Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
maas raja power full expectations

ఈ సంచికలో >> సినిమా >>

Happy Vinayaka Chavithi

రవితేజ, కోన వెరీ వెరీ స్పెషల్‌

raviteja, kona very very special

స్టార్‌ రైటర్‌ కోన వెంకట్‌కీ, రవితేజకీ మంచి స్నేహం ఉంది. తన కెరీర్‌లో ఎక్కువ సినిమాలు రవితేజకే రాశానని, రవితేజతో ర్యాపో అలా కుదిరిందని అంటారు కోన వెంకట్‌. రవితేజ బాడీ లాంగ్వేజ్‌ డిఫరెంట్‌గా ఉంటుందనీ, అతని ఎనర్జీ అమోఘం అని కోన వెంకట్‌ ఇదివరకే చెప్పారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ‘పవర్‌’ కూడా రవితేజ ఎనర్జీతో, కోన వెంకట్‌ మార్క్‌తో ప్రేక్షకుల్ని అలరించనుందట.

‘పవర్‌’ గురించి కోన వెంకట్‌ మాట్లాడుతూ, రవితేజను దృష్టిలో పెట్టుకునే రచన ప్రారంభించానన్నారు. స్క్రీన్‌ మీద రవితేజ కన్పిస్తోంటే, అతని ఎనర్జీకి ప్రేక్షకులే కాదు తాను కూడా ఆశ్చర్యపోతున్నానంటారు కోన వెంకట్‌. ‘పవర్‌’ సినిమాకి ముందు కూడా రవితేజతో చాలా సినిమాలు చేసిన అనుభవం ఉండటంతో, సినిమా చాలా ఈజీగా చేసుకుపోయామని ఆయన చెప్పారు.

రవితేజ కెరీర్‌లోనే కాకుండా, తన కెరీర్‌లో కూడా ‘పవర్‌’ ఓ గొప్ప చిత్రంగా మిగులుతుందని, సినిమా చూసినవారు మంచి అనుభూతిని పొదుతారని కోన వెంకట్‌ అన్నారు. ఈ సినిమాతో రవితేజ, కోన వెంకట్‌ కాంబినేషన్‌ వెరీ స్పెషల్‌ అని అంతా తమను అభినందిస్తారని చెప్పారాయన.

మరిన్ని సినిమా కబుర్లు
save temple short  flim celebrations