Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
pawer satilite record

ఈ సంచికలో >> సినిమా >>

Happy Vinayaka Chavithi

‘అరుంధతి’ తర్వాత అనుష్కకి అవేనంట

three movies for anushka adter arumdhati

ఎన్ని సినిమాలు చేసినా, కమర్షియల్‌గా ఎంత పేరు వచ్చినప్పటికీ అనుష్క కెరీర్‌లో ‘అరుంధతి’ ఓ స్పెషల్‌ మూవీ. ఇన్నేళ్ళు అనుష్క కెరీర్‌ కొనసాగిందంటే, అది ‘అరుంధతి’ సినిమా ఇచ్చిన సక్సెస్‌ కిక్కే. ‘పంచాక్షరి’ వంటి సినిమాలు ‘అరుంధతి’ జోనర్‌లో అనుష్క చేసినా, వాటి వల్ల అనుష్కకేమీ కలిసొచ్చింది లేదు.

కాని అనుష్క ‘అరుంధతి’ తర్వాత అంత మానసిక సంతృప్తినిచ్చిన సినిమాగా ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ గురించి చెబుతుంది. రాజమౌళి దర్శకత్వం చేస్తున్న ‘బాహుబలి’లో ప్రభాస్‌, రాణా ప్రధాన పాత్రధారులు. వారితో సమానంగా సినిమాలో అనుష్క పాత్ర కూడా ఉంటుందట. గుణశేఖర్‌ దర్శకత్వంలో రానున్న ‘రుద్రమదేవి’లో అనుష్కే మెయిన్‌. కమర్షియల్‌ సినిమాలు చేసినప్పుడు సక్సెస్‌ వస్తే, హ్యాపీగా ఉంటుందిగానీ, ఇంకా ఏదో చెయ్యాలన్న ఆలోచన ఉండిపోతుందని చెప్పే అనుష్క, ‘అరుంధతి’ లాంటి సినిమాలు చేసినప్పుడు శాటిస్‌ఫాక్షన్‌ ఎక్కువ ఉంటుందని వివరించింది.

‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ దేనికదేనని అంటున్న అనుష్క, కెరీర్‌లో ఏది గొప్ప అనంటే ‘అరుంధతి’, ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ పోటీ పడ్తాయని చెప్పింది. ఈ రెండు సినిమాలూ అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్నాయి. చారిత్రక కథాంశాలే రెండు సినిమాలు కూడాను.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam