Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
interview with actor surya

ఈ సంచికలో >> సినిమా >>

సికిందర్: చిత్ర సమీక్ష

Sikandar telugu movie review

చిత్రం: సికిందర్
తారాగణం: సూర్య, సమంత, విద్యుత్ జమ్వాల్ , మనోజ్ బాజ్ పాయి, సూరి, బ్రహ్మానందం, దిలీప్ తాహిల్ , సత్యం, మురళి శర్మ, ఆసిఫ్ బాస్రా తదితరులు
ఛాయాగ్రహణం: సంతోష్ శివన్
సంగీతం: యువన్ శంకర్ రాజా
నిర్మాణం: తిరుపతి బ్రదర్స్ , రామలక్ష్మి క్రియేషన్స్
దర్శకత్వం: లింగు స్వామి
నిర్మాతలు: సిద్దార్ధ్ రాయ్ కపూర్ , సుభాష్ చంద్రబోస్ , లగగడపాటి శ్రీధర్
విడుదల తేదీ: 15 ఆగస్ట్ 2014

క్లుప్తంగా చెప్పాలంటే:
తన సోదరుడు రాజు భాయ్ (సూర్య)ని వెతుక్కుంటూ వైజాగ్ నుంచి ముంబైకి వెళతాడు కృష్ణ (సూర్య). అక్కడ కొందరు వ్యక్తుల్ని కృష్ణ కలుసుకుంటాడు. అలాగే రాజు స్నేహితుడు చందు (విద్యుత్ ), రాజు ప్రియురాలు (సమంత) గురించీ తెలుసుకుంటాడు కృష్ణ. మాఫియా డాన్ ఇమ్రాన్ భాయ్ కారణంగానే రాజు, రాజు భాయ్ గా మారతాడు. తన సోదరుడ్ని మాఫియా నుంచి కృష్ణ ఎలా బయటకు తీసుకొస్తాడు? అన్నది తెరపై చూడాలి.

మొత్తంగా చెప్పాలంటే:
నటుడిగా సూర్య మరోసారి తెరపై చెలరేగిపోయాడు. సమంత గ్లామరస్ గా, ఇంకా చెప్పాలంటే హాట్ హాట్ గా కనిపించింది తెరపై. విద్యుత్ జమ్వాల్ ఓకే. మనోజ్ బాజ్ పాయ్ పాత్ర ఆకట్టుకుంటుంది. బ్రహ్మానందం పాత్ర వృధా అయ్యింది. సూరి ఓకే. దిలిప్ తాహిల్ ఫర్వాలేదు. మురళి శర్మ కూడా అంతే. చిత్రాంగద సింగ్ ఓ పాటలో హాట్ అప్పీల్ పండిరచింది. మిగతా పాత్రధారులంతా తమ పాత్రలకు న్యాయం చేసేందుకు ప్రయత్నించారు.

రొటీన్ స్టోరీలైన్ అయినా, రిచ్ ప్రెజెంటేషన్ కారణంగా సినిమా ఆకట్టుకుంటుంది. డైలాగ్స్ బావున్నాయి. ఏం జరగబోతోందో ముందే తెలిసిపోతున్నా, స్క్రీన్ ప్లేతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు దర్శకుడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బావుంది. మూడు పాటలు తెరపై చూడ్డానికి చాలా బాగున్నాయి. ఎడిటింగ్ కొన్ని సన్నివేశాల్లో అవసరం అన్పిస్తుంది. కాస్ట్యూమ్స్ బావున్నాయి. ఆర్ట్ డిపార్ట్ మెంట్ సినిమా మూడ్ అవసరమైన విధంగా పనిచేసింది.

డబ్బింగ్ సినిమా అయినా కొన్ని సినిమాల్ని తెలుగు నేటివిటీకి దగ్గరగా వుండేలా చూసుకుంటున్నారు తమిళ దర్శక నిర్మాతలు. ఈ సినిమాలో అది కొంచెం మిస్ అయినట్లు అన్పిస్తుంది. కానీ, సినిమాని రిచ్ నెస్ తో తెరకెక్కించడం, నేటివిటీ మిస్సయ్యిందన్న ఫీలింగ్ ని అధిగమిస్తుంది. యాక్షన్ సన్నివేశాలు సినిమాకి ప్రధాన ఆకర్షణ. ఫస్టాఫ్ అంతా రొమాన్స్ , సెంటిమెంట్ , ఎంటర్ టైన్ మెంట్ తో నడిచిపోతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ బావుంది. సినిమాపై ఆసక్తిని పెంచింది. సెకెండాఫ్ యాక్షన్ తో నింపేశారు. యాక్షన్ సన్నివేశాల్ని ఇష్టపడే మాస్ ఆడియన్స్ కి కావాల్సినంత కంటెంట్ వుందీ సినిమాలో. క్లాస్ ఆడియన్స్ కి ఫర్వాలేదన్పించినా, మాస్ ఆడియన్స్ కి ఫుల్ ఫీస్ట్ అనుకోవచ్చు.బి, సి సెంటర్స్ ఆడియన్స్ ఈ సినిమాకి రాజపోషకులు. వారు సినిమాని ఆదరిస్తే సినిమా ప్రాఫిట్ జోన్ లోకి వెళుతుంది.

ఒక్క మాటలో చెప్పాలంటే:
మాస్ సికిందర్ .. క్లాస్ కి ఫర్వాలేదన్పిస్తాడు, మాస్ కి భళా అన్పిస్తాడు

అంకెల్లో చెప్పాలంటే: 3/5

మరిన్ని సినిమా కబుర్లు
cinechuraka