Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
3rd episode

ఈ సంచికలో >> సీరియల్స్

ఏజెంట్ ఏకాంబర్


జరిగిన కథ : ఏకాంబర్, నూకరత్నం ల సఖ్యతను ఎమ్మెల్యే మేడిపండు అబద్దాలరావు మెచ్చుకుంటాడు.  తనకు పాలసీలు కట్టవలిసిన అవసరం లేదని ఎమ్మెల్యే అనగానే, తన దగ్గర పని చేసే వాళ్ళతోనైనా పాలసీ కట్టించండి... అని అడుగుతుంది నూకరత్నం. .................................. ఆ తరువాత ...................................................... 

 
ఎక్కడికి వెళ్దాం? ఏకాంబర్ కళ్ళ్ల్లోకి చూస్తూ అంది నూకరత్నం.


ఇక్కడే వుందాం. అదిగో! అలా ఖాళీ మాత గుడి దగ్గరకెళ్ళి దర్శనం చేసుకుని అక్కడ నీడలో కూర్చుందాం. అన్నాడు ఏకాంబర్.

నాకు బాగా ఆనందం గా వుంది. ఆయన పాలసీ రాయిస్తే చాలనుకున్నాను. కానీ ఒక్కసారే ఇరవై మందంటే ఆశ్చర్యం గా వుంది అంది నూకరత్నం.

నాకు అలానే వుంది. టార్గెట్ రీచ్ అయిపోతాను. ప్రీమియం కూడా ఎక్కువే వస్తుంది. కానీ, పాలసీల సంఖ్య తక్కువనిపిస్తోంది సాలోచనగా అన్నాడు.

ఎన్ని తక్కువుంటాయి? అడిగింది నూకరత్నం.

ఈ ఇరవై కాక ఇంకో ముప్ఫై పైనే వుండాలి. అదే ఆలోచిస్తున్నాను నడుస్తూ అన్నాడు ఏకాంబర్.

ఓ ఐడియా చెప్పనా? వున్నట్టుండి అంది నూకరత్నం.

నూకరత్నం కేసి ప్రశ్నార్ధకం గా చూసాడు ఏకాంబర్.

వీళ్ళకే ఒక్కొకరికి రెండు పాలసీలుగా విడదీసి రాస్తేనో? ఆలోచిస్తూ అంది నూకరత్నం.

గుడ్ ఐడియా నూకరత్నం మాట వింటూనే ఎగిరి గంతేసాడు ఏకాంబర్.

ఎమ్మెల్యే గారు ఒప్పుకుంటారా? కుతూహల గా అడిగింది.

దానికి లక్ష మార్గాలున్నాయి. అది నేను మాట్లాడుతాను. డోంట్ వర్రీ. ఇంకో పది తక్కువ వస్తాయి చూద్దాం అన్నాడు ఏకాంబర్.

ఇద్దరు కాళీ మాతా మండపంలో పావుగంట పాటు కూర్చున్నారు. ఇద్దరికీ ఆనందం గానే వుంది. ఏకాంబర్ అయితే తన సమస్య ఇంత ఈజీగా పరిష్కారం అవుతుందని ఊహించనైనా లేదు.

ఇంతలో సడెన్ గా నూకరత్నం సెల్ మ్రోగింది. వ్యానిటీ బ్యాగ్ లో వున్న సెల్ రింగ్ వినిపించే సరికి గబుక్కున బ్యాగ్ జిప్ తీసి సెల్ తీసుకుంది.
ఎన్.ఎ.డి చిట్ మేనేజర్ కరీం లైన్ లో ఉన్నాడు.

సార్! చెప్పండి సెల్ చెవి దగ్గర పెట్టుకుంటూ అంది నూకరత్నం.

మేడం మీరు సాయంత్రం ఆఫీసుకు రాగలరా? అడిగాడు మేనేజర్.

వస్తాను సార్! పనేమన్నా వుందా? కుతూహలం గా అంది నూకరత్య్నం.

మొన్న జగదాంబ థియేటర్ రంగారావు గారిచ్చిన రిఫరెన్స్ లు పట్టుకుని వెళ్ళాం మేడం. మరో రెండు థియేటర్ వాళ్ళు ఒక షాపింగ్ మాల్ ఓనర్ గారూ ఓన్ క్రోర్ చిట్స్ కట్టడానికి ఇంట్రస్టింగ్ గా వున్నారు. మీరూ ఏకాంబర్ సారూ వస్తే సాయంత్రం వాళ్ళని కలిసి వద్దామని చెప్పాడు బ్రాంచి మేనేజర్ కరీం.

కరీం మాటలు వింటూనే ఆనంద డోలికల్లో తేలిపోయింది నూకరత్నం.

అలాగే సార్! తప్పక వస్తాము అంటూ కాల్ కట్ చేసి ఏకాంబర్ కేసి చూసింది నూకరత్నం.

అప్పటికే నూకరత్నం సంభాషణలను బట్టి ఎన్.ఏ.డి, బ్రాంచి కరీం తో మాట్లాడుతోందని గ్రహించాడు ఏకాంబర్. ఆమె మొహం లో తొణికిసలాడుతున్న ఆనందాన్ని గమణించి ఏదో శుభవార్త అని అనుకున్నాడు.

అంబర్! గుడ్ న్యూస్ మరో ముగ్గురు ఓన్ క్రోర్ చిట్స్ కట్టడానికి సుముఖం గా ఉన్నారట. మా బి.ఎం  చెప్తున్నారు. ఇదంతా నీ క్రెడిట్టే సంతోషం గా చేయి పట్టుకుని ముద్దు పెట్టుకుంటూ అంది నూకరత్నం.

నాదేముంది, దారి చూపించాను. దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది మీరు. అయినా మీ వాళ్ళు మంచి వాళ్ళే. వాళ్ళు కాళ్ళు అరిగేలా తిరిగి కస్టమర్లని మోటివేట్ చేసి ఆ క్రెడిట్ నీకు ఇస్తున్నారు. వాళ్ళని మెచ్చుకోవాలి చిన్న చిరు నవ్వు నవ్వుతూ అన్నాడు ఏకాంబర్.నిజమే అంబర్! నాకిప్పుడు  కరీం గారు ఫోన్ చేసి ఈ విషయం చెప్పకపోయినా నేనేమీ చేయలేను. ఆ చిట్స్ మూడు కమీషన్ కోసం ఆశపడి వేరే ఎవరి కోడ్ లో వేసినా నేనేం మాటలాడలేను. కానీ వాళ్ళు నిజాయితీగా నాతో ముందు అన్న మాటకే కట్టుబడ్డారు ఆనందం గా అంది.సాయంత్రం వేగం గా వెళ్ళు లేచి నిలబడుతూ అన్నాడు ఏకాంబర్.

ఏం తమరు రారా? మా బ్రాంచి మేనేజర్ గారైతే మిమ్మల్ని వెంటబెట్టుకు రమ్మన్నారు. మీ గోల్డెన్ లెగ్ పడితే గానీ సక్సెస్ కాదు స్థిరం గా అంది నూకరత్నం.

తప్పదంటావా? సాలోచనగా అన్నాడు ఏకాంబర్.

మీరు లేకుండా నేనొక్కదాన్ని ... అదీ సాయంత్రం  కదా! ఎలా వెళ్ళను? గోముగా ఏకాంబర్ కళ్ళ్ల్లోకి చూస్తూ అంది నూకరత్నం. పద, ముందు ఈ పని ముగిస్తే సాయంత్రానికి రెడీ కావచ్చు అంటూ గుడి మెట్లు దిగాడు ఏకాంబర్.

ప్రేమగా ఏకాంబర్ చేయిని రెండు చేతులతో  పట్టుకుని అతని మీద ఒదిగిపోతూ ముందుకు నడిచింది  నూకరత్నం.ఇద్దరూ తిరిగి ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్నారు.

ఎమ్మెల్యే గారికి ఇంటి ఆవరణ అంతా ఇప్పుడు ఖాళీగా వుంది. . ఎమ్మెల్యే గారి అనుచరులంతా ఒక దగ్గర గుమిగూడి బాతాఖాణీ కొడుతున్నారు.

ఇద్దరూ మౌనం గా పి.ఏ గదిలోకి వెళ్ళారు.

రండి! రండి! మీ కోసం ఇదిగో ఈ ఫైల్సన్నీ తీస్తున్నాను. అంటూ అతను ఏవో కాగితాలు చెక్ నడిచింది చేరుకుంటున్నాడు 

థేక్స్ సార్! మీ వాళ్ళందర్నీ పిలిపించండి సార్! నమ్రతగా అన్నాడు ఏకాంబర్.

అదిగో బయట వున్నారు. ఇద్దరు ముగ్గురు బయట వసూళ్ళకి వెళ్ళారు. ఫోన్ చేసాను పని ముగించుకుని వచ్చేస్తుంటారు అన్నాడు పీ.ఏ.అలాగే సార్! అన్నాడు ఏకాంబర్.

ఇద్దరూ పి.ఏ ఎదురుగా అతి వినయం గా నిలబడ్డారు.అయ్యో!... నిలబడి వుండిపోయారే! ఆ కుర్చీల్లో కూర్చోండి సార్... సార్... మనలో మన మాట . మా ఎమ్మెల్యే గారు నా పేర కూడా పాలసీ రాయిస్తున్నారా? ఆశగా అడిగాడు పి.ఏ.ఏమో సార్! మా వాళ్ళ ఇరవై మంది దాకా వుంటారు. వాళ్ళందరికి ఒక్కొకరికీ పది లక్షల రూపాయల పాలసీ రాయమని అన్నారు, అన్నాడు ఏకాంబర్.

ఇరవై మందా....!? అనుకుంటూ తన దగ్గరున్న పేపరులో వాళ్ళ తాలూకా జాబితా అంతా చూస్తూ మౌనం గా తన పని చేసుకోబోతున్నాడు

.పి.ఏ మొహం కేసి ఆతృతగా చూస్తున్న ఏకాంబర్ ఇక వుండబట్టలేక అడిగేసాడు.

సార్! ఇరవై మంది లేరా? అందులో మీ పేరు ఉంది కదా? కుతూహలం గా అడిగాడు ఏకాంబర్.

సార్ సెక్యూరిటీ టీం వాళ్ళే ఇరవై మంది వున్నారు. గన్మేన్. నేనూ లేము. పోనీలెండి! వాళ్ళం తా రోజూ రిస్క్ జాబ్ లో వుంటారు. మాదేముంది. సార్ వెనుకే వందిమాగదుల్లా తిరగడమే నవ్వేస్తూ అన్నాడు పి.ఏ.

సారీ సార్! అన్నాడు ఏకాంబర్.

మీరెందుకు సారీ చెప్తారు. సార్ కి తెలుసుకదా! ఎవరికి ఏదవసరమో నవ్వేస్తూ అన్నాడు పి.ఏ.

సార్! ఈ ఇరవై మందికి జీతం ఎంతుంటుందంటారు? మనసులోనే వాళ్ళు అందరూ పది లక్షల రూపాయల పాలసీ కట్టగల స్థోమత వున్నవాళ్ళేనా అన్న అనుమానం తో అడిగాడు ఏకాంబర్.జీతమా, పాడా? వుండడానికి ఇల్లు ఇచ్చారు. నెలా నెలా ఇంటి బత్యం పంపిస్తారు. వీళ్ళకిక్కడ మస్తుగా మందు విందు వుంటాయి. అప్పుడప్పుడు ఇంటి అవసరాలకి అవసరమైతే పదో పరకో ఇక్కడ నా దగ్గర ఖాతా లో వాడుకుంటారు.

అదీ ఒక్కొకడికీ వెయ్యి రూపాయలు దాటితే ఇక ఆ నెల వాడకం బంద్ చెప్పాడు పి.ఏ. అదెలా రాత్రి పగలూ ఇక్కడ వుంటారు కదా కనీసం ఎంటొ కొంత జీతం ఇస్తున్నారేమో అన్నుకున్నాను అన్నాడు ఏకాంబర్.

వీళ్ళకెవరిస్తారండీ పని. చదువు సంధ్యల్లేని పోరంబోకులు పనీ పాటాలేని పైలా పచ్చీసులు. ఎమ్మెల్యే గారు ఏదో జాలిపడి చిన్నప్పటినుంచీ వీళ్ళని మేపుతున్నారు. పెళ్ళిళ్ళు చేసారు. ఇళ్ళు, వాకిలీ ఇచ్చారు. ఇంకా వాళ్ళకి జీతాలెందుకండీ బాబూ! ఎమ్మెల్యే గారిలానే వీళ్ళది రాజయోగం, నిలబడ్డం...కలబడ్డం... ఎదురొచ్చిన వాళ్ళని కుళ్ళబొడవడం. ఇదే వీళ్ళ పని. ఎమ్మెల్యే గార్ని కంటికి రెప్పలా  కాపాడడమే వీళ్ళ
పని అన్నాడు పి.ఏ

అందరూ రాత్రి పగలూ ఇక్కడే వుంటారా?! ఆశ్చర్యం గా అడిగాడు ఏకాంబర్.

అవసరమైతే వుంటారు. లేదంటే కొందరు పగలు, కొందరు రాత్రి పనిని పంచుకుంటారు. అన్నాడు పి.ఏ.సార్! మీరేమీ అనుకోనంటే చిన్న ప్రశ్న? లోలోన భయం గా ఆందోళనగా అన్నాడు ఏకాంబర్.

అడగండి సార్! ఇందులో అనుకోవడానికి ఏముంటుంది నవ్వుతూ అన్నాడాయన.

ఎమ్మెల్యే గారు వీళ్ళందరిజ్కీఎ అంత పెద్ద పాలసీలు రాయమంటె ఎలా సార్? దానికి డబ్బు వీళ్ళు ఎలా కట్టగలరు? ఆతృతగా అడిగాడు.ఓస్ అదా మీ అనుమానం? అందుకేగా మీకోసం ఈ ఫైల్స్ తీస్తున్నది ఇదిగోనండి. ఇవి వాళ్ళందరి ఇంకంటాక్స్ రిటర్న్లు ఇవి వాళ్ళ పేర వున్న బస్సులు, క్రేన్ లు వగైరా అంటూ రెండు ఫైల్స్ ఏకాంబర్ చేతికి అందించాడు పి.ఏ.

ఆ ఫైల్స్ రెండూ చూస్తూ ఆశ్చర్యం గా నోరు వెళ్ళబేట్టేసాడు ఏకాంబర్. ఒకో వ్యక్తికి నెలకి రెండు లక్షల వరకూ ఆదాయం వస్తుంది. దానికి ఇంకంటాక్స్ కూడా కడుతున్నారు. అంతా వాస్తవ ఆదాయమే.

ఆ ఇరవై మంది బ్యాంకు పాస్ బుక్స్ కూడా ఏకాంబర్ చేతికి ఇచ్చి చూడమన్నాడు పి.ఏ.

ఇవి చాలు కదా! పాన్ కార్డులు, బ్యాంకు పాస్ బుక్కులు, వీళ్ళందరి ఆధార్ కార్డుల జిరాక్స్లు ఇస్తే చాలు కదా! అడిగాడు పి.ఏ.

చాలు సార్ చాలు. వీళ్ళకి వ్యక్తిగతం గా ఇంతంత ఆదాయం వుందంటే పది లక్షలేమిటీ పాతిక లక్షలైనా పాలసీ రాయొచ్చు ఆనందం గా అన్నాడు ఏకాంబర్.

మీకు కావలిసిన  వన్నీ ఒక పేపరుపై రాసి ఇవ్వండి సర్! అవన్నీ ప్రక్కనే జిరాక్స్ సెంటర్ లో జిరాక్స్ చేయిద్దాం అన్నాడు పి.ఏ.సార్ ఈ ధరఖాస్తు ఫారాలన్నింటి మీద వాళ్ళ సంతకాలు కావాలి. ఒక్కొక్కర్నే లోపలకు పిలవండి సార్. నేను వాళ్ళ వివరాలు రాసుకుని సతకాలు తీసుకుంటాను. చెప్పాడు ఏకాంబర్.

ఏకాంబర్ అలా అనడం తరువాయి పి.ఏ కేకతో బిలబిలమంటూ వచ్చి వరుసలో నిలబడ్డారు.

ఎందుకు? ఏమిటీ? అని ప్రశ్నించకుండా ఏకాంబర్ సంతకాలు పెట్టమన్న దగ్గరల్లా సంతకాలు పెట్టి కొద్ది దూరం గా జరిగి నిలబడ్డారు.అందరివీ సంతకాలు అయ్యాయికదా! ఇక మీరు వెళ్ళిరండిరా వాళ్ళతో అన్నాడు పి.ఏ.

అయ్యా! సంతకాలు తీసుకున్నారు. మరి మా గొంతు తడపరా! అందరిలో ఎత్తుగా, లావుగా వున్నవాడు ఒకడు తన గుబురు మీసాలు మెలేస్తూ వినయం గా అన్నాడు.

ఒరేయ్ నాయనలారా! ఈ సంతకాలు మీ కోసమే తీసుకున్నారు. మీ పేర ఒక్కొక్కరికి మన ఎమ్మెల్యే గారు పది లక్షల రూపాయలు పాలసీ కడుతున్నారు. దీనికి లంచం కావాలా? నవ్వుతూ అన్నాడు పి.ఏ.

అదేంటీ పి.ఏ గారు మీరే మర్చిపోయారు. అయ్యగారు ఎప్పుడూ సంతకాలు తీసుకున్నామా అందరికీ ముందుకు పైకం ఇస్తూనే వుండేవారుకదా! మర్చిపోయారా? మళ్ళీ అతడేఅన్నాడు.

ఇంతలో మేడిపండు అబద్దాలరావు లోపలనుండి వస్తూ ఆ మాటలు విన్నాడు.

పి.ఏ ఇచ్చెయ్యవయ్యా మనిషికో వంద ఇచ్చెయ్ వస్తూనే అన్నాడు ఎమ్మెల్యే.

మరిక పి.ఏ మారు మాట్లాడకుండా తలో వంద రూపాయలు ఇచ్చి సంతకాలు తీసుకున్నారు.

సార్! పదహారుమందే వచ్చారు. మిగతా నలుగురు రావాలి తను నింపిన దరఖాస్తులు లెక్కేస్తూ అన్నాడు.ఏకాంబర్.

ఇద్దరు మార్కెట్టుకు వెళ్ళారు. వచ్చేస్తారు. మరో ఇద్దరు ఒంట్లో బాగోలేక ఇళ్ళదగ్గరే వుండిపోయారు ఎలా? అడిగాడు పి.ఏ.

వాళ్ళిద్దరూ బజార్లోకి ఎందుకు వెళ్ళారు? పి.ఏని అడిగాడు ఎమ్మెల్యే.

ఏదో ఆటోలో గొడవ సార్! ఎవడో ఆటోవాడు ఫోన్ చేస్తే వాళ్ళిద్దరూ పరిగెత్తుకెళ్ళారు. అని పి.ఏ ని పిలిచి చెప్తుండగానే ఎమ్మెల్యే ఇంటి ఆవరణలోకి రెండు ఆటోలు రివ్వున దూసుకువచ్చాయి.

ఆటోలు ఆవరణలోకి రావడంతోనే ఎమ్మెల్యే మేడిపండు అబద్దాలరవు గారు పి.ఏ దగ్గరనుండి బయట పోర్టికోలోకి చూసారు.

ఆటోల్లోనుండి ద్రైవర్లను వారిద్దరి మెడలమీద చేతులు వేసి కాలర్ పట్టుకుని ఇద్దరు ధృడకాయులు బలవంతం గా ఆటోల్లోనుండి లాకు వచ్చారు.

ఆటోలు రెండు ఎమ్మెల్యే గారి ఇంటి ఆవరణలోకి రావడంతోనే అక్కడే వున్న ఎమ్మెల్యే గారి కాపలాదారులందరూ ఆ ఆటోల చుట్టూ వలయంలా చుట్టుముట్టేసారు.

వృత్తాకారం లో నిలబడి సిద్దంగా వున్న వీధి గూండాల్లా పిడికిలి బిగించి మధ్యలో ముద్దాయిలా వున్న ఆటో ద్రైవర్ల చుట్టూ చుర చుర చూస్తూ ఉన్నారు.

మధ్యలో ఆటో డ్రైవర్లను మెడలు వంచి లాక్కొచ్చిన ఎమ్మెల్యే మనుషులిద్దరూ ఆ ఇద్దరు డ్రైవర్లను కాళ్ళ మీద పడేల గట్టిగా తోసేసారు.ఎత్తుగా లావుగా ఎనుబోతుల్లా వున్న ఎమ్మెల్యే గారి మనుషుల చేతుల్లో గిలగిలలాడుతున్న ఆటో డ్రైవర్లు ఇద్దరూ వాళ్ళు అలా గట్టిగా నెట్టేసరికి అమాంతం వెళ్ళి ఎమ్మెల్యే కాళ్ళమీద పడిపోయారు.

ఏమైందిరా ఏంది ఈ గోల కోపంగా ఎమ్మెల్యే అడిగాడు.ఈల్లిద్దరూ ఈ ఆటోల్ని అమేస్తున్నారయ్యా! మాకా విషయం తెలిసి ఆర్టీవో ఆఫీసు దగ్గరకెళ్ళి పట్టుకొచ్చాం ఆ ఇద్దరిలో ఒకడన్నాడు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
1st episode