Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
enough our safety

ఈ సంచికలో >> శీర్షికలు >>

వారఫలం (జూలై 25- జూలై31) - శ్రీకాంత్

మేష రాశి

ఈవారం మొత్తంమీద ఇష్టమైన పనులకు సమయం ఇవ్వాలనే ఆలోచన కలిగి ఉంటారు. ప్రణాలికా బద్దంగా ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. ప్రయాణాల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం అనేది సూచన వీలైతే వాయిదవేయుట మంచిది. మిత్రులతో కలిసి నూతన పనులను చేపట్టాలనే తలంపును కలిగి ఉంటారు వారితో చర్చలలో పాల్గొంటారు. ఆర్థికపరమైన విషయల్లో బాగానే ఉంటుంది ఖర్చుల విషయంలో మాత్రం జాగ్రత్తగా వ్యవహరించుట మంచిది. అధికారుల నుండి నూతన విషయాలను తెలుసుకుంటారు సమయపాలన మంచిది. చెడువ్యసానలకు అలవాటు పడే అవకాశం కలదు జాగ్రత్త. వీదేశీప్రయాణాలు అనుకూలిస్థాయి. గకొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న పనులు వారం చివరలో పూర్తిఅవుటకు అవకాశం కలదు.  

 

 

వృషభ రాశి

ఈవారం మొత్తంమీద తలపెట్టిన పనుల విషయంలో ఆరంభంలో చిన్న చిన్న సమస్యలు ఎదురైనా చివరకి వాటిని విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం ఉంది ప్రయాణాలు చేయునపుడు స్వల్ప జాగ్రత్తలు అవసరం. ఉద్యోగంలో మిశ్రమఫలితాలు పొందుటకు అవకాశం ఉంది నలుగురిని కలుపుకొని వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. బంధువులతో కలిసి చేపట్టిన పనులలో ఊహించిన దానికన్నా అధికమైన ఖర్చులు పొందుటకు అవకాశం కలదు. నూతన ప్రయత్నాలు నిదానంగా ముందుకు సాగుతాయి మంచి ప్రణాళికతో ముందుకు వెళ్ళుట సూచన. కుటుంభసభ్యులతో కలిసి నూతన విషయాల గురించి చర్చచేయుటకు అవకాశం కలదు. సమయానికి భోజనం చేయుట అలాగే ఆరోగ్యం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధను చూపుట మంచిది.


మిథున రాశి

......  ఈవారం మొత్తంమీద తలపెట్టిన పనులను కాస్త ఆలస్యంగానైనా పూర్తిచేసే అవకాశం కలదు. అధికారులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం వలన మేలుజరుగుతుంది వారి సూచనలకు అనుగుణంగా వ్యవహరించుట మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం ఆశించిన విధంగా ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. ప్రయాణాలు చేయునపుడు చిన్న చిన్న విషయాలకు సైతం విలువను ఇవ్వడం మంచిది. బంధువులతో కలిసి చేయుఆలోచనల విషయంలో అవగాహన అవసరం. మొదట్లో ఆలోచనలతో సతమతమయ్యే అవకాశం కలదు. తీసుకొనే నిర్ణయాలు జాగ్రత్తగా ఆలోచించి తీసుకోండి మంచిది. మిత్రులకు అవసరమైన పనులను చేపట్టుటకు అవకాశం కలదు మంచి గుర్తింపును పొందుటకు అవకాశం ఉంది.  

కర్కాటక రాశి

...........ఈవారం మొత్తంమీద బంధుమిత్రులతో కలిసి నూతన ఆలోచనలు చేపట్టుటకు అవకాశము ఉంది కాకపోతే ఊహించని విధంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది జాగ్రత్త. అధికారులకు మీరు చేసిన ఆలోచనలు నచ్చకపోవచ్చును అయినను సర్దుకుపోవడం అనేది సూచన నలుగురిని కలుపుకొని వెళ్ళండి. కొన్ని కొన్ని విషయాల్లో మొండిగా ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది శ్రమను అలవాటు చేసుకోవడం అనేది సూచన. ప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేయుట ఉత్తమం. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుటకు అవకాశం ఉంది ధనం రావడం అలాగే ఖర్చులు సమానంగా ఉండే ఆస్కారం కలదు. వ్యాపరంలో మాత్రం తొందరపాటు నిర్ణయాలు చేయకండి నచ్చిన వారిని కలుస్తారు వారికి అనుగుణంగా నడుచుకొనే అవకాశం కలదు

 

సింహ రాశి

............ఈవారం మొత్తంమీద ఆరంభం బాగుంటుంది తలపెట్టిన పనులలో ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. ఇతరుల సూచనలు పాటించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయుట మంచిది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. నలుగురితో కలిసి పనిచేసే సమయంలో అవతలి వారి అభిప్రాయలను గౌరవించుట వలన కొత్త సమస్యలు రాకుండా ఉండే అవకాశం కలదు. కుటుంభంలో మాటపట్టింపులకు పోకపోవడం అనేది సూచన పెద్దల నుండి నూతన విషయాలను తెలుసుకొనే అవకాశం ఉంది. చిననాటి మిత్రులను కలుసుకుంటారు వారితో సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. విందులలో పాల్గొనే అవకాశం ఉంది భోజనం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధను కలిగి ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో అనుకోని ఖర్చులు పొందుతారు నిదానం అవసరం

 

కన్యా రాశి

......ఈవారం మొత్తంమీద నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం కలదు. పెద్దలను సంప్రదించి నూతన నిర్ణయాలు తీసుకొనే అవకాశం కలదు. వ్యతిరేకవర్గం నుండి వచ్చిన సమస్యలను అధిగమిస్తారు. ఆర్థికపరమైన విషయల్లో బాగుంటుంది. విదేశీప్రయత్నాలు కలిసి వస్తాయి గట్టిగా ప్రయత్నం చేయుట వలన మరింత ఉన్నతమైన ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనుల్లో శ్రమను పొందుటకు అవకాశం ఉంది ప్రణాలికాప్రకారం ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. ప్రయాణాల విషయంలో నూతన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. కుటుంభంలో సభ్యులతో కలిసి చర్చల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఉద్యోగప్రయత్నాలు కలిసి వస్తాయి ప్రయత్నాలు చేయుట మంచిది

 

తులా రాశి

 .......

.......ఈవారం మొత్తంమీద ఆరంభంలో కొంత తడబడిన వారం అంతా ఆశాజనకంగా ఉంటుంది. నూతన ప్రయత్నాలు పెట్టుటకు అవకాశం ఉంది. ధనమునకు సంభందించిన విషయాల్లో చేపట్టిన ప్రయత్నాలు లాభాజనకంగా ఉండే అవకాశం కలదు. ఉద్యోగప్రయత్నాలు కలిసి వస్తాయి కుటుంభంలో కీలకమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది ఆ దిశగా అడుగులు ముందుకు వేయండి. బద్ధకం వేధించే అవకాశం కలదు పనులకు ప్రాధాన్యం ఇవ్వడం అదేవిద్నగా ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించుట మంచిది ప్రణాళిక అవసరం. అనారోగ్యవిషయంలో జాగ్రత్తగా వ్యవహరించుట వలన త్వరగా  కోలుకొనే అవకాశం కలదు. ప్రయాణాల విషయంలో మాత్రం నిదానంగా వ్యవహరించుట మంచిది అలాగే కోపానికి దూరంగా ఉండుట వలన మేలుజరుగుతుంది.   

 

 

వృశ్చిక రాశి

.......ఈవారం మొత్తంమీద బాగుంటుది అనుకున్న పనులను విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం కలదు మంచి ప్రణాళిక అవసరం. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి ఉద్యోగంలో అధికారుల నుండి ఆశించిన విధంగా గుర్తింపును పొందుటకు ఆస్కారం కలదు. శ్రమను ఇష్టంగా స్వీకరించుట అలాగే ముఖ్యమైన పనులకు ముందుగా సమయం ఇవ్వడం సూచన. కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం త్వరగా డీలాపడే అవకాశం ఉంది మానసిక్నగా దృడంగా ఉండండి. ప్రయాణాలు కలిసి వస్తాయి నలుగురిలో ఆశించిన గుర్తింపును పొందుటకు అవకాశం కలదు. మిత్రులతో కొత్త కొత్త విషయాలు చర్చించే అవకాశం కలదు. కుటుంభసభ్యులతో కలిసి చర్చల్లో పాల్గోనేటప్పుడు వారి సూచనలు పరిగణలోకి తీసుకోవడం వలన మేలుజరుగుతుంది

ధనస్సు రాశి

.....

