Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

Happy Dasara

ఏజెంట్ ఏకాంబర్

జరిగిన కథ : కూతురి పెళ్ళికి పెద్దకొడుకు నీలాంబర్ నుండి సాయం అందుతుందని ఆశిస్తున్న పీతాంబర్, పర్వతాలుకు, నీలాంబరే హఠాతుగా పెట్టే బేడా సర్దుకుని వచ్చేసి, ఉద్యోగం ఊడిందని చెప్పడంతో హతాశులవుతారు. ముగ్గురూ కల్సి అతనిని ఓదార్చి, ఏదైనా చేసి బ్రతకొచ్చని ధైర్యం చెబుతారు. తానే ఏదోక దారి చూపిస్తానని ఏకాంబరే భరోసా కూడా ఇస్తాడు.

...................................

నువ్వు నాన్నతో బయలుదేరి గోపాలపట్నం మన ఆఫీసు దగ్గరకు వచ్చేయ్. నేను పదో గంటకి ఆఫీసుకు వస్తాను. అక్కడ మాట్లాడుదాం. " అంటూ హాల్లోనుండి వరండాలోకి వచ్చాడు ఏకాంబర్.

" అలాగే ! " అంటూనే బాత్ రూం కేసి నడిచాడు నీలాంబర్.

ఇంతలో పెట్లో అంట్లు తోముతున్న పర్వతాలు కెవ్వున కేకేసుకుంటూ  ఇంట్లోకి పరిగెత్తుకొచ్చింది.
పర్వతాలు కెవ్వున కేల వేస్తూ పరుగుపరుగున ఇంట్లోకి వస్తూ గుమ్మం తన్నుకుని పడబోతున్న తల్లిని బాత్రూం కేసి వెళ్తున్న నీలాంబర్ చటుక్కున వెళ్ళి పడిపోకుండా ఒడిసి పట్టుకున్నాడు.
వరండాలో ఉన్న పీతాంబరం, ఏకాంబర్ ఇద్దరూ పర్వతాలు కేక వింటూనే గాభరాగా హాల్లోకి వచ్చారు. గదిలో ఆదమరచి నిద్రపోతున్న అలివేలుమంగ కూడా పర్వతాలు గావుకేక విని ఉలిక్కిపడి మంచం మీద నుండి లేచి హాల్లోకి వచ్చింది.

హాల్లోకి వచ్చి ఆయాసంతో నిలబడ్డ పర్వతాల్ని ఒడిసి పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టాడు నీలాంబర్.

" ఏమైందమ్మా ? ఎందుకలా అరిచావు ? " ఆతృతగా అడిగాడు ఏకాంబర్.

" ఏమైంది పర్వతం ? ఎందుకలా భయపడిపోయావ్ ? " ఆందోళనగా భార్య ప్రక్కనే కూర్చుంటూ అడిగాడు పీతాంబరం.

" ఏమైందమ్మా ? " అంటూ అలివేలుమంగ, నీలాంబర తల్లి ప్రక్కనే నిలబడ్డారు.

" పెరట్లో...పెరట్లో..కంచె అవతల ..." కంగారుగా అంది పర్వతాలు.

" ఏమైందమ్మా ? " అడిగాడు నీలాంబర్.

" పాము...పాము.." భయంతో, ఆయాసంతో చెప్పలేకపోతోంది పర్వతాలు.

" పాము కనిపించింది! అంతేనా ? " రోజూ చూస్తున్న పామే కదా అన్నట్టు అన్నాడు పీతాంబరం.

" కాదు..కాదు..పాము..పాము రెండు ముక్కలు అయి పడి ఉంది " ఆందోళనగా అంది పర్వతాలు.

" పాము చచ్చిపోయింది కదా , మరిక భయమెందుకు? చూద్దాం రండిరా ! " అంటూ పెరట్లోకి ఇద్దరు కొడుకుల్ని తీసుకుని వెళ్ళాడు పీతాంబరం.

వాళ్ళ వెనకే అలివేలు మంగ, ఆ వెనకే పర్వతాలు ఉండబట్టలేక వెళ్ళారు.

పెరట్లో కంచెకి దగ్గర్లోనే పాము శరీరం భాగాలుగా తెగి పడి ఉంది. మధ్యలో ఒక భాగం లేదనిపించింది పీతాంబరానికి.

" పాముని ఇలా ఎవరు నరికి ఉంటారు నాన్నా? " కుతూహలంగా అడిగాడు నీలాంబర్.

