Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Pawan Kalyan Car

ఈ సంచికలో >> సినిమా >>

సినిమా ప్రముఖుల పొదుపు సూత్రం

savings of film artists

ఖరీదైన కార్లున్నా, ఇష్టమొచ్చినట్లు తిరగలేరు సినీ సెలబ్రిటీలు. దానిక్కారణం వారికి వుండే ఫాలోయింగ్‌. పెద్ద పెద్ద స్టార్లు బయటకు వచ్చేందుకు ఇబ్బంది పడ్తారుగానీ, సింగర్స్‌, మ్యూజిక్‌ డైరెక్టర్స్‌.. చిన్నా చితకా నటీనటులు.. వంటి వారు మాత్రం ఎంతో కొంత స్వేచ్ఛను ఎంజాయ్‌ చేయగలుగుతారు.

అయితే, వారికీ పాపులారిటీ పెరిగిపోతుండడంతో, బయటకు వెళ్ళడం కష్టమవుతోంది. ఇలాంటివారు ఇప్పుడు సింపుల్‌గా, టూ వీలర్స్‌లో ఎలాంటి బెరుకూ లేకుండా తిరిగేస్తున్నారు. దానికి వారి వద్ద ఓ చిన్న చిట్కా వుంది. లేడీస్‌ అయితే హెల్మెట్‌, లేదా స్కార్ఫ్‌ ఒకటి మొహానికి అడ్డం పెట్టుకవడం. అదే జెంట్స్‌ అయితే, హెల్మెట్‌ ఒక్కటే వారికి శరణ్యం.

కార్లో బయటకు వెళ్ళడమంటే, టూ వీలర్‌కి అయ్యే ఖర్చుకన్నా ఎక్కువ వెచ్చించాల్సిందే. సరదాకి సరదా.. ఆదాకి ఆదా. అందుకే టూ వీలర్స్‌ని ఇప్పుడు చాలామంది సెలబ్రిటీలు ఆశ్రయిస్తున్నారట. ఆ మధ్య కొందరు యంగ్‌ హీరోలు.. ఇలానే ఫేస్‌ని హెల్మెట్‌తో కవర్‌ చేసేసి సిటీ రోడ్లపై రయ్యిమని తిరిగేశారంటూ వార్తలొచ్చాయి.

ఇది పొదుపు సూత్రమా.? లేదంటే ఎంజాయ్‌మెంటా.? అంటే ఎలా అర్థం చేసుకుంటే అలాగే.

మరిన్ని సినిమా కబుర్లు
tent by sarwanand in namebia