Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
duradrustapu dongalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

Happy Dasara

వారఫలం (అక్టోబర్ 3 నుండి అక్టోబర్ 9 వరకు ) - శ్రీకాంత్

మేష రాశి

 ఈ వారం మొత్తంమీద ఆశించిన విధంగా ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పులకు ఆస్కారం కలదు మొదట్లో కొంత నిరాశకు గురిచేసిన రానురాను సర్దుకుంటుంది. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేయుటకు అవకాశం ఉంది. బందుమిత్రులనుండి నుండి నూతన సమాచారం సేకరిస్తారు వారితో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం కలదు. మొత్తంమీద ఆరోగ్యం విషయంలో అశ్రద్ద చేయకండి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మిత్రులతో కలిసి చేపట్టు పనుల విషయంలో అవగాహన కలిగి ఉండుట మంచిది లేకపోతే అనవసరమైన వివాదములలో ఎరుక్కొనే అవకాశం కలదు జాగ్రత్త. దూరప్రదేశప్రయాణాల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు ఈ విషయంలో నూతన ప్రయత్నాలు మొదలుపెడతారు

 

 

వృషభ రాశి

ఈ వారం మొత్తంమీద తలపెట్టిన  పనులను అనుకున్న సమయానికి పూర్తిచేయుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట మూలాన మంచి గుర్తింపును పొందుటకు అవకాశం ఉంది. మిత్రులతో సమయాన్ని సంతోషంగా గడుపుటకు అవకాశం ఉంది. బంధువులనుండి నూతన విషయాలను తెలుసుకుంటారు కుటుంబసభ్యలతో కలిసి నూతన నిర్ణయాలు తీసుకొనే అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవాకాశాలు లభించుటకు ఆస్కారం ఉంది. విదేశీప్రయత్నాలు కలిసి వస్తాయి గతకొంతకాలంగా ఆగిఉన్న పనులు ముందుకు సాగుటకు అవకాశం ఉంది  కావున ప్రయత్నం పెంచుట వలన మేలుజరుగుతుంది. ఎవ్వరితోను మాటపట్టింపులకు పోకపోవడం అనేది మంచిది కొన్ని కొన్ని విషయాల్లో సర్దుబాటు మంచిది.     

 

మిథున రాశి

ఈ వారం మొత్తంమీద ప్రతివిషయంలో నిదానం అవసరం పెద్దలకు అనుగుణంగా నడుచుకొనుట మూలాన మేలుజరుగుతుంది. ఉద్యోగంలో సమయపాలన పాటించుట ఉత్తమం తోటివారిని కలుపుకొని వెళ్ళుట వలన సగం సమస్యలు తగ్గుటకు అవకాశం ఉంది ఈ ప్రయత్నం చేయుట ఉత్తమం. విందులపట్ల మక్కువను కలిగి ఉంటారు వాటికి సమయం ఇస్తారు ఈ పరంగా ఖర్చులు కలుగుటకు అవకాశం ఉంది. చిన్న చిన్న విషయాలకే హైరానా పడే అవకాశం ఉంది కావున అనుభవజ్ఞుల సూచనలు పరిగణలోకి తీసుకోండి. దూరప్రదశప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది మిత్రులతో కలిసి ప్రయాణం చేయుట వలన కొంత మేలుజరుగుతుంది. ప్రయాణాలు చేయకండి వీలయితే వాయిదా వేయుట వలన మేలుజరుగుతుంది. మానసికంగా కొన్ని కొన్ని విషయాలు మీపైన ప్రభావం చూపించే అవకాశం కలదు జాగ్రత్త. స్థిరాస్తులకు సంభందించిన విషయల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం అనేది సూచన.   

 

 

 

కర్కాటక రాశి

ఈ వారం మొత్తంమీద మిత్రులనుండి అలాగే తోటివారినుంది సహకారం లభించుట వలన చాలవిశాయాల్లో మేలుజరుగుతుంది. ఆరోగ్యం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధను వహించుట వలన మేలుజరుగుతుంది. అధికారులతో మాటపట్టింపులకు పోకండి వారి సూచనలు పాటించుట వలన సూచన. ఆర్థికపరమైన విషయల్లో సరైన ప్రణాళిక కనుక లేకపోతే ఖర్చులు ఆశించిన దానికన్నా అధికమయ్యే అవకాశం ఉంది కావున ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించుట ఉత్తమం. సోదర/సోదరి వర్గం మూలాన కొంత నూతన సమస్యలు కలుగుతాయి కాకపోతే అవి తాత్కాలికం అను మర్చిపోకండి నిదానంగా వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది. స్త్రీ సంభందమైన విషయాల్లో జాగ్రత్తగా లేకపతే ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపారంలో నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు అవకాశం కలదు. సమయానికి భోజనం చేయట ఈ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధనుతీసుకోండి మంచిది .

 

 

 

సింహ రాశి

......ఈ వారం మొత్తంమీద నలుగురిలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది కాకపోతే శ్రమను ఆపకండి ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్ళు ప్రయత్నం చేయుట మంచిది. తలపెట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేయుటకు అవకాశం ఉంది. దూరప్రదేశం నుండి నూతన విషయలు తెలుస్కునే అవకాశం ఉంది వాటి మూలాన లబ్దిని పొందుటకు అవకాశం కలదు. ప్రయాణాలు చేయునపుడు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది సూచన లేకపోతే స్వల్ప ఆటంకాలు కలుగుటకు అవకాశం ఉంది. దైవసంభందమైన విషయాలకు సమయం ఇవ్వడం అనేది సూచన.  కుటుంబంలో సభ్యుల సహకారం ఆశించిన విధ్నగా ఉంటుంది ఇది చెప్పుకోతగ్గ పరిణామం . అనారోగ్యం మూలన కాంత్ విశ్రాంతిని కోరుకొనే అవకాశాలు కలవు. పెద్దల నుండి వచ్చిన సూచనలను అశ్రద్దచేయకండి మంచిది. చిననాటి మిత్రులను కలుస్తారు వారిద్వారా లబ్దిని పొందుటకు అవకాశం ఉంది.        

