Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
suneel to mahesh

ఈ సంచికలో >> సినిమా >>

మరో జూనియర్‌ వర్మ ఇతనే

junior varma praveen sree

తెలుగులో ‘కాళీచరణ్‌’ అనే ఓ సినిమా వస్తోంది. ‘స్నేహగీతం’ ఫేం చైతన్య ఈ సినిమాలో హీరో. ఈ చిత్రానికి ప్రవీణ్‌ శ్రీ దర్శకుడు. ఈయన వర్మ శిష్యుడు. వర్మ దగ్గర శిష్యరికం చేశామని చెప్పుకోవడాన్ని గొప్పగా ఫీలవుతుంటారు ఆయన వద్ద కొన్ని రోజులు పనిచేసినవారైనాసరే.
పూరి జగన్నాథ్‌, హరీష్‌ శంకర్‌.. ఇలా చెప్పుకోవాలంటే వర్మ శిష్యుల లిస్ట్‌ చాలా పెద్దదే వుంటుంది. ఆ లిస్ట్‌లో తన పేరూ చేరుతుందంటున్నాడు ప్రవీణ్‌ శ్రీ. మిగతావారికీ, ప్రవీణ్‌ శ్రీకి తేడా ఏంటంటే.. వర్మని మొత్తానికి మొత్తంగా అనుకరించేస్తాడితను. ప్రవీణ్‌ శ్రీ మాట తీరు, బాడీ లాంగ్వేజ్‌.. ఇవన్నీ వర్మని పోలి వుంటాయి.

వర్మ అభిమానులు ఓ మాట చెప్తుంటారు. వర్మ  కాటేస్తే.. ఆ విషయం నరనరానికీ ఎక్కేసి.. వర్మలానే మారిపోతామని.  మిగతావారి సంగతేమోగానీ, ప్రవీణ్‌ శ్రీని వర్మ అనే ఓ ఇమేజ్‌ గట్టిగానే కాటేసినట్టుంది. ‘కాళీచరణ్‌’ షూటింగ్‌ స్పాట్‌లో.. ఒక్కోసారి దర్శకుడు ప్రవీణ్‌ శ్రీని చూసి వర్మ దిగొచ్చాడా.? అని అనుకునేవారట. అంతలా వర్మని అనుకరించేస్తున్నాడు ప్రవీణ్‌ శ్రీ..

ఇది అనుకరణా? లేక.. వర్మని క్లోజ్‌గా అబ్జర్వ్‌ చేసి.. వర్మ అంటే ప్యాషన్‌తో.. అతన్నే ఫాలో అయి అలా మారిపోయాడా.? అనేది ప్రవీణ్‌ శ్రీకే తెలియాలి. బాడీలాంగ్వేజ్‌ మాత్రమేనా.? టాలెంట్‌లోనూ వర్మకు తగ్గ శిష్యుడినని ప్రవీణ్‌ శ్రీ నిరూపించుకుంటాడా.?

మరిన్ని సినిమా కబుర్లు
is sridevi as mother of prabhas