Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
22nd Episode

ఈ సంచికలో >> సీరియల్స్

ఏజెంట్ ఏకాంబర్

జరిగిన కథ: రాజనాల రాజేంద్ర, ఏకాంబరాన్ని కలవడానికి సిం హాచలానికి వెళ్తాడు. అయితే ఏకాంబర్, అతని  మిత్రులు కలిసే హోటల్ కు వెళ్తాడు రాజనాల రాజేంద్ర. ఏకాంబర్ వీరందరినీ కలవక మూడువారాలైందని అందరూ ఆ హోటల్ లో వుంటారని తెలిసి అక్కడకు వస్తాడు. అక్కడ రాజనాల రాజేంద్రను చూడగానే భయంతో వణికిపోతాడు ఏకాంబర్.

ఇంతలో బేరర్ బీర్ గ్లాసుల్లో పోసి తెచ్చాడు. పెద్ద జగ్గుల్లా ఉన్న గాజు జార్ లు అని, ఇద్దరూ కష్ట సుఖాలు మాట్లాడుకుంటూ సిప్ చేస్తున్నారు.

"నువ్వు నాకో ఫేవర్ చెయ్యాలిరా ఏకాంబర్!" నెమ్మదిగా ఏకాంబర్ కళ్ళల్లోకి చూస్తూ అడుగాడు రాజనాల.

బీరు జోరుగా త్రాగిన మైకంలో ఉన్నాడు ఏకాంబర్. మొదటి జగ్గే పూర్తి చేయ్యలేదు. నెమ్మదిగా సిప్ చేస్తూ కూర్చున్నాడు. ఏకాంబర్ మూడ్ చూసి అడుగుదామని అంతవరకూ ఊరందరి విషయాలు చర్చించుకున్నారు.

ఉన్నట్టుంది రాజనాల ఏదో సహాయం చేయాలనేసరికి ' కుబేరుడికి కుచేలుడు ఏం సాయం చేయగలడు? అని అనుకుని దిగ్గున తల ఎత్తి చూసాడు ఏకాంబర్."నేనా అన్నా నీకేం సాయం చేయగలను. చూసావుగా నా పరిస్థితి" అన్నాడు ఏకాంబర్.

"నువ్వే చేయ్యగలను. చూసావుగా నా పరిస్థితి" అన్నాడు ఏకాంబర్.

"నువ్వేం చేయగలవు. నన్ను ఇబ్బంది పెట్టకుండా చేస్తానంటే చెప్తాను" నెమ్మదిగా చెప్పాడు రాజనాల.

"నేనా... నన్ను నువ్వే కషమించన్నా! ఈ నెల్లాళ్ళు నిన్ను కుక్కను తిప్పినట్టు తిప్పాను. నీ గొప్పతనం తెలుసుకో  రెండో జగ్గు కూడా పూర్తి చేసి చిప్స్ తింటూ కూర్చున్నాడు ఏకాంబర్.

'బేరర్.. " వెళ్ళిపోతున్న బేరర్ని పిలిచాడు రాజనాల.

'సార్.." అతను వినయం గా వచ్చి నిలబడ్డాడు.

"మరో జగ్గు బీర్ ప్లీజ్!" నమ్రతగా ఆర్డర్ చేసాడు రాజానల

ఏకాంబర్ మాత్రం ఈ లోకం లో లేడు. అయినా, బాగానే వున్నట్కు నటిస్తున్నాడు.

"నేనంటే నీకు నమ్మకమే కదా!" ఏకాంబర్ కేసి చూస్తూ అడిగాడు రాజనాల.

"వాళ్ళందరికంటే నీ మీదే నాకు నమ్మకం. ఒట్టు!" చెప్పాడు ఏకాంబర్.

"నా కోసం.. నువ్వు "ఎగ్జాం" రాయాలి.. ప్లీజ్" నెమ్మదిగా అన్నాడు రాజనాల."

