉంటుంది. ఆర్థికంగా బాగున్నా వారం చివరలో మీరు తీసుకొనే నిర్ణయాలు ధననస్టంను కలుగ జేస్తాయి. సేవాగునాన్ని కలిగి ఉండే అవకాసం కలదు.  తోటివారికి సహాయం చేస్తారు పేరును కలిగి ఉంటారు. అధికారులతో మాత్రం చికాకులు పొందుటకు అవకాశం కలదు,అనారోగ్యం చేత భాదింపబడుతారు. రాజకీయాల పట్ల మక్కువను ప్రదర్శిస్తారు చేపట్టిన పనులలో విజయాన్ని పొందుటకు అవకాశం కలదు. ఇష్టమైన పనుల పట్ల మక్కువను కలిగి ఉండుట చేత ఆదిశగా ముందుకు వెళ్తారు. కుటుంభంలో మాత్రం నిరాశను పొందుటకు అవకాశం కలదు కుటుంభసభ్యుల మూలాన శ్రమను పొందుతారు. మీపని కాకున్నను పనులను చేయవలసి వస్తుంది, చేయనిపనికి మాటను పడవలసి వస్తుంది. మంచి ఫలితాలను పొందుట కోసం హనుమాన్ చాలీసా పారాయణ,మంగళవారం దుర్గాదేవికి కుంకుమఅర్చన,లలితా సహస్రనామం పారాయణ మంచివి.   

ధనస్సు రాశి
ఈవారం గతవారం కన్నా మంచి ఫలితాలను పొందుతారు. చేపట్టిన పనులలో మొదట్లో చిన్న చిన్న ఆటంకాలు కలిగిన చివరకు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఉత్సాహంను కలిగి ఉండి నూతన ప్రయత్నాలు ఆరంభిస్తారు. వారం ప్రారంభంలో కుటుంభంలో సమస్యలు వచ్చినా త్వరగానే సమసిపోతాయి. ఇష్టమైన పనులను పూర్తిచేస్తారు. బంధువుల యెడల ప్రీతిని కలిగిఉంటారు,బంధువుల గృహంలో భోజనసౌఖ్యం ఉంటుంది అలాగే సమయాన్ని వారితో సరదాగా గడుపుతారు. మీరు ఆశించిన ఫలితాలు త్వరగా రాకపోవడం చేత కొంత విచారంను కలిగి ఉంటారు. చర్చల్లో పాల్గొంటారు వినొదముల యందు మక్కువను ప్రదర్శిస్తారు. ఆర్థికంగా అభివృద్దిని పొందుతారు. ప్రమాదకర వస్థువులతొ పనిచేస్తున్న లేక ప్రయాణాల్లో విలువైన వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. మీయొక్క వ్యతిరేకవర్గం వారు మాత్రం మిమ్మల్ని ఇబ్బందిపెట్టాలన్న ఆలోచనను కలిగి ఉంటారు. సంతానప్రాప్తికి అవకాశాలు కలవు గట్టిగా ప్రయత్నం చేయుట మూలాన అనుకున్నవి జరుగుతాయి. వ్యాపరస్థులకు బాగానే ఉంటుంది వారం చివరల్లో శ్రమను పొందినా ఫలితాలు మాత్రం బాగుంటాయి. ఇంకా ఉత్తమ ఫలితాల కోసం శివభిషేకం,లక్ష్మీఅష్టోత్తరం చదవడం,దత్తాత్రేయ ఆరాధన మంచిది..  

మకర రాశి
ఈవారం కొద్దిగా ఇబ్బందికరమైన ఫలితాలను పొందుటకు అవకాశాలు కలవు. బంధుమిత్రులతో కలిసి చేపట్టిన పనులలో ఖర్చును పొందుతారు. ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి ఆరోగ్యం భాదిస్తుంది. గతంలో భాదించిన మోకాళ్ళ నొప్పులు తిరిగి ఇబ్బందిపెట్టే అవకాశం కలదు. కుటుంభంలో నూతన ఆలోచనలు చేయకండి కలహములు కలుగుటకు అవకాశం కలదు. గతంలో చేపట్టిన పనులను మాత్రం విజయవంతంగా పూర్తిచేసే అవకాశం కలదు. మీకు నచ్చిన వ్యక్తుల పట్ల,పనుల పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తారు. చేసే పనిలో శ్రమను కలిగి ఉంటారు సంతృప్తిని మాత్రం పొందలేరు. వాహనములు నడుపునప్పుడు ఇబ్బందులను పొందుతారు అలాగే భయంను కలిగి ఉంటారు. ఉద్యోగంలో ఆర్థికంగా లాభాలను పొందుటకు అవకాశం కలదు అందరితో కలిసి పనిచేస్తారు తద్వార గుర్తింపు లభిస్తుంది. క్రిందిస్థాయి వారి వలన మేలుజరుగుతుంది సహాయంను పొందుతారు. కష్టాలు పెరిగినవి అన్నభావన కలుగును శ్రమించుట చేత మంచి ఫలితాలను పొందుటకు ఆస్కారం కలదు. మరిన్ని ఫలితాల కోసం సుబ్రమణ్యపూజ,ఆదిత్యహృదయం పటించుట,నవగ్రహాల చుట్టుతా ప్రదక్షణలు చేయండి.   

