Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
tent by sarwanand in namebia

ఈ సంచికలో >> సినిమా >>

సునీల్‌ నుంచి మహేష్‌ వరకు

suneel to mahesh

తెలుగు సినిమాకి సిక్స్‌ ప్యాక్‌ ఫీవర్‌ అంటించింది అల్లు అర్జున్‌. ‘దేశముదురు’ సినిమాతోనే టాలీవుడ్‌లో సిక్స్‌ ప్యాక్‌ ఫీవర్‌ బాగా పాకిపోయింది. బాలీవుడ్‌లో హృతిక్‌ రోషన్‌, అమీర్‌ఖాన్‌, షారుక్‌ఖాన్‌.. తమిళంలో ఎస్‌.జె.సూర్య తదితరులు.. సిక్స్‌ప్యాక్‌తో తమదైన ప్రత్యేకతను చాటుకున్నారు.

సినీ సెలబ్రిటీలు సిక్స్‌ ప్యాక్‌తో తెరపై రెచ్చిపోతోంటే, వారి అభిమానులూ సిక్స్‌ ప్యాక్‌ కోసం ప్రయత్నించడం ప్రారంభించారు. మరీ ముఖ్యంగా సునీల్‌కి సిక్స్‌ ప్యాక్‌ వచ్చాక యూత్‌లో సిక్స్‌ ప్యాక్‌పై క్రేజ్‌ బాగా పెరిగిపోయింది. ఓ మోస్తరుగా లావెక్కితే ఇక సిక్స్‌ ప్యాక్‌ కాదు కదా, ఫిట్‌ బాడీ కూడా దక్కదనే అభిప్రాయం వుంది. దాన్ని సునీల్‌ పటా పంచలు చేసేశాడు.

‘పూలరంగడు’ సినిమాలో సునీల్‌ సిక్స్‌ ప్యాక్‌ అందర్నీ ఆకట్టుకుంది. అయితే ఫేస్‌లో మార్పులు వచ్చేస్తాయనే ఓ అపోహ వుంది. దాన్ని మహేష్‌ పోగొట్టబోతున్నాడట. సుకుమార్‌ డైరెక్షన్‌లో చేయబోతున్న సినిమా కోసం సిక్స్‌ ప్యాక్‌ బాడీ సొంతం చేసుకున్నాడు మహేష్‌.
ఈ సినిమాలో మహేష్‌ ఇదివరకటి లుక్‌తోనే కన్పిస్తాడనీ, లోపల మాత్రం పలకల బాడీ.. అదే సిక్స్‌ ప్యాక్‌ అభిమానుల్నీ అలరింపజేస్తుందని సమాచారం. ఇలా సెలబ్రిటీలు సిక్స్‌ప్యాక్‌కి బ్రాండ్‌ అంబాసిడర్స్‌గా మారిపోవడంతో, జిమ్‌ వ్యాపారం మూడు పువ్వులు 36 కాయల్లా మారిపోయింది.

తక్కువలో తక్కువ నెలకి మూడు వేలు.. బాగా ఎక్కువంటే నెలకి పది, ఇరవై వేలు ఖర్చు పెట్టించేలా జిమ్‌లు అందుబాటులోకి వచ్చాయి. కేవలం ఎక్సర్‌సైజులు మాత్రమే కాకుండా, ఫిట్‌నెస్‌ ట్రెయినర్‌ సూచనలు, ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు.. వీటికి తోడు ప్రొటీన్‌ ఫుడ్‌.. ఇవన్నీ ‘ఎక్స్‌ట్రా’ కాస్ట్‌తో లభిస్తున్నాయి.

మరిన్ని సినిమా కబుర్లు
junior varma praveen sree