Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

ఏజెంట్ ఏకాంబర్

జరిగిన కథ:
ఏకాంబర్, రాజనాల రాజేంద్ర బార్ లో మందు తాగుతూ పాలసీల గురించి చర్చించుకుంటుండగా, ఇంతలో బేరర్ డబ్బుల గురించి వస్తాడు. రాజేంద్ర తన పర్సులోంచి ఏ.టి.ఎం కార్డును తీసి ఇస్తుండగా ఏకాంబర్ దృష్టి అతని పర్సులో వున్న నోట్ల కట్టలపై పడి తనెప్పుడు అంత స్థితికి చేరుకుంటాడో ఆలోచిస్తుంటాడు.

"ఎందుకు లేదు, వెళ్తాను. మీరేంటి, ఇంత పెందరాళే బయలుదేరారు? ఏమిటో పని?" వ్యంగ్యంగా అన్నాడు పీతాంబర్.

"నేను ఇన్స్యూరెన్స్ కంపెనీలో డెవలప్ మెంట్ ఆఫీసర్ గా చేస్తున్నా కదా అంకుల్. మీకు తెలుసు కదా!" ఆష్చర్యంగా అన్నాడు రాజనాల.
"తెలుసు. వీడితో పనేంటా అని?!" అన్నాడు పీతాంబరం.

"అదేంటంకుల్! ఏకాంబరాన్ని ఏజెంటుగా జాయిన్ చేశాను కదా! వాడు మీకు చెప్పలేదా?" వినయంగా అన్నాడు రాజనాల.

"వాడా?! నాకా?! నా కంటికి కనిపించకుండా తిరుగుతాడు. ఎప్పుడొస్తాడో... ఎప్పుడెళతాడో వాడికే తెలీదు. ఇంకా వాడి గురించి నాకెలా తెలుస్తుంది? పోనీ, తండ్రినన్న గౌరవం వుంటే తనేం చేస్తున్నాడో, ఏంచేయాలనుకుంటున్నాడో చెప్తాడు. నీకు తెలుసా! చదువు సంధ్యలు అబ్బలేదని నాతో షాపుకు తీసుకువెళ్తే నెలలో లక్ష రూపాయలు నష్టపరచాడు. వూరందరికీ అరువులిచ్చేసి షాపులో సరకులు ఖాళీ చేసేశాడు. అదిగో! వాటిని వసూలు చేస్తానని వూరిమీద పడి తిరిగడం అలవాటు చేసుకున్నాడు. ఏంచెప్పమంటావ్?" తన మనసులో గోడంతా కసిగా వెళ్లగక్కేశాడు పీతాంబరం.

రాజనాల నోరు ఆవులించుకుని వుండిపోయాడు. మరేం మాట్లాడాలో అర్థం కాలేదు. తనేం చెప్పినా ఇక వ్యతిరేకమే వస్తోందని భయపడిపోయాడు. ఇతనికి ఏకాంబర్ ఏజుంటుగా జాయిన్ అయిన విషయం తెలీదని అర్థమైపోయింది. ఎందుకైనా మంచిది, మౌనంగా వుండడమే మేలనుకున్నాడు రాజనాల.

ఇంతలో కళ్లు నులుముకుంటూ ఏకాంబర్ అక్కడకు వచ్చాడు. అతని వెనకే తల్లి పర్వతాలు రెండు గ్లాసులతో వేడి వేడిగా 'టీ' పట్టుకుని వచ్చింది. ఏకాంబర్ కి ఒక గ్లాసు ఇచ్చి తనో గ్లాసులో తాగుతూ వరండాలో గుమ్మం మీద కూర్చుంది. రాజనాల పీతాంబర్ పక్క పక్క కుర్చీల్లో కూర్చున్నారు.

ఏకాంబర్ 'టీ' గ్లాసు చేతో పట్టుకునే గుమ్మం దగ్గర తండ్రి వెనక నిలబడి వున్నాడు.

"నాన్నా! మీకో విషయం చెప్పాలి" టీ సిప్ చేస్తూ అన్నాడు.

చిన్న కొడుకు మాట చెవిన పడగానే ఆశ్చర్యంగా టక్కున తలతిప్పి ఏకాంబర్ కేసి చూస్తూ 'ఏమిటన్నట్లు ' కళ్లతోనే సైగ చేశాడు పీతాంబరం.
"మీరు నాకో పాలసీ కట్టాలి" స్థిరంగా అన్నాడు. 'తెల్లవార్లూ కునుకు రాక తంటాలు పడుతూ అలోచించింది అదే. ముందు తమ ఇంట్లో నుండే తన ప్రయాణం మొదలుపెట్టాలి. అన్నకి కూడా ఫోన్ చేసి పాలసీ అడగాలి.'

'నవ్విన నాపచేనే పండుతుందని ' అమ్మ ఎప్పుడూ చెప్తూంటుంది. తను గెలవాలి. గెలిచి చూపించాలి. తన మొదటి అడుగు... ముందడుగు ఇంటినుండే ప్రారంభం కావాలి ' స్థిరంగానే నిర్ణయించుకుని నిద్రలేచాడు ఏకాంబర్.

"పాలసీ ఏమిట్రా?! పడుకునే పలవరిస్తున్నావా ఏంటి?!" మరింత ఆశ్చర్యంగా అన్నాడు పీతాంబరం.

గభాలున ఏదో చెప్పాలని నోరు తెరవబోయిన రాజనాల ఎదురుగా టీ తాగుతూ తనకేసే చూసి కళ్లతోనే వద్దని వారిస్తున్న పర్వతాలు సైగలతో టక్కున ఆగిపోయాడు రాజనాల.

"నేను ఇన్స్యూరెన్స్ ఏజుంటుగా జాయిన్ అయ్యాను" చెప్పాడు ఏకాంబర్.

"నువ్వా! ఇన్స్యూరెన్స్ చేయిస్తావా?! నమ్మే విషయమేనా?! అయినా, నీకెవర్రా పాలసీలిస్తారు?! చేతిలో పేపరు పక్కన పెడుతూ కుర్చీలో నుండి లేచి నిలబడి అన్నాడు పీతాంబరం.

"ముందు మీరో పాలసీ కట్టండి!" సూటిగా తండ్రి మొహంలోకి చూస్తూ అన్నాడు ఏకాంబర్.

"తాటిచెట్టంత ఎదిగావ్! చెప్తే అర్థంకాదా?" తల పైకెత్తి కొడుకు కళ్లలోకి చూడాలని ప్రయత్నిస్తూ అన్నాడు పీతాంబరం.

"మీ సోదాపి వాడు అడిగింది ఇవ్వండి. పడ్డవాడికి నొప్పి వుండాలి గానీ, పక్కనుండే మీకుందుకండీ బాధ" చిరాగ్గా మొగుడికేసి చూస్తూ అంది పర్వతాలు.

"నీ వెనక మీ అమ్మ వుందని ధైర్యమా?! అయినా, నేనేం కట్టగలన్రా! షాపులో వ్యాపారం అంతంత మాత్రమే! పైగా, పోటీకాలం. ఒకసారి కడితే సరిపోదు కదా! ఆర్నెల్లకో, మూడు నెలలకో ఒకసారి కట్టాలి కదా!... ఇంతకీ ఎన్నాళ్లు కట్టాలట?!" ఇంట్లోకి వెళ్తూనే అన్నాడు పీతాంబరం.
"ముందు మీరు ఈ మొదటి వాయిదా కట్టండి. తర్వాత నేను చూసుకుంటాను" నెమ్మదిగా అన్నాడు ఏకాంబర్.