"ఎగ్జామా? అంటే.. పరీక్షలు... నో.. నెవర్! పరీక్ష పేరెత్తితే పారిపోతాను" అంటూ గబాలున లేవబోయాడు ఏకాంబర్.


"అబ్బ! అందుకేగా ముందు నిన్ను సహాయం చేయమన్నది." గట్టిగా అన్నాడు రాజనాల.

"అంబలి తాగే వాడికి మీసాలు ఎత్తేవాడొకడా?! నీ పరీక్షలు నేను రాయడమేమిటీ?! "ఇంటర్ పూర్తిచేయడానికే ఇళ్ళు పీకి పందిరేసిమంత పనైంది. ఏదో బాబా దయ వల్ల గట్టెక్కానూ త్రాగిన మైకం వదిలేసింది ఏకంబరానికి.

"బీరు" కదా త్రాగినంత వరకే వుంటుంది. గొంతు దిగాక యూరిన్ గా మారిపోతుందంటారు అందరూ.

"నా పరీక్ష కాదు. నీ పరీక్షే!. "ఏజెంట్" కావాలంటే "ఐ.ఆర్.డి.ఏ" ఎగ్జాం రాయాలి" చెప్పాడు రాజనాల.

పరీక్ష రాయకపోతే"ఏజెంట్ గా చేయనివ్వరా?!" ఆశగా అన్నాడు ఏకాంబర్.

"అంత మాటనుకురా నాయనా! నాకు దొరికిన ఒకే ఒక వజ్రానివి. మొదటివాడివి. నన్ను, నా జీవితాన్ని నువ్వే కాపాడాలి." బ్రతిమిలాడుతూ అన్నాడు రాజనాల.

"సరి సరి! ఏం రాయాలి. పుస్తకాల్ గట్రాల్లేవు. నేను ఇంటర్ పాసయ్యానో లేదోనని మళ్ళీ పరీక్షలు పెడతారా కొంపదీసి?!' కంగారు పడుతూ అన్నాడు ఏకాంబర్.

"పరీక్ష ఆంటే అలాంటి పరీక్షలు కాదు" చెప్పాడు రాజనాల 

"అమ్మో1 మరీ అంత భయంకరంగా వుంటాయా?" భయం గా అన్నాడు ఏకాంబర్.

"అబ్బా! నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెడతావెందుకురా! ఇన్స్యూరెన్స్ పాలసీలు ఎలా చెయ్యాలో తెలియజేసే పరీక్షలు... అదీ ఓ గంట వుంటుంది. " అనునయంగా అన్నాడు రాజనాల.

"గొప్పగా చెప్పావు! ఇన్స్యూరెన్స్ అంటేనే ఏమిటో నాకింకా బుర్రకెక్కలేదు. అప్పుడే దాని గురించి నేనేం రాయగన్రా!" దీనంగా అన్నాడు ఏకాంబర్.

"ఓర్నాయనో! నువ్వు కూర్చుంటావు. మిగతా వ్య్వ్హారం నేను నడిపిస్తాను కదా! పేపరు రాయక్కరలేదు. జవాబులు కూడా అందులోనే వుంటాయి. ఒక ప్రశ్నకి నాలుగు జవాబులు వుంటాయి. అందులో ఒకదనికి టిక్కు పెట్టాలి. అదే కరెక్టు జవాబు అన్నమాట" చెప్పాడు రాజనాల.

"ఇదేం తికమక పరీక్షరా? రాయక్కరలేదంటావు. ప్రశ్నలు, జవాబులు ప్రక్కప్రక్కనే ఉంటాయంటావు. ఈ మాత్రం దానికి పరీక్షలెందుకు. వాళ్ళే ఆ టికులేవో కరెక్టుగా పెట్టుకోవచ్చు కదా" త్రాగిందంతా దిగిపోయిందన్న చిరాకుతో అన్నాడు ఏకాంబర్.

"నీకు హాస్యంగానే ఉంటుందిరా! నువ్వు ఆ టిక్కులేవో కరెక్టుగా పెట్టి పాసయితే నేనో ఏజెంటుని నియమించినట్లు లెక్క, నువ్వు కూడా ఏజెంటువు అయినట్టు లెక్క! విచారంగా అన్నాడు రాజనాల.