ఈవారం మొత్తంమీద ప్రయాణాలు చేయవలసి రావోచును వాటికి సమయాన్ని ఇవ్వవలసి రావోచ్చును ప్లాన్ చేసుకోండి. కుటుంభంలో సభ్యుల నుండి వినతులు వచ్చుటకు అవకాశం కలదు వాటిని పరిశీలించి ఎవ్వరికి ఇబ్బందులు కలుగకుండా నిర్ణయాలు తీసుకోవడం సూచన. వ్యాపరంలో నూతన ఆలోచనలు చేపట్టుటకు అవకాశం ఉంది పెద్దల సలహాలను పాటించుట వలన తప్పక మేలుజరుగుతుంది సొంతనిర్ణయలు వద్దు. ప్రతిపనిని బాగా ఆలోచించి చేపట్టుట వలన మేలుజరుగుతుంది అలాగే నూతన పనులను చేపట్టుటలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. స్వల్పఅనారోగ్య సమస్యలు తప్పకపోవచ్చును అశ్రద్ద చేయకండి. ఉద్యోగంలో అధికారుల నుండి పనిభారంను అలాగే ఒత్తిడి పొందుటకు అవకాశం కలదు.

 

 

 

మకర రాశి

......ఈవారం మొత్తంమీద అన్నివిషయాల్లో బాగుంటుంది తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తీ చేయుటకు అవకాశం ఉంది. నలుగురికి ఉపయోగపడే పనులను చేపట్టుట వలన గుర్తింపును పొందుటకు అవకాశం కలదు. అధికారులతో సత్సంభందాలు కలిగి ఉండే అవకాశం కలదు వారి నుండి ఆశించిన విషయాలను తెలుసుకుంటారు. తొతిఉద్యొగులను కలుపుకొని వెళ్ళుట వలన మరిన్ని ఫలితాలు వచ్చుటకు అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టుటకు అనుకూలమైన కాలం బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వలన లబ్దిని పొందుతారు. ఉద్యోగంలో మార్పులను కోరుకొనే అవకాశం ఉంది ఈ విషయంలో మాత్రం అనుభవజ్ఞుల సూచనలు తీసుకోండి మంచిది. దైవసంభందమైన విషయాలకు సమయాన్ని ఇవ్వడం చేత మేలుజరుగుతుంది

 


కుంభ రాశి

.....

ఈవారం మొత్తంమీద బాగుంటుంది కాకపోతే ఆరంభంలో స్వల్ప ఇబ్బందులు తప్పకపోవచ్చును. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేయుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పులను కోరుకొనే అవకాశం ఉంది కాకపోతే తొందరపాటు నిర్ణయాలు వద్దు తప్పదు అనేటప్పుడు మాత్రమే నిర్ణయం తీసుకోండి. సల్పఅనారోగ్యసమస్యలు తప్పకపోవచ్చును కావున సమయానికి భోజనం చేయుట ఒత్తిడి లేకుండా చూసుకోండి. ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం ఖర్చులు రాబడికి మించి ఉండే అవకాశం కలదు జాగ్రత్త. శుభాకార్యక్రమాలు చేపట్టాలనే తలంపును కలిగి ఉంటరు వాటి గురుంచి ఆలోచన చేబడుతారు. కుటుంభంలో సభ్యుల ఆలోచన మీఎకు అంతంగా నచ్చకపోవచ్చును కాకపోతే వివాదములకు దూరంగా ఉండండి.     

 

.      

మీన రాశి

........ఈవారం మొత్తంమీద  కొన్ని కొన్ని విషయాల్లో తప్పనిసరిగా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది ఈ విషయంలో కొంత తడబాటు కనభడుతుంది జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పూజల్లో పాల్గొనేప్రయత్నం చేయండి దైవసంభందవిషయాలకు సమయం ఇవ్వడం మంచిది. ఉద్యోగంలో అందరి ఆహాకారంతో పనులను విజయవంతంగా పనులను పూర్తిచేయుటకు అవకాశం ఉంది. ప్రయాణాల విషయంలో మొండివైకరిని ఆవలభించే అవకాశం కలదు. అధికారులకు అలాగే పెద్దలకు అనుగుణంగా నడుచుకొనుట వలన పేరును సంపాదించుకుంటారు. కుటుంభంలో కాస్త సమయాన్ని ఇవ్వండి అలాగే వినోదాల పట్ల మక్కువను కలిగిఉండే అవకాశం ఉంది. సంతానపరమైన విషయాల్లో నూతన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. 
శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిష్యాలయం

మరిన్ని శీర్షికలు
madhav