Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
bollywood grand welcome to anushka.....

ఈ సంచికలో >> సినిమా >>

"శివ" మీద నా డాక్యుమెంటరీ

my documentary on shiva
అంతరిక్షంలో ఏ విస్ఫోటనం జరిగి ఈ విశ్వం పుట్టిందో తెలియదు కానీ, తెలుగు వెండితెర మీద "శివ"  అనే విస్ఫోటనం ఒక కొత్త ఇండస్ట్రీని పుట్టించింధి...ఇది జరిగి ఇప్పటికి సరిగ్గా పాతికేళ్లయ్యింది. ఆ విస్ఫోటనం నుంచి విభిన్న ప్రత్యేకతలు గల దర్శకులు,నటీ నటులు, సాంకేతిక నిపుణులు పుట్టుకొచ్చారు. ఆ విస్ఫోటనానికి గురైన ఎందరో ప్రేక్షకులలో వున్న యువకులు దర్శకులయ్యి నేడు దార్శనికుల స్థాయిలో ఉన్నారు. ఇంకా ఆ పేలుడు శకలాలు ఎందరికో తగులుతూనే ఉన్నాయి. ఎందరిలాగానో నేను కూడా ఒక ప్రేక్షకుడిగా ఆ పేలుడు బారిన పడ్డవాణ్ణే.

తెలుగు చిత్ర పరిశ్రమని "శివ కి ముందు- శివ కి తర్వాత" అని క్లాసిఫై చేసేంత స్థాయిని అందుకున్న క్లాసిక్ గా నిలిచింది "శివ". అందుకే "శివ- శోధన ,పాతికేళ్ల తర్వాత" (Exploring Shiva After 25 Years)అనే ఒక డాక్యుమెంటరీని చెయ్యడానికి సంకల్పించాను. "శివ" విడుదలైనప్పటికి నాకు 10-11 ఏళ్లు. ఇప్పటికి అనేక సార్లు ఆ సినిమా చూసాను. చూసిన ప్రతిసారి మారుతున్న నా పరిపక్వత కారణంగానో, పరిజ్ఞానం మూలానో ఒక్కో సారి ఒక్కో స్థాయిలో ఆ సినిమా ఒకో విశ్వరూపంలా కనిపిస్తోంది. అవన్నీ ఇక్కడ ప్రస్తావించకుండా, ఎక్కడా నా సొంత అభిప్రాయాలకు, విశ్లేషణలకు చోటు ఇవ్వకుండా, "శివ" తీయడానికి వెనుక జరిగిన విషయాలను డాక్యుమెంట్ చేయడం మాత్రమే ఈ డాక్యుమెంటరీ లక్ష్యంగా పెట్టుకున్నాను. శివ వెనకాల వున్న లోతైన ఆలోచనలని డాక్యుమెంట్ చేయడంలో పూర్తిగా న్యాయం చేయలేనని తెలిసినా సాధ్యమైనంత చేయాలనే ఉద్దేశ్యంతో మొదలుపెట్టి పూర్తిచేస్తున్నాను.

దీంట్లో నాకు సహకరించిన వారు కెమెరామ్యాన్ సంగీత్ కోనాల, ఎడిటర్ సంగా ప్రతాప్ కుమార్ మరియు కాన్సెప్ట్ డిజైనర్ వేణు దేవినీడి. అక్టోబర్ 5 1989 న "శివ" విడుదల అయ్యింది కనుక ఆక్టొబర్ 5 2014 న శివ 25 వ వార్షికోత్సవం సందర్భంగా ఈ డాక్యుమెంటరీని అక్కినేని నాగార్జున, రాం గోపాల్ వర్మ మరియు అప్పుడు ఆ సినిమాకి పని చేసిన ఇతర నటీ నటులు, సాంకేతిక నిపుణుల సమక్షంలో మీడియా ముందు విడుదల చేయబోతున్నాను.

-సిరాశ్రీ 
మరిన్ని సినిమా కబుర్లు
vidka bottle at godavari