Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Pooja Phalalu by bannu cartoonist

ఈ సంచికలో >> శీర్షికలు >>

వారఫలం (జూలై 04 - జూలై10) - శ్రీకాంత్

మేష రాశి

ఈవారం మొత్తంమీద ప్రతిపనికూడా ఆశించిన దానికన్నా ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం ఉంది. నూతనపరిచయాలు కలుగుటకు అవకాశం ఉంది వారితో సమయాన్ని గడుపుటకు ఇష్టపడుతారు. ఇష్టమైనపనులను చేపట్టుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులను ఆశించిన విధంగా పూర్తిచేసే అవకాశం ఉంది. నలుగురిలో మంచిపేరును తెచ్చుకొనే అవకాశం ఉంది. ఉద్యోగంలో బాగనేఉంటుంది అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట వలన మేలుజరుగుతుంది. పనిఒత్తడిమూలాన అనారోగ్యసమస్యలు కలుగుటకు ఆస్కారం ఉంది తగిన జాగ్రత్తలు పాటించుట వలన మేలుజరుగుతుంది. ప్రయాణాలు చేయుటకు ఆస్కారం కలదు కావున వీలైనంత వరకు ప్రణాళికా బద్దంగా వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది. ధనమునకు సంభందించిన విషయాల్లో సంతృప్తిని పొందుటకు అవ అవకాశం కలదు పెట్టుబడులు పెట్టునపుడు పెద్దల సూచనలు తీసుకోండి.        

 

వృషభ రాశి

ఈవారం మొత్తంమీద ఆరంభంలో స్వల్ప ఇబ్బందులు పొందినను తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేసే అవకాశం కలదు,అలాగే నూతన ప్రయత్నాలు చేపట్టుట వలన మేలుజరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది పెద్దల సలహాలతో ముందుకు వెళ్ళండి తప్పక మేలుజరుగుతుంది. వృత్తిపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు కలిసి వచ్చే అవకాశం కలదు. ఉద్యోగంలో మీరు చేపట్టిన పనుల్లో అధికారుల సూచనలు పరిగణలోకి తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. బంధుమిత్రుల వలన కొంత మేలుజరిగనను అధికంగా ఇబ్బందిని పొందుటకు అవకాశం కలదు కావున సాధ్యమైనంత వరకు వారికి దూరంగా ఉండే ప్రయత్నం మంచి ఫలితాలను ఇస్తుంది. స్త్రీ సంభందమైన పరిచయాలు కలుగుటకు అవకాశం ఉంది. విందులలో పాల్గొంటారు మిత్రులతో ఆలోచనలు పంచుకొనే అవకాశం కలదు.           


మిథున రాశి

ఈవారం మొత్తంమీద ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం నూతన అవకాశాలు కలిసి వస్తాయి కాకపోతే ఊహించని ఖర్చులు కలుగుతాయి కావున విలువైన వస్తువుల కొనుగోలు విషయంలో నిదానంగా వ్యవహరించుట సూచన. ప్రయాణాల్లో స్వల్ప సమస్యలు తప్పక పోవచ్చును వీలయితే వాయిదా వేయుట మంచిది వస్తువుల విషయంలో జాగ్రత్త తప్పనిసరి. ఉద్యోగంలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించుట మంచిది వారికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం అనేది మేలుచేస్తుంది. వారం చివరలో బాగుంటుంది వేచి చూసే దొరని మంచిది. కుటుంభంలో సభ్యుల ఆలోచనలు నచ్చక పోవచ్చును అయినను వారితో సంప్రదింపులు చేయు ప్రయత్నం ఉత్తమం. ఆలోచనలు అదుపులో ఉంచుకొనే ప్రయత్నం ఉత్తమం అలాగే ఆరోగ్యపరమైన విషయంలో ఆచితూచి వ్యవహరించుట సూచన. పనిఒత్తిడి తప్పక పోవచ్చును సర్దుబాటు అవసరం ఫలితం విషయంలో తొందరపాటు వద్దు.  

