Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Hindi geya vaibhavam book review

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఎంతటి స్వాతంత్ర్య దేశం మనది - వి. రాజా

entati svatamtryam manadi
ప్రపంచంలో మనకన్నా స్వతంత్రులు ఎవరున్నారు? ఇంతటి స్వాతంత్ర్యం ఎవరికి వుంది?

రోడ్డుపై మీ చిత్తానికి మీరు మీ వాహనాన్ని, నడపొచ్చు..అడ్డగోలుగా గింగిరాలు కొట్టచ్చు. దానికి సైలెన్సర్ పీకి, నానా భయంకరమైన శబ్ధాలు సృష్టించవచ్చు..

మీ ఇంటి చెత్తను మీరు ఎక్కడ ఖాళీ కనిపిస్తే అక్కడ పోసేయచ్చు. ఎవరికి వారు వారి భవనాల డెబ్రిస్ ను గుట్టు చప్పుడు కాకుండా ఎక్కడో అక్కడ పోసేయచ్చు

కాలనీల్లో ఎవడి ఇంటి ముందు వాడు, స్పీడు బ్రేకర్లు వేసుకోవచ్చు. వాటిని కొండల్లా అంత ఎత్తు వేసుకున్నా, వాటికి నిబంధనలకు అనుగుణంగా తెల్ల గీతలు గీయకున్నా చల్తా.

మీకు అర్జెంట్ అయతే రొడ్డు పక్కన ఎక్కడన్నా జిప్పు విప్పేయచ్చు..చెంబు పట్టకుని ఏ రోడ్డు పక్కనన్నా కూర్చునిపోవచ్చు.
ప్రభుత్వం రోడ్లు వెడల్పు చేస్తే,  ఆ వెడల్పు చేసిన మేరకు ఎవడి వ్యాపారాలకు వాడు ఆక్రమించేసుకోవచ్చు. లేదా వాహనాలను పార్క్ చేసేయచ్చు. మళ్లీ యథాశక్తి రోడ్లను ఇరుకుచేసేయచ్చు.

పది రూపాయిల కూల్ డ్రింకును థియేటర్లో నూట నలభై రూపాయిలకు యథేచ్ఛగా అమ్మేసుకోవచ్చు.

బాత్ రూమ్ కమోడ్ కు, సింక్ కు అమ్మాయి ఒంపు సొంపులకు ముడిపెట్టి ప్రచారం చేసుకోవచ్చు..ఎవ్వరూ ఏమిటిది అని అడగరు.
మద్యానికి ప్రకటనలు బ్యాన్ చేస్తే, వాటి బ్రాండ్ నేమ్ తో సోడాలు, గ్లాసులు, పర్సులు అడ్డం పెట్టకుని ప్రచారం సాగించుకోవచ్చు
ఒక పక్క తాగేందుకు నీళ్లు లేకుండా వుంటే, ప్రభుత్వాలు వేలాది అడుగుల లోతుకు బోర్లు వేసుకుని, నీటిని లాగేసుకుని అమ్మే వ్యాపారానికి లైసెన్సులిస్తాయి.

అయిదు లక్షల రూపాయిల లోపు ఏ నిర్మాణపు పనినైనా అర్హతలతో సంబంధం లేకుండా ప్రజా ప్రతినిధుల సిఫార్సుపై , టెండర్లు అవసరం లేకుండా నేరుగా కాంట్రాక్టులు ఇచ్చేయచ్చు. కావాలంటే పదిలక్షల పనిని రెండుముక్కలు చేసి, అయిదులక్షల పనే అని చూపించుకోవచ్చు.
సినిమాల్లో తిట్లు, బూతులు యధేచ్ఛగా వాడేసుకోవచ్చు..అమ్మాయిల్ని ఆట వస్తువులుగా చూపించేయచ్చు. అసలు అమ్మాయంటే 'అందుకోసం' తప్ప మరెందుకు కాదన్నంతగా దిగజార్చేయచ్చు.

ఎవడికి వాడు పత్రికలు, చానెళ్లు పెట్టేసుకోవచ్చు..తమకు నచ్చని వారిపై బుదర చల్లేసుకోవచ్చు..

ఈ జాబితా సంపూర్తి కాదు.. కింద కామెంట్ల రూపంలో మీకు తోచినన్ని రాయచ్చు..ఎందుకంటే మీకూ ఆ స్వాతంత్ర్యం వుంది.
మరిన్ని శీర్షికలు
Breast Tumors, Ayurveda Treatment | Prof. Dr. Murali Manohar Chirumamilla, M.D. (Ay)