Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
defferences..now and then

ఈ సంచికలో >> శీర్షికలు >>

దురదృష్టపు దొంగలు - మల్లాది వెంకట కృష్ణ మూర్తి

duradrustapu dongalu

నేరం చేసాక, పరిశోధనలో పోలీసులకు ఆ నేరస్థులు చిక్కడం, వారే తాము దురదృష్టవంతులు అనుకోవడం కద్దు. అలాకాక నేరం చేస్తున్న సమయంలోనే పోలీసులకు చిక్కడం ఇంకా ఎంతో దురదృష్టకరం. ఇలా రకరకాల నేరాలు చేస్తూ పోలీసులకు చిక్కిపోయిన వివిధ సందర్భాలలోని అలాంటి దురదృష్టపు దొంగలను మీకు పరిచయం చేసి నవ్వించే శీర్షిక ఇది!

______________________________________________________________________

న్యూపోర్ట్ నగరం లోని ఓ బేంక్ లోకి ఓ దొంగ వెళ్ళి తుపాకీ చూపించి బేంక్ లో ఉన్న డబ్బంతా ఇవ్వమని డిమాండ్ చేసాడు, వాళ్ళు తెచ్చిన నోట్ల కట్టల వంక ఆష్చర్యంగా చూసి అడిగాడు.
"నాటి మొత్తం ఎంత?"
"దాదాపు పదకొండు కోట్ల డాలర్లు" చెప్పారు బేంక్ ఉద్యోగస్థులు. అంత డబ్బు తనకు వస్తోందన్న షాక్ తో అతను మూర్చపోయాదు. పోలీసులొచ్చి అతన్ని అరెస్ట్ చేసారు.

 

 

 



పెన్సిల్ వేనియాలోని బెన్సలెం కి చెందిన దొంగ మైఖేల్ డ్రెన్నన్ బహు పొదుపరి. అతను ఓ బేంక్ లోకి వెళ్ళి ఓ రైలు టిక్కెట్ వెనకాల ' నా దగ్గర తుపాకీ వుంది. డబ్బివ్వు. లేదా కాలుస్తాను. ' అని రాసి బేంక్ కేషియర్ కి ఇచ్చాడు. పాతిక వేల డాలర్లు అలా బెదిరించి ఎత్తుకెళ్ళాడు. రంగం లోకి దిగిన పోలీసులు ఆ టిక్కెట్ రిజర్వ్ చేసిన ఫారాన్ని ట్రేస్ చేసి అందులోని చిరునామాకి వెళ్తే డ్రెన్నన్ దొరికాడు. 1800 ల డాలర్లు ఖర్చు చేయగా బేంకు నుంచి దొంగలించిన మిగిలిన సొమ్ము అతని దగ్గర దొరికింది. పొదుపరి అయిన అతనికి బిల్స్, బస్, రైలు టిక్కెట్ల వెనక రాయడం అలవాటు.  . 

మరిన్ని శీర్షికలు
saahiteevanam