"ఏలా?! వాయిదాలు సరిగ్గా కట్టకపోతే మొదట కట్టిన సొమ్ము పోదూ??" గిర్రున వెనక్కి తిరిగి అన్నాడు పీతాంబరం.

"తర్వాత వాయిదాలన్నీ నేను కడతానులెండి నాన్నా!" స్థిరంగా అన్నాడు ఏకాంబర్.

"అదే ఎలారా?!" వింతగా కొడుకుకేసి చూస్తూ అన్నాడు.

"నాకు కమీషన్ వస్తుంది కదా! అందులోనుండి" తండ్రి కళ్లలోకి చూస్తూ అన్నాడు ఏకాంబర్.

ఆ మాటకు పకాలున నవ్వాడు పీతాంబరం.

"వెర్రివెంగళప్పలా వున్నావే! నేను కట్టిన ఒక్క వాయిదాకే నీకు నెలనెలా అంత కమీషన్ వచ్చేస్తుందా?" విరగబడి నవ్వుతూ అన్నాడు పీతాంబరం.

గుమ్మం అవతల కూర్చున్న రాజనాలకి చిరాగ్గా అనిపిస్తోంది. ఎంతో ఆత్మవిశ్వాసంతో వున్న ఏకాంబరాన్ని ఇతను నిరుత్సాహ పరుస్తున్నాడన్న ఉక్రోషం నిలవనివ్వటం లేదు. అంతే! చటుక్కున లేచి గదిలోకి అడుగు పెట్టాడు రాజనాల.

"మీరే వెర్రివాడిలా ఆలోచిస్తున్నారు. మీరొక్కరు కడితే సరిపోతుందా?! మిగతా అందరిచేత కట్టించగలనన్న ధీమాతో 'కమీషన్ ' వస్తే పోనీలే తండ్రిదే కదా పాలసీ, కమీషన్ లోంచి కడదామనుకుని చెప్పాడు. అది మీకు వెటకారంగా అనిపిస్తోందా?" మొగుడిమీద విరుచుకుపడింది పర్వతాలు.

"సరేలేరా! ఎక్కడ సంతకాలు పెట్టాలో చెప్పు. ఎంత కట్టాలో చెప్తే మీ అమ్మ దగ్గర డబ్బులడిగి తీసుకో! నాకు షాపుకు టైమయింది. స్నానం చేసి వస్తాను. ఈలోగా పేపర్లన్నీ తీసి వుందు" అంటూ గాబరాగా పెరట్లోకి వెళ్లిపోయాడు పీతాంబరం.

ఏకాంబరానికి పట్టలేని సంతోషం కలిగింది. తండ్రి ముందన్న మాటలన్నీ వదిలేశాడు. చివరగా అన్న మాటలు అతనికి ఎనలేని ఆనందాన్ని కలిగించాయి. ఇంట్లోకి అడుగు పెట్టిన రాజనాలకి కూడా ఆయన మాటలు ఎంతో ఉత్సాహాన్ని కలిగించాయి.

అంతే! మిత్రులిద్దరూ గబగబా పేపర్లన్నీ సిద్ధం చేశారు. ఏకాంబర్ గబాలున వెళ్లి తండ్రి జేబులో వున్న పాన్ కార్డ్ తీసి రాజనాలకి చూపించాడు. అందులో వున్న పుట్టిన తేదీ ప్రకారం ప్రీమెయం చూసి ఎంత కట్టాలో కాగితం మీద రాసుకుని సిద్ధంగా కూర్చున్నారు ఇద్దరూ.
పీతాంబరం పెరట్లో నుండి రాగానే ఎదురెళ్లి ఎంత కట్టాలో చెప్పాడు ఏకాంబర్.

"ఏడాదికి నాలుగుసార్లు గ్ర్తు పెట్టుకుని కట్టడం కష్టం కదా! ఏడాది మొత్తం ఒకేసారి కట్టేలా రాయండి! పాలసీ ఎక్కువకాలం పెట్టకమడి. ఓ పదిహేను సంవత్సరాలకి రాయించండి! పదేళ్ల లోపున అయితే, మరీ మంచిది"  బట్టలు వేసుకుంటూ అన్నాడు పీతాంబరం.

"తక్కువయితే 'ఏజుంటు 'కి కమీషన్ తగ్గిపోతుందంకుల్!" నెమ్మదిగా అన్నాడు రాజనాల.

చురుగ్గా కొడుకుకేసి, రాజనాలకేసి చూశాడు పీతాంబరం.

"మీ కమీషన్, మీ లాభాల కోసం ఆలోచించి 'పాలసీ'లు కట్టేవారికి కష్టం, నష్టం కలిగించకండి. వాళ్ల స్థోమతను అంచనా వేసి వాళ్లకి నచ్చజెప్పి రాయించండి. ఎవరినీ బలవంతపెట్టి చేయించకండి. ఆ తర్వాత వాల్లు కట్టలేమని చేతులు ఎత్తేస్తే మీకే కాదు, కంపెనీకి కూడా చెడ్డపేరు. మీరు ముందుకెళ్లలేరు" చెప్పాడు పీతాంబరం.

"అలాగే అంకుల్!" అన్నాడు రాజనాల.

తండ్రి మాటల్లో నిజం వుందనిపించింది. తమ లాభం, స్వార్థం అలోచించి కట్టలేని వాళ్లకు వాళ్ల స్థోమతని మించి పాలసీ చేయించకూడదు. నిజమే కదా!' మనసులోనే తండ్రి మాటలను మననం చేసుకున్నాడు, మదిలో ముద్రించుకున్నాడు.

తండ్రి పీతాంబరం పాలసీ దరఖాస్తుల మీద సంతకాలు చేస్తూంటే ఏకాంబర్, తననుకున్నది సాధించేశానన్న తృప్తితో, ఆనందంతో ఉల్లాసభరితుడయ్య్యాడు.

ఆరోజంతా వారికి సాదర స్వాగతమే లభించింది.

తన చిన్ననాటి మిత్రుల ఇళ్లకు తీసుకుని వెళ్లాడు. గాంధీనగర్ లో ప్రతి ఇంటి తలుపు తట్టి మిత్రులందరికీ తను ఇన్స్యూరెన్స్ ఏజుంటునయ్యానని తనని జాయిన్ చేసింది ఇతనేనని డెవలప్ మెంట్ ఆఫీసర్ రాజనాల రాజేంద్రని అందరికీ పరిచయం చేశాడు.
అందరూ ఆనందంగా ఇన్స్యూరెన్స్ పాలసీలు కడతామని వాగ్దానం చేశారు. అయితే, తామందరూ వ్యాపారం, కూలీనాలీ చేసుకు బతికే వాళ్లమని, తమకు తగ్గట్టు ఎంతో కొంత చిరు మొత్తంలో పాలసీలు కడతామని చెప్పారు. ఏదైనా పాలసీయే కదా అంటూ వారి సహృదయతకు ధన్యవాదాలు తెలుపుకుని కడతామన్న వాళ్లందరి దగ్గరా దరఖాస్తులు తీసుకున్నారు ఇద్దరూ.
ఆ రోజు పదిహేను మందికి పైగా అందరూ చిన్నా పెద్దా పాలసీలు కట్టేసరికి ఏకాంబర్ ఆనందానికి అవధుల్లేవు. రాజనాలకు కూడా నమ్మకం కలిగింది. 'ఏకాంబర్ ' ఆంజనేయుడిలాంటివాడనీ, అతడి బలం అతడికే తెలీదని అర్థం చేసుకున్నాడు. నెలరోజులు క్రమ తప్పకుండా ఏకాంబరాన్ని ఫీల్డులో తిప్పితే ఇక ఎవరి అవసరమూ లేకుండా ముందుకు సాగిపోతాడని గ్రహించాడు.