" ఎవరూ నరికి చంపలేదురా ! ముంగిస ఇక్కడెక్కడో తిరుగుతోంది అడె పాముని చంపి మూడు భాగాలుగా చేసి మధ్య భాగం తినేసి
పోతుందని అంటారు. బహ్శ, ఇది ముంగిస పనే అయి ఉంటుంది. " ఆలోచిస్తూ అన్నాడు పీతాంబరం.

" పోనీలే నాన్నా ! పెరట్లో పాము భయం పోయింది కదా ! లేకపోతే రోజూ భయంతో ఝడుస్తూ పెరట్లో తిరిగేవాళ్ళం." అన్నాడు ఏకాంబర్." ఏమో! ఇలాంటి పాములు ఎన్ని ఉన్నాయో మనకేం తెలుస్తుందిరా ! అయినా, ఎంత వేగంగా ఇల్లు ఖాళీ చేస్తే అంత మంచిది " భయం భయంగా అంది పర్వతాలు.

" సరి సరి. బయట మున్సిపాలిటీ వాళ్ళుంటే దీన్ని తీసి పారెయ్యమని చెప్పాలి..పదండి పదండి..." అంటూ పీతాంబర్ తిరిగి హాల్లోకి వచ్చేసాడు.

తండ్రి వెనకే కొడుకులిద్దరు, కూతురు అనుసరించారు. పర్వతాలు షాక్ నుండి తేరుకోలేకపోయింది. వంటగదిళొకి వెళ్ళి నిలబడిందేగానీ చచ్చిన పామే కళ్ళల్లో కదలాడుతోంది.

అన్న నీలాంబరాన్ని ఆఫీసుకి రమ్మని ఏకాంబర్  ఇంట్లో నుండి బయటకు వచ్చి బైక్ మీద కూర్చుని స్టార్ట్ చేశాడు.పదవుతుండగా గోపాలపట్నం ఫ్రాంచైజీ ఆఫీసులో అడుగుపెట్టాడు ఏకాంబర్. ఉదయం పాము గొడవలో పడి ఆలస్యంగా వూరుమీద పడడం వలన కస్టమర్లందరూ  అప్పటికే ఆఫీసులకీ, పనులమీద ఇంటినుండి వెళ్ళిపోయారు. అలవాటు ప్రకారం రాత్రి రాసుకున్న జాబితాలో ఉన్న వాళ్ళందరి ఇళ్ళకూ వెళ్ళాడు. కస్టమర్ల ఇళ్ళ దగ్గర " వచ్చానని " హాజరు వేయించుకుని వచ్చేసాడే గానీ పని కాలేదు.చిరాగ్గా ఫ్రాంచైజీ ఆఫీసుకు వచ్చాడు. ' ఒక రోజు తిరుగుడు దండగైందని మనసులోనే నొచ్చుకున్నాడు. ఇంట్లో అన్న నీలాంబర్ తో మాట్లాడుతూ సగం కాలం వృధా అయితే, పెరట్లో పాడు పాము చావు సగం కాలం తినేసింది ' ఆలోచిస్తూ తన కేబిన్ లోకి వెళ్ళి కూర్చున్నాడు ఏకాంబర్.

ఇంతలో నూకరత్నం స్వీటు పాకెట్  పట్టుకుని ఏకాంబర్ చాంబర్ లోకి అడుగు పెట్టింది.

" హేపీ న్యూస్ అంబర్ గారూ ! " అంటూ స్వీటు పెట్టె తెరిచి స్వీటు తీసుకోవలసిందిగా కళ్ళతోనే అభ్యర్థిస్తూ స్వీటు పెట్టె ఏకాంబర్ ముందుంచింది నూకరత్నం.

" ఏంటో ?! " పరాకు నుండి తేరుకుంటూ అన్నాడు ఏకాంబర్.

" మీ దయ వలన శ్రీరాం చిట్స్ లో పది క్లోట్ల రూపాయల చిట్స్ ఇచ్చాను. ఈ మూడు నెలలు పోటీలో నేనే స్టేట్ టాపర్ నయ్యానట. నిన్న రాత్రే బ్రాంచి మేనేజర్ కరీం గారు ఫోన్ చేసారు. " సంతోషంగా చెప్పింది నూకరత్నం.

" కంగ్రాట్స్..! దీనితో సరిపెట్టేద్దామన? " న్వ్వుతూ అడిగాడు.

" ఏం కావాలో చెప్పండి ! ఇదంతా మీ చలవే కదా ! లేకపోతే నా మొహానికి ఇంత పెద్ద మొత్తంలో చిట్స్ చెయ్యగల  సత్త ఉందా ? " అంది.నువ్వూ, నేనూ ఇలా ఉన్నామంటే మన గాడ్ ఫాదర్ బాబా ! ఆయనే మన ఇద్దర్నీ నడిపిస్తున్నారు. " అన్నాడు ఏకాంబర్." నిజమేనండీ ! " ఆనందంగా అంది నూక రత్నం.

