Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
what brahmaanamdam says?

ఈ సంచికలో >> సినిమా >>

సినిమా వివాదాలు ఇకపై ఉండవా?

there will be no movie complecations ?

మనోభావాలు దెబ్బతీశారంటూ కొన్ని సినిమాల నిలిపివేత జరుగుతూ వస్తుండడం పట్ల సినిమా వారంతా ఆందోళన వ్యక్తం చేయడం నిత్యకృత్యమైంది. కమల్‌హాసన్‌ అంతటి వ్యక్తినే సినిమా వివాదాలు సినిమాపై విరక్తి వచ్చేలా చేశాయి. తెలుగు సినిమా కూడా కొన్నేళ్ళనుంచి చాలా వివాదాలు ఎదుర్కొంటోంది. వివాదాలు వస్తాయేమో అన్న బెంగతో సినిమా నిర్మాణం వదిలేసుకున్నారు కొందరు నిర్మాతలు. వారు తమ సినిమాలు వివాదాల్లో చిక్కుకుపోవడంవల్ల నష్టపోయినవారే.

కాని ఇక నుంచి సినిమాలకు వివాదాలు ఉండవకపోవచ్చు. హిందీలో ఆమిర్‌ఖాన్‌ హీరోగా నటిస్తున్న ‘పికె’ సినిమా పోస్టర్‌ వివాదంపై సుప్రీంకోర్టు సినిమా పరిశ్రమకు ఆనందకరమైన రీతిలో స్పందించింది. అదేమంటే సినిమా అనేది కళ, దానిపై వివాదాలు మంచిది కాదు అని సుప్రీంకోర్టు చెప్పింది. వివాదమేంటంటే ‘పికె’ సినిమా పోస్టర్లలో ఆమిర్‌ఖాన్‌ అర్దనగ్నంగా కన్పించాడు. దీనిని తప్పుపడుతూ ఓ న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

సుప్రీంకోర్టు ‘పికె’ సినిమాపై ఇచ్చిన తీర్పు దృష్ట్యా సినిమా పరిశ్రమకు వివాదాలు తగ్గుతాయని సినిమా జీవులంతా భావిస్తున్నారు. హాస్యం కోసమో, కొత్తదనం కోసమో సినిమాల్లో దర్శకులు తమ క్రియేటివిటీని ప్రదర్శించడం, అది వివాదంగా మారడం అనేది చూశాం. అది కళ అని సుప్రీం కోర్టు చెప్పినందువల్ల, అలాంటి విషయాలను వివాదాలు చేయాలనే ఆలోచనే ఎవరికీ రాకుండా ఉంటే సినిమాకి మంచిది.

మరిన్ని సినిమా కబుర్లు
Govindhudu movie deffinatly reach century