ఆ రాత్రి - ఆనందంగా ఆరోజు జరిగినదంతా తల్లికి చెప్పాడు. తండ్రి పీతాంబరం ఇల్లు చేరగానే తన సంతోషాన్ని తెలియజేశాడు. పీతాంబరం కూడా ఆనందపడినా గుంబనంగా 'ఇంకా బాగా తిరగాలి, బాగా చెయ్యాలి ' అంటూనే 'ఇల్లు అలకగానే సంబరం కాదు. ఒళ్లు వంచి పని చెయ్యాలి ' అని పెరట్లోకి వెళ్లిపోయాడు.

ఆ తర్వాత నుండీ రోజూ ఇన్స్యూరెన్స్ వేటలో పడ్డాడు ఏకాంబర్. ముందురోజు రాత్రే మర్నాడు కలవాల్సినవాళ పేర్లు రాసుకుని అందరినీ కలిసేవాడు. ఏకాంబర్ తో పాటు రాజనాల కూడా వెళ్తున్నాడు.

ఓ రోజు అనుకోకుండా కొండ మీదకు వెళ్లి సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నాక కొండమీద షాపుల వాళ్లందర్నీ కలసి ఇన్స్యూరెన్స్ గురించి చెప్పాడు ఏకాంబర్. అందరూ ఉన్నాయనేశారు గానీ, ఒక్కరంటే ఒకరు కూడా కడతామనలేదు. అయినా, ఏకాంబర్ పట్టించుకోలేదు.
కొండ దిగిపోదామని బస్సుస్టాండ్ లో నిలబడ్డ ఏకాంబరానికి బాల్య స్నేహితుడు బంటుబల్ల త్రినాథ్ కనిపించాడు.

అతను కొండమీద శానిటరీ మేస్త్రీగా పని చేస్తున్నాడు. ఏకాంబరాన్ని చూస్తూనే నవ్వుతూ వచ్చి పలకరించాడు.

"ఏరా! దర్శనానికి వచ్చావా?" ఎదురొచ్చి త్రినాష్ అడిగాడు.

"అరే త్రినాథ్! ఇక్కడే చేస్తున్నావా? మొన్నటివరకూ కొండ దిగువన కదా పనిచేశావు" ఆశ్చర్యంగా అన్నాడు ఏకాంబర్.

"వారం రోజులయింది ఇక్కడకు బదిలీ అయి. కొత్తగా మెళ్లో ఆ బ్యాగ్ ఏమిట్రా! ఏదైనా ఫైనాన్స్ కంపెనీలో చేరావా?" అడిగాడు త్రినాథ్.
"నీకు తెలియదు కదూ! ఇన్స్యూరెన్స్ ఏజెంటుగా చేరాను. ఇదిగో! ఈ షాపులవాళ్లు ఎవరైనా పాలసీ ఇస్తారేమోనని వచ్చాను" విచారం దాచుదామన్నా దాగటంలేదు. విషణ్ణ వదనంతో అన్నాడు ఏకాంబర్.

"ఇన్స్యూరెన్స్ అంటే లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలసీలేనా?!" అడిగాడు త్రినాథ్.

"అవున్రా! 'జీవితభీమా' పాలసీలే చేయిస్తూంటాను" చెప్పాడు ఏకాంబర్.

"అయితే, నేనూ కడతాను. నా దగ్గర పదిహేనుమంది వరకూ పనిచేస్తున్నారు. వాళ్ల చేత కూడా కట్టిస్తాను. జీతాల్లో వసూలు అయిపోతుంది కదా!" కుతూహలంగా అడిగాడు త్రినాథ్.

"అలాగే చేద్దాం! అలాగే! మా డెవలప్ మెంట్ ఆఫీసర్ రాజనాల రాజేంద్ర అనీ... ఆయన్ని పట్టుకుని వస్తాను. ఎప్పుడు చేయిద్దాం అంటావు?" ఆతృతగా అడిగాడు ఏకాంబర్.