"సరేరా! ఆ నాలుగు జవాబుల్లో ఏది కరెక్ట్ అని నేనేలా తెలుసుకోగలను" ఆశ్చర్యంగా అన్నాడు ఏకాంబర్.

"నేనున్నా కదరా! దానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను. నువ్వు కూర్చో. ఎక్కడెక్కడ 'టిక్కులు" లు పెట్టాలో నీకు స్లిప్ పంపిస్తాను.దాన్ని చూసి దడదడలాడీంచేసేయ్!" తనచేతిలో బీరు జగ్గు ఖాళీ చేస్తూ అన్నాడు రాజనాల.|

దీనికీ స్లిప్ లేనా!? చచాన్రా నాయనా ఇంటర్లో రాసీఎ రాసీ... ఎవడొస్తాడోనని భయంతో క్షణ క్షణంచచ్చి చెడి ఎలాగో పరీక్షలన్నీ గట్టెక్కించాను. మళ్ళీ ఈ స్లిప్పుల గోల ఇక్కడా వదలటం లేదేమిట్రా బాబూ!"నెత్తి మీద చేత్తో కొట్టుకుంటూ  అన్నాడు  ఏకాంబర్.

"బాబ్బాయ్! ఇది ఆఖరిసారనుకో! ప్లీజ్ కాదనకు! నువ్వు పాసయితే నా ఉద్యోగం ఉంటుంది. లేకపోతే ఈ ఆరు నెలల్లో ఒక్కడ్ని జాయిన్ చేయలేకపోయానని తీసినా తీసేస్తారు" ఏకాంబర్ చేతులు పట్టుకుంటూ అన్నాడు రాజనాల.

"తప్పదు కదరా! సముద్రం లో దిగాక ఈత రాక పోయినా నేర్చుకోవాలి కదా! నా జీవితం కూడా నీ చేతుల్లో పెట్టేస్తాను. స్లిప్లతో గట్టెక్కిస్తావో... సింపుల్ గా మెట్టెక్కిస్తావో ఎలా చేస్తావో నీ ఇష్టం. కానీయ్! పరీక్షేగా! ఇది ' నాదీ నీదీ ' ఉమ్మడి జీవిత పరీక్షనుకుంటాను. నిదానంగా అన్నాడు ఏకాంబర్.

"హమ్మయ్య! థ్యాక్స్ రా! నువ్వు ఎక్కడ ఒప్పుకోవో అని తెగ భయపడ్డాను. మళ్ళీ మొదటికొస్తుందేమోనని ఆందోళనలో చచ్చిపోయాను. పోటె ఫొనీ వెధవ బీర్లు రెండో మూడో ఖర్చయినా మనకిప్పుడు హాయిగా వుంది. కదరా!" బేరర్ కి బిల్లు కోసం జేబులో వున్న క్రెడిట్ కార్డు తీసి ఇచ్చాడు రాజనాల.

రాజనాల జేబులో ఉన్న పర్సు తీసి ఇస్తున్నప్పుడు అందులో తళ తళ మెరుస్తున్న వెయ్యినోట్లు, గలగల లాడుతున్న క్రెడిట్, డెబిట్ కార్డులు చూసి ఆశ్చర్యపోయాడు ఏకాంబర్.

జేబులో అంత డబ్బుంచుకుని స్టైల్ గా కార్డు తీసి ఇచ్చాడు రాజనాల. తను కూడా ఇలా.. ఇంత దర్జాగా ఖర్చు పెట్టగలడా1 తను ఇలా సంపాదించగలడా?" ఆలోచిస్తూ క్షణం మౌనంగా ఉండిపోయాడు ఏకాంబర్.

"పదరా పోదాం! బైక్ మీద కూర్చోగలవా?! ఏకాంబరాన్ని అడుగుతూ ముందుకు కదిలాడు రాజనాల.

