Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Aratikaya Chicken

ఈ సంచికలో >> శీర్షికలు >>

వారఫలం (ఆగష్టు 8నుండి ఆగష్టు 14 వరకు ) - శ్రీకాంత్

మేష రాశి

వారం మొత్తం మీద మీరు మిత్రులతో కలిసి సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది వారి నుండి నూతన విషయాలను తెల్సుకొనే ఆస్కారం కలదు. ఉద్యోగంలో మాత్రం అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట వలన మేలుజరుగుతుంది. పైఅధికారులతొ చేపట్టిన పనుల మూలాన నలుగురిలో మంచిగుర్తింపును పొందుటకు అవకాశం కలదు. కుటుంభంలో సభ్యులతో కలిసి భవిష్యత్తు గురుంచి నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. వారితో కలిసి విందులలో పాల్గొంటారు.  కొన్ని కొన్ని నిర్ణయాల మూలన ఊహించిన దానికన్నా అధికమైన ఖర్చులు కలుగుటకు ఆస్కారం కలదు. నూతన ప్రయత్నాలు ఆరంభించే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది.

వృషభ రాశి

 వారం మొత్తం మీద మీరు అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట వలన మేలజరుగుతుంది. గతంలో చేపట్టిన పనులకు సమాధానం చెప్పవలసి రావోచ్చును ముందు వాటిని పూర్తిచేసే ప్రయత్నం చేయుట మంచిది. నూతన ప్రయత్నాలు వాయిదా వేయుట వలన మేలుజరుగుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు చేపట్టుట వలన మేలుజరుగుతుంది. ధనము విషయంలో నిదానం అవసరం అనవసరమైన ఖర్చుల విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధను చూపుట వలన మేలుజరుగుతుంది స్వల్ప అనారోగ్యసమస్యలు తప్పక పోవచ్చును. సోదరులతో కలిసి చేపట్టిన చర్చలలో పూర్తిస్థాయి ఫలితాలు ఇవ్వకపోవచ్చును కొంత మేర సర్దుబాటు అవసరం

మిథున రాశి

వారం మొత్తం మీద మీరు నలుగురిని కలుపుకొని వెళ్ళుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకశాలు పొందుటకు అవకాశం కలదు సంతృప్తికరమైన ఫలితాలు వస్తాయి.  చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు అలాగే వారినుండి విలువైన సూచనలు వచ్చే ఆస్కారం కలదు. కొన్ని కొన్ని విషయాల్లో మొండినిర్ణయాల వలన నష్టపోయే అవకాశం ఉంది జాగ్రత్త. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది దూరప్రదేశాలకు వెళ్ళుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట వలన మేలుజరుగుతుంది. మీ ఆలోచనలు తోటివారికి సహాయ పడుతాయి వారికి లబ్దిని చేకూర్చే అవకాశం కలదు. నూతన పరిచయాలు కలుగుటకు అవకాశం ఉంది.
 

కర్కాటక రాశి

వారం మొత్తం మీద మీరు తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేయుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో సంతృప్తికరమైన ఫలితాలు పొందుటకు అవకాశం కలదు. మిత్రులతో సమయాన్ని గడుపుతారు వారితో కలిసి నూతన ప్రయత్నాలకు కేటయించే అవకాశం కలదు. ఉద్యోగంలో అధికారులతో స్వల్ప మనస్పర్థలు కలుగుటకు అవకాశం కలదు. ఉద్యోగంలో ఏవైనా నిర్ణయాలు తీసుకొనే ముందు తొందరపాటు వద్దు అలాగే వివాదములకు దూరంగా ఉండే ప్రయత్నం చేయుట మంచిది. ప్రయాణాలు చేయునపుడు కొంత జాగురుకత అవసరం అలాగే ఖర్చులు పెరుగుటకు అవకాశం ఉంది. అనారోగ్యం విషయంలో అశ్రద్ద వద్దు సమయానికి భోజనం చేయండి.
    