""రేపు ఉదయాన్నే ఎనిమిదో గంటకే ఇక్కడికే వచ్చేయండి. అందరం ఉంటాం. వస్తారా! ఎక్కడా చెత్తా చెదారం లేకుండా చూడ్డమే నా పని. ఈవోగారు వచ్చే టైం అవుతోంది. ఇలా నేను బాతాఖానీ వేస్తూ కూర్చోవడం మంచిది కాదు" అంటూ అక్కడనుండి వేరేచోటుకు పరుగందుకున్నాడు అతడు.

త్రినాథ్ చెప్పింది వినేసరికి హుషారొచ్చింది. హాయిగా గుండెల్నిండా గాలి పీల్చుకుని ధైర్యంగా నిలబడ్డాడు.

"ముందు తను 'ఇన్స్యూరెన్స్ ఏజెంట్'నన్న విషయం అందరికీ తెలియజేయాలి. పాలసీ కట్టినా, కట్టకపోయినా తను 'ఏజెంటు 'నన్న విషయం తెలుస్తుంది. పేరు సంపాదిస్తే పాలసీలవే వస్తాయి" మనసులోనే స్థిరంగా అనుకున్నాడు ఏకాంబర్.

ఆ మర్నాడు త్రినాథ్ చెప్పిన సమయానికి అరగంట ముందే కొండ పైకి చేరుకున్నారు ఏకాంబర్, రాజనాల. అనుకున్నట్టే తనూ, తనవాళ్ల చేత పాలసీలు రాయించి నెలకి ఒక్కొక్కరికి అయిదొందల రూపాయలు దాటకుండా 'పాలసీలు ' రాయమన్నాడు త్రినాథ్. ప్రీమియం ను బట్టి వాళ్ల వయసుకు తగ్గట్టు 'పాలసీ' ఎంత రాయాలో లెక్క కట్టి అంతంత పాలసీలు రాయించాడు రాజనాల. ఎవరూ ఒక పైసా కట్టలేదు. రాజనాల కూడా అడగలేదు.

"వచ్చేనెల జీతాల్లోనుండి నెలనెలా వాయిదా వసూలు జరిగేలా చూడండి సార్!" అంటూ రాజనాలకు చెప్పి వెళ్లిపోయాడు త్రినాథ్. తన అనుచరుల్ని ఎక్కడెక్కడకు వెళ్లి పని చెయ్యాలో చెప్పి వెళ్లిపోతూ ఏకాంబర్ కు కూడా ఒక సలహా ఇచ్చాడు త్రినాథ్.

"ఒరేయ్ ఏకాబర్! మా అందరికీ ఈ నెల్లో జీతాలు పెరిగాయి. నువ్వు సార్ ని తీసుకుని దేవాలయంలోకి వెళ్లు. అక్కడ పని చేస్తోన్న మాలీలు, బోయీలు, ఫిర్కాలు, అర్చకులు, ఫేద పండితుల్ని అందర్నీ ఒకసారి కలసి చూడు. నీకు చాలా పాలసీలు వచ్చే అవకాశం వుంది" అన్నాడు త్రినాథ్.

రాజనాల ఆనందంతో ఎగిరి గంతేశాడు. ఏకాంబర్ సరేసరి. కానీ, పాలసీలు రాసిన పదిహేను మందీ ఒక్క రూపాయి కూడా ప్రీమియం ఇవ్వకపోయేసరికి అయోమయంగా రాజనాలకేసి చూశాడు ఏకాంబర్.

"ఇవి 'సాలరీ సేవింగ్స్ స్కీం' పాలసీలు. ఉద్యోగులు కడతారు. మూడో నెల నుండి జీతాల్లో రికవరీ   

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
23rd Episode