"ఏదో ఫుల్ బాటిల్ మందు పట్టించేసినట్టూ చెప్తున్నావ్రా! నాలిక మీద మూడు చుక్కలు పోసినట్టూ.. అదీ బీరు.. బయటకి వెళ్ళి గోడ ప్రక్కన నిలబడితే సరి జారిపోయే బీరు ఇప్పించి.. కిక్కించ్చిందా... తల తిరుగుతోందా? కూర్చోగలవా...? బడాలాపి పద" దర్జాగా నడిచి ముందు కెళుతూ అన్నాడు ఏకాంబర్.

' ఇందాకా మత్తెక్కిన వాడిలా మాట్లాడిన వీడు ఇప్పుడు ఇంత దర్జాగా నడుస్తున్నాడు...?! కొంపదీసి కిక్కిచ్చినట్టూ ఇంతవరకూ నటించాడా..?? మనసులోనే ఏకాంబర్ కోసం ఆలోచిస్తూ బైక్ దగ్గరకు వెళ్ళాడు రాజనాల.

"నన్ను ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర దించెయ్" బైక్ ఎక్కుతూ అన్నాడు ఏకాంబర్.

'ఏరా! భోజనం చెయ్యమా? అలకాపురి అదిరిపోతుంది. అక్కడికెళ్ళి బిర్యాని తిందాం" అంటూ జగదాంబ జంక్షన్ కేసి బైక్ ను ఉరికించాడు రాజనాల.

ఆ నెల్లోనే ఏకాంబర్ ఏజెంట్ ఎగ్జాం కూడా రాసాడు. రికార్డ్ స్థాయిలో ఒకే ప్రయత్నం లో పాసైపోయాడు. ఏకాంబరమే తన కళ్ళను తానే నమంలేకపోయాడు. అక్కడి వాళ్ళు ఎక్కడెక్కడ టిక్కులు పెట్టాలో చిన్న స్లిప్పు ఇచ్చినా అది చూసి పెట్టడం కూడా కష్టమే కడా అనుకున్నాడు ఏకాంబర్. కానీ, వాళ్ళే దగ్గరుండి పెన్ను లాక్కుని మరీ ఏకాంబర్ కి శ్రమ తగ్గించాడు. పరీక్ష పాసైన మర్నాడే ట్రైనింగ్ అంటూ వారం రోజులు భోజనాలు పెట్టి మరీ ఇన్స్యూరెన్స్ పాలసీల గురించి వివరించి చెప్పారు. ఒప్పుకున్నందుకు తప్పదన్నట్లు శిక్షణకి కూడా హాజరయ్యాడు ఏకాంబర్.

ఇన్స్యూరెన్స్ పాలసీల వేట మొదలయ్యింది. ఎవరికి ఎలాంటి పాలసీ ఇవ్వాలో శిక్షణా కాలంలో చెప్పారు.

"ఏకాంబర్! నీకు తెలిసిన వాళ్ళందరిపేర్లు రాసుకో. రోజూ ఒక్కకరిక్రి ఇంటికి వెళ్దాం. నేనూ నీకు తోడుగా వస్తాను. నెల రోజుల్లో నువ్వే నేర్చుకుంటావు" ఎంతో బోధపర్చి చెప్పాడు రాజనాల.

అంతా అర్ధమయినట్లే. బుర్ర ఊపాడు ఏకాంబర్.

రాజనాల రాజేంద్ర చెప్పినట్లుగానే తనకి తెలిసిన వాళ్ళందరిపేర్లు రాసుకున్నాడు. ఎవరెవరిని అడగాలో గుర్తు తెచ్చుకుని మరీ పేర్లు రాసుకున్నాడు  ఏకాంబర్. ఏజెంటు ఎగ్జాం పాసవగానే తనకో కోడ్ ఇచ్చారు బ్రాంచిలో, ఆ కోడ్ నంబర్ రాగానే పాలసీలు చేయించడం కోసం సన్నద్ధమయ్యాడు. 