" ఈ స్వీట్లు మన ఆఫీసులో ఉన్నవాళ్ళందరికీ పంచారా ? " అడిగాడు ఏకాంబర్." ముందు మీకు చెప్పకుండా తమరితో నా సంతోషం పంచుకోకుండా ..మిగతా వాళ్ళతో ఎలా పంచుకుంటాను? రాత్రయితే తమకు వెంటనే మీకు ఫోన్ చేద్దామనుకున్నాను. కానీ , స్వయంగా చెప్పి మీ కళ్ళల్లో కదిలే ఆనందాన్ని చూడాలనిపించి ఫోన్ చెయ్యలేదు. " చిలిపిగా ఏకాంబర్ కళ్ళల్లోకి చూస్తూ అంది నూకరత్నం.

" సరిసరి! ముందు వాళ్ళందరికీ చెప్పి సంతోషం షేర్ చేసుకో! వాళ్ళకి నువ్వు ఇన్స్పిరేషన్ కావాలి ఆలస్యమైతే ఫీల్డ్ మీదకు బయలుదేరతారు. " అంటూ తన బ్యాగ్ తెరచి కస్టమర్ల ఫైల్స్ తీసాడు ఏకాంబర్.

" వస్తానుండండి " అంటూ గదిలో నుండి బయటకు రాబోయింది నూకరత్నం.

" రత్నం ! ఈ ఫైల్స్ చెక్ చేస్తే ఇన్స్యూరెన్స్ ఆఫీస్ లో ఇచ్చేద్దాం. ఇవన్నీ 'పాలసీ' లోన్ ఫైల్స్. అడుగున రెండు హౌసింగ్ ఫైనాన్స్ ఫఒల్స్ కూడా ఉన్నాయి చూడండి " అంటూ ఫైల్స్ నూక రత్నానికి అందించాడు ఏకాంబర్.

ఏకాంబర్ ఇచ్చిన ఫైల్ తీసుకుని మరో చేత్తో స్వీట్ బాక్స్ పట్టుకుని బయటకు వచ్చింది నూకరత్నం.

నూకరత్నం వెనుదిరిగి వెళ్ళిపోతుంటే చూస్తూ కూర్చున్న ఏకాంబర్ సీట్లో నుండి లేచి ఆమె వెనకే గదిబయటకు వచ్చాడు." నేనూ వస్తాను. వాళ్ళందిరికీ థేంక్స్ చెప్పాలి." నూకరత్నం వెనుకే నడుస్తూ ఆమెతో చెప్పాడు ఏకాంబర్.

" రండి, ఇద్దరం కలిసి వాళ్ళకి స్వీట్లు ఇచ్చి మన ఆనందాన్ని అందరికీ పంచుదాం." సంబరంగా అంది నూకరత్నం.బాస్ లిద్దరూ కూడబలుక్కున్నట్టు కలిసి కట్టుగా  తమ దగ్గరికే రావడం చూసి కలక్షన్ కు బయలుదేరుతున్న యువతీయువకులు ఆశ్చర్యంగా చూస్తూండిపోయారు.

ప్రాంచైజీ ప్రారంభం నుండీ చూస్తున్నారు. ఇంత చనువుగా ఎప్పుడూ తమకి కనిపించలేదు. తామంతా కలక్షన్స్ కి బయలుదేరేముందు ఏకాంబర్ సార్ వస్తూనే చాంబర్ లోకి వెళ్ళిపోవడం గమనించేవారు. సాయంత్రం ఎప్పుడో గానీ కనిపించేవారే కాదు. ఏకాంబర్ సార్, నూకరత్నం మేడం మంచి ఫ్రెండ్స్ అని మాత్రమే తెలుసు. కానీ, వాళ్ళని ఇంత చనువుగా, జోడీగా కలిసి ఉండడం గానీ, రావడం గానీ ఎవరూ చూడలేదు. ' అందరి మన్సుల్లోనూ అదే భావన.

" డియర్ ఫ్రెండ్ర్స్! మీకో గుడ్ న్యూస్ మీ మేడం నూకరత్నం గారు శ్రీరాం చిట్స్ లో సాధించిన ఘనత ఏంటో చెప్పమంటారా? హుషారుగా అన్నాడు ఏకాంబర్.