        


కర్కాటక రాశి

ఈవారం మొత్తంమీద బంధుమిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుతారు విందులలో పాల్గొనే అవకాశం కలదు. అధికారుల మూలాన ఒత్తిడిని పొందుటకు అవకాశం ఉంది కావున తోటివారిని కలుపుకొని వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. అనారోగ్య సమస్యల వలన ఇబ్బందులు తప్పక పోవచ్చును. ఆలోచనలు ఖర్చులు కలిగించేవిగా ఉండే అవకాశం ఉంది కావున అనుభవజ్ఞుల సూచనలు పాటించు ప్రయత్నం చేయండి. ఇష్టమైన వ్యక్తులను కలువాలనే తలంపును కలిగి ఉంటారు ప్రణాలికా బద్దంగా వ్యవహరించకపోతే లేనిపోని ఇబ్బందులు కలుగుటకు ఆస్కారం ఉంది. ప్రయాణాలు కలిసి వస్తాయి దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు. ఒకవార్త మూలన నిరాశకు లోనయ్యే అవకాశం కలదు మానసికంగా దృడంగా ఉండే ప్రయత్నం చేయుట ఉత్తమం. గతంలో చేసిన పనులకు  సమాధానం చెప్పవలసి వస్తుంది.      

 


సింహ రాశి

ఈవారం మొత్తంమీద తలపెట్టిన పనుల్లో ఆశించిన మేర ఫలితాలు రాకపోవచ్చును కొంత నిరాశను పొందుటకు అవకాశం కలదు. ధనమునకు సంభందించిన విషయాల్లో చాలావరకు నిదానంగా వ్యవహరించుట మంచిది అనుకోని ఖర్చులు వచ్చిపడే అవకాశం కలదు అదేవిధంగా అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండుట సూచన. వినోదాల్లో పాల్గొనేందుకు మక్కువను చూపిస్తారు వాటికి సమయం కేటాయించే అవకాశం కలదు. ప్రయాణాలు లాభదాయకంగా ఉండే అవకాశం కలదు. మాటలు పొదుపుగా వాడుట వలన మేలుజరుగుతుంది వివదాస్పద విషయాలకు దూరంగా ఉండుట సూచన. ప్రమాదకరమైన వస్తువులతో పనిచేసేటప్పుడు తగిన జాగ్రత్తలు చేపట్టుట వలన మేలుజరుగుతుంది. చాలావరకు అనుభవానికి ప్రాధాన్యం ఇవ్వండి మంచిది. కుటుంభంలో కలుగు మార్పుల కొంత ఆశ్చర్యపరిచిన వాటిని ఒప్పుకొనే పరిస్తితి ఏర్పడుతుంది. నూతన ప్రయత్నాల విషయంలో తొందరపాటు నిర్ణయాలు వద్దు.

 

కన్యా రాశి

ఈవారం మొత్తంమీద చిననాటి మిత్రులను కలిసే అవకాశం ఉంది వారితో సమయం గడుపుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనుల్లో నూతన అవకశాలు కలిసి వస్తాయి. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది,ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్ళడం మూలాన మేలుజరుగుతుంది. ఉద్యోగంలో మిశ్రమఫలితాలు పొందుటకు అవకాశం కలదు తోటివారిని కలుపుకొని వెళ్ళండి మంచిది. విందులలో పాల్గొంటారు భోజనం విషయంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన శ్రద్ధను చూపించే అవకాశం కలదు. పనుల్లో శ్రమను పొందుటకు ఆస్కారం కలదు ఓపికగా వాటిని పూర్తిచేసే ప్రయత్నం చేయుట మంచిది. మొండితనంతో తీసుకొనే నిర్ణయాలు నూతన మార్పులకు శ్రీకారం అయ్యేందుకు అవకాశం ఉంది కాకపోతే ఈ విషయంలో అనుభవజ్ఞులతో కలిసి ముందుకు వెళ్ళుట చేసే పనులను తరచి చుసుకొనుట సూచన. పెద్దలతో అయ్యే పరిచయాలు లబ్దిని చేకూర్చే అవకాశం కలదు వారితో కలిసి పనులను చేయుటకు అవకాశం ఉంది. 