ఆ రోజు ఉదయాన్నే రాజనాల పాలసీ ప్రపోజల్ ఫారాలు అవీ పట్టుకొచ్చి ఏకాంబర్ ఇంట్లో పడేసాడు. అవసరమైన కొన్ని ఫారాలు పట్టుకుని ఇద్దరూ ఊరిమీద పడ్డారు.

ముందుగా బందువుల ఇళ్ళకి తీసుకెళ్ళాడు ఏకాంబర్. అందరూ వ్యాపారస్తులే. ఒక్కరు కూడా పాలసీ తీసుకుంటామనలేదు సరి కదా, ఏకాంబర్ ని ఎగతాళి చేసారు. పనీపాటూ లేకుండా ఊరి మీద తిరిగేవాడికైనా ఇంటికి పిలిచి టీ ఇస్తారు. గానీ, ఇలా ఇన్స్యూరెన్స్ కట్టాలని వస్తే నిన్ను చూసి తలుపులు బిడాయించుకుంటారు.నువ్వేం చెయ్యగలవురా! అయినా ఇప్పటికే ఊరంతా ఏజెంట్లే నీ దగ్గర ఎవరు కడతారు?" అంటూ ఎగతాళిగా అని నిరుత్సాహపరిచారు.

ఏకాంబర్ కి బుర్ర తిరిగిపోయింది.      తనేం పొరపాటు చెయ్యలేదు కదా! తను ఏజెంటుగా ఒక్క పాలసీ అయినా కట్టించగలడా?! ఆ రోజంతా తిరిగితిరిగి ఇల్లు చేరుకున్నారు ఇద్దరూ.

ఏకాంబరానికైతే మొహం లో నెత్తురు చుక్కలేదు.

"నువ్వేం కంగారు పడకురా ఏకాంబర్! విత్తనం వెయ్యగానే మొక్క మొలవదు కదా! మొక్క మొలకెత్తగానే పండ్లు ఇయ్యడు కదా! ఇది కూడా అంతే! ఇలాంటివి ఇంకా ఎన్నో అటు పోట్లు తింటేగాని రాటు దేలము" ఏకాంబర్ కి ధైర్యం చెప్పాడు రాజనాల.

రాజనాల మాటలు బుర్రకెక్కలేదు. ' అల్లరి చిల్లరగా ఇన్నాళ్ళు తిరిగినంత కాలం ఒక్కరు ఒక్క మాట అనలేదు. ఈ రోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళబట్టే కదా ఇన్ని మాటలన్నారు. అయినా, ఈ పని తను స్వయంగా సవ్యంగా చేయగలడా?!" మనసులో మధనపడ్డాడు ఏకాంబర్.
ఆ రాత్రి విచారం గా కూర్చున్న కొడుకుని అడిగింది తల్లి  పర్వతాలు. 

'ఏరా ఏకాంబర్? అలా వున్నావేం! ఒంట్లో బాగాలేదా?" గదిలో మంచం మీద కూర్చున్న ఏకాంబర్ దగ్గరకు వెళ్ళి అనునయం గా అడిగింది.
"హాయిగా తిరిగేవాడ్ని, తగుదునమ్మా అంటూ ఇందులో దూరాను. ఈ పని నేను చెయ్యలేననిపిస్తోందమ్మా! అందరూ ఎగతాళి చేస్తున్నారు. సిగ్గుగా తల కోట్టెసినట్టు అనిపిస్తోంది." బాధగా అన్నాడు ఏకాంబర్.

"నువ్వేం కాని పని చెయ్యటం లేదు కదమ్మా! నువ్వొక్కడివే కట్టించడం లేదు కదా! అయినా, ఇది దొంగ పనా? రంకు పనా? నువ్వు ఇలా బాధపడడానికి, తప్పు చేస్తే సిగ్గు పడాలి. పెద్ద పెద్దోళ్ళు ఇంటింటికీ తిరిగి ఒట్లదుగుతున్నారు. అందరూ వారికీ ఓటు వెయ్యరని తెలిసినా అందరి ఇళ్ళకి వెళ్ళి అడగడం లేదా?! వాళ్ళు సిగ్గు పడుతున్నారా?" అనునయం గా అంది తల్లి.

