Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
North beauty in telugu look...

ఈ సంచికలో >> సినిమా >>

అక్కినేని వారసుడి కాన్ఫిడెన్స్‌ సూపర్బ్‌

most confident akhil

అక్కినేని కుటుంబం నుంచి మరో నటుడు హీరోగా తెరంగేట్రానికి రెడీ అయ్యాడు. అతనే అక్కినేని అఖిల్‌. ఏడాది వయసు కూడా నిండకుండానే వెండితెరపై కనిపించి, ‘సిసింద్రీ’గా సత్తా చాటుకున్న అఖిల్‌, ‘మనం’ సినిమాలో కాస్సేపు కనిపించి అక్కినేని అభిమానులకు కనువిందు చేశాడు. ‘మనం’ సినిమా మంచి విజయం సాధించగా, అక్కినేని మరణానంతరం ఆయన జయంతి రోజున సినిమా వేడుక నిర్వహించారు. ఆ వేడుకలో అక్కినేని అఖిల్‌ చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడాడు.

అక్కినేని కుటుంబమంటేనే స్టైల్‌. సీనియర్‌ అక్కినేని నుంచి, ఆయన కుమారుడు నాగార్జున, నాగార్జున తనయుడు నాగచైతన్య స్టైల్‌కి కేరాఫ్‌ అడ్రస్‌గా గుర్తింపును పొందారు. వారి బాటలోనే స్టైలిష్‌ బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకున్నాడు అఖిల్‌. హీరోగా నా తెరంగేట్రం అలా ఇలా కాదు, అద్భుతంగా వుండాలనే టైమ్‌ తీసుకుంటున్నానని అఖిల్‌ చెప్పిన మాటలు అభిమానులకు చాలా ఉత్సాహాన్నిచ్చాయి.

సహజంగా కొత్త హీరోలు ఎంతో కాన్ఫిడెంట్‌గా వున్నా ఎక్కువ మాటలు చెప్పరు. ఒకవేళ చెప్పారంటే, వారికి తమ కెరీర్‌పై పూర్తి అవగాహన వున్నట్టే. సినిమాపై పూర్తి కమాండ్‌ సాధించాకనే రంగంలోకి దిగుతున్న అక్కినేని అఖిల్‌, అక్కినేని అభిమానులకు పూర్తి విందు భోజనం లాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఆశిద్దాం.

మరిన్ని సినిమా కబుర్లు
bollywood grand welcome to anushka.....