 

తులా రాశి

ఈవారం మొత్తంమీద ఆరంభంలో ఆలోచనలతో సతమతమయ్యే అవకాశం ఉంది అనవసరమైన ఆలోచనల విషయంలో అప్రమత్తంగా ఉండుట సూచన. నూతన పరిచయాలు కలుగుటకు అవకాశం ఉంది వారితో సమయాన్ని సంతోషంగా గడుపుటకు అవకాశం కలదు. తలపెట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం ఉంది ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్ళుట చేత మేలుజరుగుతుంది. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి మంచిది. బంధుమిత్రులతో కలిసి సమయాన్ని చాలావరకు గడిపే అవకాశం కలదు. దూరప్రదేశం నుండి వార్తలను వినే ఆస్కారం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు అలాగే పెట్టుబడులకు ఇది అనుకూలమైన సమయం కూడా కాదు జాగ్రత్త. అధికారుల నుండి శ్రమను అలాగే పనిభారం తప్పక పోవచ్చును సమయపాలన అవసరం.      
     
 

వృశ్చిక రాశి

ఈవారం మొత్తంమీద నూతన ప్రయత్నాల కన్నా గతంలో చేపట్టిన పనులను పూర్తిచేయుటకు ప్రాముఖ్యతను ఇవ్వడం వలన మేలుజరుగుతుంది. కుటుంభంలో తీసుకొనే నిర్ణయాలు కీలకమైనవిగా ఉండే అవకాశం ఉంది బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి మంచిది. తలపెట్టిన పనులను కాస్త ఆలస్యం అయినను విజయవంతంగా పూర్తిచేసే ఆస్కారం కలదు. ప్రయాణాలు చేయునపుడు స్వల్ప జాగ్రత్తలు చేపట్టుట వలన సమస్యలు తగ్గుటకు అవకాశం కలదు.మిత్రులతో కలిసి దైవసంభందమైన పనులకు సమయం కేటాయించే అవకాశం కలదు. అనారోగ్యసమస్యలు కలుగుటకు అవకాశం ఉంది ఏమాత్రం అశ్రద్ద చేసిన ఇబ్బందులు తప్పవు జాగ్రత్త. పెద్దలతో మీకుగల పరిచయాలు కొన్ని కొన్ని విషయాల్లో సహాయం చేయుటకు ఆస్కారం కలదు. బంధుమిత్రులను కలిసే ఆస్కారం ఉంది వారి నుండి నూతన సమాచరం తెలుసుకుంటారు.

 

ధనస్సు రాశి

ఈవారం మొత్తంమీద ఆరంభం చాలావరకు సంతోషకరంగా ఉంటుంది తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో కలిసి వస్తుంది నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు ఆస్కారం ఉంది. జీవితభాగస్వామితో స్వల్ప మనస్పర్థలు కలుగుటకు ఆస్కారం ఉంది సర్దుబాటువిధానం ఆవలంభించుట మంచిది. అధికారుల నుండి వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొనే అవకాశం కలదు కాకపోతే ప్రయత్నం ఇంకా పెంచుట ఉత్తమం. పెట్టుబడులు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించక పోతే నూతన సమస్యలు వచ్చిపడే ప్రమాదం ఉంది జాగ్రత్త. ప్రయాణాలు చేయునపుడు విలువైన వస్తువులను పోగొట్టుకొనే అవకాశం ఉంది జాగ్రత్త. ఆలోచనలు పెరుగుటకు అవాకాశం ఉంది వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయుట ఉత్తమం. మిత్రులకు సూచనలు ఇచ్చే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుట ఉత్తమం.      

మకర రాశి

ఈవారం మొత్తంమీద ఆరంభంలో పెద్దల సూచనలు పాటించుట వలన మేలుజరుగుతుంది. నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు అవకాశం కలదు వాటిని అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. అధికారులతో కలిసి సమయాన్ని గడుపుతారు వారికి నచ్చిన విధంగా నడుచుకొనుట వలన మేలుజరుగుతుంది. కుటుంభసభ్యులతో కలిసి సమయాన్ని సరదాగా గడిపే ఆస్కారం ఉంది. విందులలో,వినోదాల్లో పాల్గొనే అవకాశం కలదు. కొత్త కొత్త ఆలోచనలు చేయుటకు ఆస్కారం కలదు కాకపోతే వాటిని అమలుచేసే విధానంలో మంచి ప్రణాళికా అవసరం. రాజకీయపరమైన విషయాల పట్ల మక్కువను కలిగి ఉంటారు నలుగురిలో గుర్తింపును పొందుటకు అవకాశం ఉంది. కుటుంభంలో ఒకరి ఆరోగ్యం మిమ్మల్ని ఆందోళనకు గురిచేసే అవకాశం ఉంది. దైవసంభందమైన విషయాలకు సమయం ఇచ్చే ప్రయత్నం మంచిది. పెద్దల పరిచయాలు మేలుచేయుతకు అవకాశం ఉంది.  

 


కుంభ రాశి

ఈవారం మొత్తంమీద కుటుంభసభ్యులతో కలిసి నూతన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది,కొన్ని విషయాల్లో వారి సూచనల పట్ల అనాసక్తిని చూపిస్తారు సర్దుబాటు విధానం అవసరం. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట లేదా అందరిని కలుపుకొని వెళ్ళుట చేత ఆశించిన విధంగా ఫలితాలు సాధించే ఆస్కారం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో ఊహించిన దానికన్నా అధికంగా ఖర్చులు అయ్యేందుకు అవకాశం కలదు. వ్యాపారపరమైన విషయాల్లో మాత్రం నూతన అవకాశాలు పొందుటకు ఆస్కారం కలదు. అనారోగ్యసమస్యలు కొంత భాధించే అవకాశం కలదు అశ్రద్ద చేయకండి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది వాటి మూలాన లబ్దిని పొందుటకు ఆస్కారం ఉంది. మానసికంగా దృడంగా ఉండుట వలన మేలుజరుగుతుంది. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి వాటి విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి.      
 

మీన రాశి

ఈవారం మొత్తంమీద అధికారులతో కలిసి నూతన చర్చలు చేపట్టుటకు అవకాశం కలదు. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. నలుగురిలో ఆశించిన స్థాయిలో గుర్తింపును పొందుటకు అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో బాగుంటుంది. పనులలో శ్రమను పొందుటకు ఆస్కారం కలదు ప్రణాళికా పరంగా ముందుకు వెళ్ళుట సూచన.  తలపెట్టిన ప్రయత్నాలు ఒకింత ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. మిత్రులతో కలిసి సమయం గడుపుతారు. దూరప్రదేశం నుండి నూతన విషయాలు తెలుసుకొనే అవకాశం ఉంది. వ్యతిరేకవర్గం నుండి ఇబ్బందులు పెరుగుటకు అవకాశం కలదు వాటి విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. అనారోగ్యం విషయంలో అశ్రద్ద వద్దు స్వల్ప అనారోగ్యం సూచితం.కుటుంభసభ్యులతో సమయం గడుపుటకు అవకాశం ఉంది.

శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిష్యాలయం

మరిన్ని శీర్షికలు
Middle Age Acne and Ayurvedic Treatment by Prof. Dr. Murali Manohar Chirumamilla, M.D. (Ay)