తల్లి అన్న మాటలు శ్రద్ధగా విన్నాడు ఏకాంబర్. మనసుకు కొంత ఊరట కలిగినట్లనిపించింది. నిజమే కదా! తను తప్పు చేయటం లేదు. తను చేస్తున్నది కూడా మంచి పనే. మరి, అందరూ ఎందుకిలా ఆలోచిస్తున్నారో అర్థం కాలేదు ఏకాంబరానికి.

ఆ మర్నాడు తెల్లవారుతూనే ఏకాంబర్ ఇంటికి చేరుకున్నాడు రాజనాల రాజేంద్ర. అప్పటికింకా ఏకాంబర్ లేవలేదు. రాత్రంతా ఆలోచనల్లో నిద్ర పట్టక తెల్లారగట్ల ఎప్పుడో నిద్రలోకి జారుకున్నాడు.

రజనాలకి భయంగానే వుంది. ఏకాంబర్ ఎక్కడ కురుక్షేత్రం లో  అర్జుండిలాగా మధ్యలో నాకొద్దూ...నన్నొదిలై అంటూ విరమించుకుంటాడోనన్న భయం ఏ కొసనో పీకుతూనే వుంది. అందుకే ఏకాంబరాన్ని ఒంటరిగా ఒదలకూడదని ఎలాగైనా ఈ రోజు  ఎక్కడైనా పాలసీ పుట్టించాలన్న పంతంతో వచ్చాడు. ఏకాంబర్ పరీక్ష పాసవగానే ఏజెన్సీ కంఫర్మ్ కావడం కోసం తనే ఏదో చిన్న పాలసీ తీసుకుని ఏకాంబర్ కోడ్ రావడం కోసం కట్టేసాడు. దాంతో వెంటనే ఏకాంబరానికి ఏజెంటు కోడ్ వచ్చింది.

ఏకాంబరానికి తెలియకుండానే అందంగా... అకర్షణీయంగా ఏజెంటు ఏకాంబర్ చి.బి.ఐ 007 అని రాయించి కింద తమ ఇన్స్యూరెన్స్ కంపెనీ పేరు రాయించి ఇంటి ముందు తగిలించడానికి వీలుగా బోర్డు చేయించి తీసుకువచ్చాడు. అది తన మొదటి బహుమతిగా అందివ్వాలని వచ్చాడు. కనీ, ఏకాంబర్ ఏ మూడ్ లో ఉన్నాడో? ఏమో?! అని ఆలోచిస్తూ ఏకాంబర్ ఇంటిముందు బైక్ ఆపాడు రాజనాల.వరండాలో కుర్చీ వేసుకుని ఉన్నాడుపీతాంబరం. ఆ రోజు పేపరు పట్టుకుని చదువుతూ కూర్చున్నాడు. అదే సమయం లో పర్వతాలు టీ గ్లాసులతో గుమ్మం దగ్గరకు వచ్చింది.

రాజనాలను చూస్తూనే 'రా బాబూ రా ... మీ స్నేహితుడు ఇంకా ఈ రోజు లేవలేదు. ఎప్పుడూ ఈ సరికి తయరయి వెళ్ళిపోయేవాడు" ఆదరంగా ఆహ్వానిస్తూ అంది.

బైక్ స్టాండ్ గుమ్మంలో అడుగు పెట్టాడు రాజనాల.

తనకోసం అని తెచ్చుకున్న టీ గ్లాసు రాజనాలకు 'ఇదిగో! టీ తీసుకో బాబూ! నేను వాడ్ని లేపి వస్తాను అంటూ లోపలకు వెళ్ళింది పర్వతాలు.
అంకుల్! ఈ రోజు మీకు లేదా? ఊరికే ఉండలేక ఏదో ఒకటి అడగాలని అన్నాడు రాజనాల.   

 
 

 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
20th Episode