కుంభ రాశి
ఈవారం ఇష్టమైన పనులను మాత్రం చేస్తారు,ఆర్థికంగా బాగనే ఉంటుంది. ప్రయత్నాల్లో బాగనే ఉంటుంది అనుకున్న విధంగా ముందుకు పొగలుగుతారు.   ఆరంభంలో బాగున్న రాను రాను ఇబ్బందులు తప్పకపోవచ్చును. ప్రయాణాలలో ఆటంకాలు కలుగుటకు ఆస్కారం కలదు. కుటుంభంలో సయోధ్య లోపిస్తుంది చిన్న చిన్న కారణాలకే మనస్పర్థలు కలుగుతాయి. వారం ఆరంభంలో ధనాదాయం బాగుంటుంది కాని మధ్యలో ఆరోగ్య సమస్యలు లేదా అనవసరపు ఖర్చులు పెరుగుటకు అవకాశం కలదు. మీరున్న ప్రదేశంలో కాకుండా మరొక ప్రదేశంలో నివసించవలసి రావొచ్చును. ఉద్యోగంలో సాధారణంగా ఉంటుంది మీరు ఆశించిన విధంగా ఉండదు. మీ అమ్మవాళ్ళ కుటుంభ సభ్యులతో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు మాత్రుసౌఖ్యంను పొందుతారు. స్థిరమైన ఆలోచనలు చేయండి ఒక్క నిర్ణయంపైన ఉండలేరు మార్పులు చేయుటకు అవకాశం కలదు జాగ్రత్త. పెద్దల ద్వార మేలుజరుగుతుంది. నూతన పరిచయాలు లాభిస్తాయి. పూజలలో పాల్గొంటారు కొంత మేర ముందుకు వెళ్ళు ప్రయత్నం చేస్తారు. బాగాకస్టిస్తేనే పనులుముందుకు సాగుతాయి. మంచి ఫలితాల కోసం శ్రీరామరక్షా స్తోత్రం పారాయణ,హనుమాన్ దేవాలయం వెళ్ళుట,విష్ణుసహస్రనామం చదవండి మేలుజరుగుతుంది.  

మీన రాశి
ఈవారం కొంత అనుకూలంగానే ఉంటుంది. బంధుమిత్రులను కలుస్తారు ధనప్రాప్తి కలుగుతుంది. సంతానమూలక సౌఖ్యంను పొందుటకు అవకాశం కలదు. చేపట్టిన పనులలో ముందుకు వెళ్తారు ప్రయత్నాల్లో విజయం సాదిస్తారు. వారం ఆరంభంలో కుటుంభ జీవితంలో సౌఖ్యంను పొందుతారు,ఇతరులకు సేవచేయాలన్న కోరికను కలిగి ఉంటారు. ఆర్థికంగా బాగుంటుంది స్త్రీ / పురుష సౌఖ్యాన్ని కలిగి ఉంటారు. మీయొక్క ఆలోచనలు తోటివారిలో గౌరవాన్ని కలిగించేవిగా ఉంటవి. వారం చివరలో పనిఒత్తిడి మూలంగా కావోచ్చును లేక ప్రయాణాల మూలాన ఆనారోగ్యసమస్యల వలన ఇబ్బందులను పొందుటకు అవకాశం కలదు. ప్రయత్నాలు మధ్యలో ఆపుతారు కొద్దిగా శ్రమిస్తే చాలు పనులు సాగుతాయి. అధికారుల వలన మాత్రం ఇబ్బందులు తప్పక పోవచ్చును చంచల మనస్సును కలిగి ఉంటారు. ఉద్యోగంలో నిదానంగా వ్యవహరించుట సర్దుబాటు విధానం అవసరం. అకారణంగా కలహములు కలుగుటకు అవకాశం కలదు జాగ్రత్త. మీయొక్క వ్యతిరేకవర్గం బలపడుతుంది జాగ్రత్త అకారణంగా తిరగడం మూలాన శ్రమను పొందుతారు ప్రణాళిక అవసరం. ఖర్చులు పెరుగుతాయి జాగ్రత్త. మరిన్ని మంచి ఫలితాల కోసం ఆంజనేయ ఆరాధన,సుందరకాండ పారాయణ చేయండి,దుర్గాస్తుతి మేలుచేస్తుంది. 

మరిన్ని శీర్షికలు
annamayya pada seva