అందరూ బ్యాగ్ లు తగిలించుకుని ఫీల్డ్ మీదకు బయలుదేఅడానికి సిద్ధంగా ఉన్నారు. అందరి ముందు నిలబడి మైకులో ప్రసంగించినట్టే నటిస్తూ చెప్పాడు ఏకాంబర్.

ఏకాంబర్ చేసిన ప్రకటన్ విని అందరూ ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ 'చెప్పండి సార్! చెప్పండి!" అంటూ ఏక కంఠంతో అరిచారు." ముందు మీరంతా మేడం స్వయంగా ఇస్తున్న స్వీట్లు తలా ఒకటి తీసుకోండి ! " రెండో చేత్తో స్వీటు తీసుకోవాలనుకునేవారు సిగ్గు పదకుండా తీసుకోండి. " నవ్వుతూ అన్నాడు ఏకాంబర్.

ఏకాంబర్ చెపుతూండగానే స్వీటు బాక్స్ పట్టుకెళ్ళి తీసుకోమని ఒక్కొక్కరి ముందూ ఉంచింది. అందరూ ఆ బాక్స్ లో తలా ఒకటీ తీసుకున్నారు. స్వీటు తీసుకుని తింటూనే " కంగ్రాట్స్ మేడం " అంటూ అభినందించారు.

" విషయం వినకుండానే మేడం ని అభినందించారు. స్వీట్లు కూడా తినేసారు. ఇక విషయం మీకిప్పుడు చెప్పినా చప్పగానే ఉంటుంది కదా, అయితే మానేస్తాను." టక్కున అన్నాడు ఏకాంబర్.

ఏకాంబర్ చేస్తున్న చమత్కార ప్రసంగానికి మౌనంగానే అటూ ఇటూ తిరుగుతూ మనసులోనే ముసిముసిగా నవ్వుకుంటోంది నూకరత్నం. ఇంతలో వాచ్ మెన్ భార్య పద్మ టీ తయారు చేసి ఫ్లాస్కులో పోసి పట్టుకువచ్చింది. నేరుగా కిచెన్ లో కి వెళ్ళి అందరికీ కప్పుల్లో పోసి ట్రే లో పట్టుకు వచ్చింది.

" పద్మక్కా ! నువ్వు ముందీ స్వీటు తిను " అంటూ స్వీటు బాక్స్ లో స్వీటు తీసి పద్మ నోట్లో పెట్టింది నూకరత్నం. " అయ్యో ఎలా అమ్మా ! " అంటూ పెదవులు కదిపి మాట్లాడేసరికి స్వీటు కింద పడిపోయింది.

రెండు చేతుల్తో ట్రే లో టీ పట్టుకున్న పద్మ నొచ్చుకుంటూ అంది " రత్నం తల్లీ చూసావా అనవసరంగా స్వీటు నేలపాలయ్యింది. "" పోనీలే అక్కా ! ఇందులో ఇంకా చాలా ఉన్నాయి. ఇవి పట్టుకు వెళ్ళి పిల్లలకి ఇవ్వు. ఆ ట్రే నాకివ్వు. " అంటూ పద్మ చేతిలో టీ ట్రే తీసుకుని మిగిలిన స్వీట్స్ తో ఉన్న అట్టపెట్టె ఆమె చేతికి ఇచ్చింది నూక రత్నం.

" నేనందరికీ ఇస్తా కదమ్మా ! మీకెందుకు శ్రమ " నొచ్చుకుంటూ అంది పద్మ.

"ఈరోజు వెరీ స్పెషల్.నువ్వు మరో స్వీటు తీసుకుని తిను. నేనందరికీ టీలు ఇచ్చి వస్తాను. " టీ ట్రే తో అందరి దగ్గరకు వెళ్ళింది. స్వీటు తింటూనే అందరూ తలో కప్పు తీసుకున్నారు.

" సార్ ! మమ్మల్ని ఊరించకండి సార్. చెప్పెయ్యండి. మేడం ఏం సాధించారో మాకు ఆతృతగానే ఉంది. విషయం తెలుసుకోకుండా వెళ్తే ఫీల్డ్ లో హుషారుగా తిరగలేము. ప్లీజ్ చెప్పెయ్యండి. " అన్నారిద్దరు ముగ్గురు టీ త్రాగుతూనే.

" ఓకే ఓకే ..మీ అందరికీ ఫీల్డ్ మీదకెళ్ళే టైం అయ్యింది. చెప్పేస్తున్నాను. ఆ విషయం చెప్పేముందు మీ అందరికీ నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోవాలి. డియర్ ఫ్రెండ్స్...థాంక్యూ వెరీ మచ్. " అంటూ ఆగాడు ఏకాంబర్.