సింహ రాశి

వారం మొత్తం మీద మీరు ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు వారితో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు. బంధువుల నుండి విలువైన సమాచరం అందుతుంది. ఉద్యోగంలో శ్రమను పొందుతారు ప్రణాళికతో ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. అనారోగ్యం మూలాన ఇబ్బందులు కలుగుటకు అవకాశం ఉంది తగిన జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణాల వలన సమయాన్ని నష్టపోయే అవకాశం ఉంది వీలయితే వాయిదా వేయుట సూచన.  పనులను చేయునపుడు జాగ్రత్తగా లేకపోతే విలువైన వస్తువులకు ప్రమాదం చోటుచేసుకొనే అవకాశం ఉంది జాగ్రత్త. చేపట్టిన పనులలో ఊహించని ఖర్చులు కలుగుటకు అవకాశం ఉంది,అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండుట వలన మేలుజరుగుతుంది

కన్యా రాశి

వారం మొత్తం మీద మీరు కుటుంభంలో నూతన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది,కుటుంభసభ్యుల సూచనలు సలహాలను పరిగణలోకి తీసుకోవడం వలన మరింత మంచి ఫలితాలు వస్తాయి. తలపెట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేయుటకు అవకాశం కలదు నలుగురిని కలుపుకొని వెళ్ళండి దానివలన మేలుజరుగుతుంది. గతంలో చేపట్టిన పనులను పూర్తిచేసే ఆస్కారం కలదు వాటికి ప్రాముక్యత ఇవ్వడం సూచన. మాటపట్టింపులకు పోకపోవడం మంచిది వివాదములకు దూరంగా ఉండుట సూచన. ఉద్యోగప్రయత్నాలు కలిసి వస్తాయి కొంత ప్రణాళిక అవసరం. ప్రయాణాలు చేయకండి సమయాన్ని విలువైన విషయాలకు ఇవ్వడం మూలాన మేలుజరుగుతుంది. ఒకవార్త కొంత నిరుత్సాహంను కలుగజేస్తుంది.
    

తులా రాశి

వారం మొత్తం మీద మీరు మిశ్రమ ఫలితాలు పొందుతారు. నచ్చిన పనులకు సమయాన్ని ఇస్తారు నూతన ప్రయత్నాల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో కొంత మెరుగైన ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. కుటుంభంలో సభ్యుల నుండి సహాకారం అందుటకు అవకాశం కలదు. ప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం సూచన. భాద్యతలు పెరుగుటకు అవకాశం ఉంది వీటి విషయంలో అశ్రద్ధచేయకుండా ప్రణాలికా బద్దంగా వ్యవహరించుట మంచిది. మిత్రులనుండి వచ్చిన సమాచరం మిమ్మల్ని ఆశ్చర్యానికి లోనుచేస్తుంది అలాగే కొంత భాధకు గురిచేసే అవకాశం కలదు. వ్యాపారపరమైన విషయాల్లో ఊహించని ఖర్చులు పెరుగుతాయి.

వృశ్చిక రాశి

వారం మొత్తం మీద మీరు మాటతీరును మార్చుకోకపొతే నూతన సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు వారితో నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం కలదు. వ్యాపారపరమైన విషయాల్లో నూతన నిర్ణయాలు తీసుకోకపోవడం సూచన. ప్రయాణాల వలన ఇబ్బందులు తప్పక పోవచ్చును వీలైతే వాయిదా వేయుట వలన మేలుజరుగుతుంది. వాహానప్రమాదాలు జరుగుటకు అవకాశం ఉంది కావున జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. దైవసంభందమైన విషయాలకు సమయాన్ని ఇస్తారు పూజలలో పాల్గొనే ఆస్కారం కలదు. నూతన ప్రయత్నాల విషయంలో పెద్దల సూచనల మేర నడుచుకోవడం మంచిది. తండ్రితరుపు బంధువుల నుండి నూతన సమాచరం వస్తుంది వాటికి సమయాన్ని ఇచ్చే అవకాశం ఉంది. 

ధనస్సు రాశి

వారం మొత్తం మీద కూని కొన్ని పనులను పూర్తిచేసినను తోటివారి మూలాన ఊహించని విధంగా నూతన సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. బంధువులనుండి వినే వార్తలు మీలో నూతన ఉత్శాహాన్ని నింపుటకు అవకాశం ఉంది. మీరు తలపెట్టిన పనులను మాత్రం అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. విందులలో పాల్గొంటారు,భోజనం విషయంలో జాగ్రత్తలు పాటించుట ఉత్తమం. ఆరోగ్యపరమైన విషయాల్లో స్వల్ప ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది జాగ్రత్త. సరైన సమయంలో మంచి నిర్ణయం తీసుకోవడం వలన సమస్య తీవ్రతను తగ్గించుకోవచ్చును. పెద్దలతో పరిచయాలు అవుటకు ఆస్కారం కలదు వారితో ఆలోచనలు పంచుకొనే అవకాశం ఉంది. ఉద్యోగంలో పనిభారం తప్పదు మొండినిర్ణయాలు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. 

మకర రాశి

వారం మొత్తం మీద మీరు అనవసరమైన చర్చలకు దూరంగా ఉండుట వలన మేలుజరుగుతుంది. మాటతీరు వివాదములను కలుగజేయుటకు అవకాశం ఉంది జాగ్రత్త. వ్యాపారపరమైన విషయల్లో తీసుకొనే నిర్ణయాల విషయంలో చర్చలకు అవకాశం ఇవ్వడం వలన నిర్ణయాలు మేలుచేస్తాయి. నూతన నిర్ణయాలు  తీసుకొనే  ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి ముందుకు వెళ్ళుట మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో ఊహించని ఖర్చుల వలన సమస్యలు ఎదురవుతాయి. పెద్దలనుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం మూలాన మేలుజరుగుతుంది. ఉద్యోగంలో మిశ్రమఫలితాలు కలుగుతాయి. వారం చివరలో ఆశించిన ఫలితాలు రావడం చేత సంతృప్తిని పొందుటకు అవకాశం కలదు.  

కుంభ రాశి

వారం మొత్తం మీద మీరు చేపట్టిన పనుల్లో ఆశించిన ఫలితాలు రావడం వలన ఊరటను చెందుతారు. నూతన ప్రయత్నాలు ఆరంభించి వాటిని విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం కలదు. ప్రయాణాలు అలాగే ఆరోగ్యం వలన కొంత చికాకులు తప్పక పోవచ్చును. ఆర్థికపరమైన విషయాల్లో ఆశించిన ఫలితాలు రావడం మరింత బలాన్ని ఇస్తాయి. వ్యాపారపరమైన విషయాల్లో నిర్ణయాలు ఒక్కొక్కటిగా తీసుకోవడం ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్ళడం అనేది సూచన. కొన్ని కొన్ని విషయాల్లో ఆత్మన్యూనత పెరుగుటకు అవకాశం ఉంది దైవసంభందమైన విషయాలకు సమయం ఇవ్వడం మంచిది. స్వల్ప పనిఒత్తిడి పెరుగుతుంది అలాగే ఆరోగ్యం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధను చూపుట వలన మేలుజరుగుతుంది. మిత్రులద్వర నూతన సమస్యలు కలుగుతాయి జాగ్రత్త.  

మీన రాశి

 వారం మొత్తం మీద మీరు తలపెట్టిన పనులను దాదాపుగా పూర్తిచేసే అవకాశం ఉంది. ఉద్యోగంలో మంచి మార్పులు కలుగుటకు అవకాశం ఉంది అధికారుల నుండి గుర్తింపును పొందుతారు. నూతన పనులను ఆరంభిస్తారు. మిత్రుల నుండి ఆశించిన విధంగా సహాకారం ఉంటుంది. మిత్రులతో చర్చల్లో పాల్గొనేటప్పుడు మీ అభిప్రాయలను వారితో పంచుకోవడం ఉత్తమం.  బందువుల నుండి నూతన సమాచారం సేకరిస్తారు. కుటుంభంలో జీవితభాగస్వామితో చర్చలు చేయుటకు అవకాశం ఉంది,పెద్దలనుండి నూతన విషయాలను తెలుసుకొనే అవకాశం ఉంది. ఆర్థికంగా మిశ్రమఫలితాలు కలుగుటకు అవకాశం ఉంది అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండుట అనేది సూచన. ప్రయాణాల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చుటకు అవకాశం కలదు. 

శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిష్యాలయం

మరిన్ని శీర్షికలు
sahiteevanam