అప్పటికే నూకరత్నం వచ్చి ఏకాంబర్ చేతిలో టీ కప్పు పెట్టింది. టీ సిప్ చేస్తూ కౌంటర్ టేబుల్ మీద స్టైల్ గా కూర్చున్నాడు.

" ఎందుకు సార్ థేంక్స్? మీరు మాకు ధన్యవాదాలు చెప్పాల్సినంత సహాయం ఏం చేసాం సార్ ? " అన్నారెవరో." మీ అందరూ నేను అడక్కుండానే సంఖ్యాబలం కోసం నా టార్గెట్ ఫుల్ ఫిల్ చేయడానికి తలో పాలసీ రాసారు. ఆ సమయంలో ఆ చివరి క్షణం లో మీ అందరూ అలా పాలసీ ఇచ్చి ఆదుకోకపోతే నేను నా టార్గెట్ ని రీచ్ అయ్యేవాడ్ని కాదు. " అలా అన్నప్పుడు ఏకాంబర్ గొంతు బొంగురు పోయింది." గొప్పగా చెప్పారు సార్. అదంతా మీకు తెలీదు. మేడం గారే మా అందరికీ మనిషో పాలసీ ఇవ్వాలని కోరారు. అదీ నెలకి రెండొందలే కదాని అందరం ఆనందంగా పాలసీ కట్టాము. ఆ డబ్బు కూడా మేడం గారే ఆర్నెల్లకోసారి కడతామని నెలనెలా మా జీతాల్లో తీసుకుంటామని చెప్పారు. దీంట్లో మా సహాయం ఏముంది సార్? " అన్నాడింకో కుర్రాడు.

" మీకు, మేడం గారికి నా ధన్యవాదాలు. ఇకపోతే మీ మేడం నూకరత్నం గారు శ్రీరాం చిట్స్ లో ఏజంటని తెలుసు కదా క్వార్టర్లీ చిట్ కాంపిటీషన్ లో స్టేట్ లెవల్ లో టాపర్ గా నిలిచారు మీ మేడం నూకరత్నం. పదికోట్ల రూపాయల విలువగల చిట్స్ చేసి స్టేత్ టాపర్ అయ్యారని రాత్రే తెలిసింది. ఇది మనందరికీ గర్వకారణం. ఆనందదాయకం. ఇంత వ్యాపారం చేసినందుకు బహుమతి కూడా ఇస్తున్నారు. మేడం గారు ఇక నుండీ ఎక్కడికి వెళ్ళాలన్నా నడవ కూడదని కంపెనీ వారి ఆదేశం. 'స్కూటీ బహూకరిస్తున్నారు. హేట్సాఫ్ నూకరత్నం గారూ! అవునా ఫ్రెండ్స్ " బిగ్గరగా గొంతెత్తి చెప్పాడు ఏకాంబర్.

" ఎస్సార్. గ్రేట్ అచీవ్ మెంట్ మేడం..కంగ్రాట్స్ ! ఆల్ ద బెస్ట్." అంటూ అందరూ వచ్చి నూకరత్నం చెయ్యి లాక్కుని అభినందనలు తెలిపారు.అందరి సంతోషానికి, సంబరంగా వాళ్ళందరూ చెప్తున్న శుభాకాంక్షలకి నిండుగా పులకించిపోయింది నూకరత్నం.

" డియర్ ఫ్రెండ్స్ ! మీ అందరికీ ఫీల్డ్ మీదకు వెళ్ళే సమయం ఆసన్నమయింది. చూసారుగా మీరూ మేడం నూకరత్నం లా తలుచుకున్నది సాధించాలి. మీరంతా మా దగ్గరే అయిదారువేల రూపాయల జీతానికి ఉండిపోవాలని మేము కోరుకోవడం లేదు. చూస్తున్నారుగా, మీరు తెచ్చే ఫ్రాంచైజీల కలక్షన్లకు వచ్చే కమీషన్ అంతా మీ జీతాలకే సరిపోతోంది. మేడం కి రూపాయి మిగలడం లేదు. అయినా ఆమె బాధపడలేదు. మొక్క నాటిన వెంటనే ఫలాలు ఆశించలేము కదా ! అందుకే తను కూడా చిట్స్ కంపెనీల్లో ఏజంటుగా చేరి కష్టపడుతోంది. కేవలం మూడు నెలల్లో పది కోట్ల చిట్ వ్యాపారం చేయడం మాటలు కాదు. కమీషన్ ఎంతొస్తుందో మీకు తెలుసా! మీరూ మాలా బాగుపడాలని.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
meghana