 

 

 

కన్యా రాశి

ఈ వారం మొత్తంమీద చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. కాకపోతే సూచన ఏమిటంటే శక్తికి మించిన పనులకు దూరంగా ఉండుట మంచిది కొంచం కొంచంగా ప్రయత్నం చేస్తే ఆశించిన ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో నలుగురికి ఉపయోగపడే ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది మీమూలన తోటివారు లబ్దిని పొందుతారు. ఆరోగ్యం విషయంలో మాత్రం అశ్రద్దవద్దు. దూరప్రదేశప్రయాణాలు కలిసి వస్తాయి ప్రయత్నం చేయుట మంచిది. గతకొంతకాలంగా అగిఉన్న పనులు ముందుకు సాగుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాలో నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది కొన్ని కొన్ని నిర్ణయాలు బాగాఆలోచన చేసి తీసుకోండి. మీ ఆలోచనలు తోటివారికి నచ్చక పోవచ్చును సర్దుకుపోవడం మంచిది. అనారోగ్యసమస్యలు కలుగుటకు అవకాశం ఉంది తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.   

 

 

తులా రాశి

ఈ వారం మొత్తంమీద ప్రతిపనిని ఒకటికి రెండుసార్లు చేయవలసి రావోచ్చును కావున నిదానంగా ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. తలపెట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేయుటకు అవకాశం ఉంది సర్దుబాటుస్వాభావం అవసరం. ఆర్థికపరమైన విషయాల్లో పెద్దలతో కలిసి చర్చలు చేయుటకు అవకాశం కలదు. ప్రయాణాలు చేయకండి ఒకవేళ చేయవలసి వస్తే తగిన జాగ్రత్తలు చేపట్టుట మంచిది.సమయానికి భోజనం చేయుట వలన మేలుజరుగుతుంది లేకపోతే అనారోగ్య సమస్యలు కలుగుటకు ఆస్కారం కలదు. స్త్రీ/పరుష సంభందమైన విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే వివాదాల్లో ఇరుక్కొనే అవకాశం కలదు. బద్ధకం వద్దు సరైన సమయంలో సరైన ఆలోచనలు చేసి ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. దైవసమ్భ్నదమైన విషయాల్లో సమయం ఇవ్వడం అనేది సూచన. ఉద్యోగప్రయత్నాలు కలిసి వత్సాయి.     

 

 

వృశ్చిక రాశి

ఈ వారం మొత్తంమీద చాలావిషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. పనిభారం పెరుగుతంది నూతన ప్రయత్నాల విషయంలో తొందరపాటు నిర్ణయాలు చేయకండి. నలుగురిలో పనిచేసే సమయంలో నిదానంగా వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది. ప్రయాణాల మూలాన స్వల్పఇబ్బందులు కలుగుతాయి పెద్దల నుండి వ్యతిరేకఫలితాలు రావడం చేత నిరాశను పొందుతారు. వాహనముల వలన ఇబ్బందులు అలాగే ఖర్చులు కలుగుతాయి. కుటుంభసభ్యులతో కలిసి చర్చల్లో పాల్గొనేటప్పుడు నిదానంగా వ్యవహరించుట సూచన లేకపోతే మనస్పర్థలు పెరుగుటకు అవకాశం కలదు. అనుభవజ్ఞుల సూచనలు పెడచెవిన పెట్టడం మూలాన నష్టపోయే అవకాశం కలదు జాగ్రత్త. ప్రతిపనిలో తోటివారి సహకారం తీసుకోవడం వలన కూడా మేలుజరుగుతుంది.   

 

 

ధనస్సు రాశి

ఈ వారం మొత్తంమీద ఉద్యోగంలో పనిఒత్తిడిని పొందుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులను మధ్యలో ఆపివేసే అవకాశం ఉంది కావున జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. పెద్దలనుండి నూతన సూచనలు వచ్చుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో ఖర్చులు మీస్థాయినిమించిపోయే అవకాశం ఉంది కావున జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. ప్రయాణాలు మీకు కొంత చికాకును కలిగిస్తాయి కోపంను తగ్గించుకొనే ప్రయత్నం చేయుట మంచిది.ఒకవార్త మిమ్మల్ని నిరుత్సాహానికి గురిచేస్తుంది. కొన్ని కొన్ని విషయాల్లో సర్దుబాటు మేలుచేస్తుంది. ప్రయాణాలు చేయకపోవడం సూచన వీలైతే వాయిదా వేయుట శ్రేయస్కరం. అధికారులతో రహస్య చర్చల్లో పాల్గొనే అవకాశం కలదు,రాజకీయ పరమైన విషయాలకు సమయం ఇవ్వడం అంత మంచిది కాదు కొంతకాలం వేచిచూసే దొరని వలన తప్పక మేలుజరుగుతుంది.

 

మకర రాశి

ఈ వారం మొత్తంమీద ఇష్టమైనవ్యక్తులను కలిసే అవకాశం ఉంది వారితో కలిసి నూతన ప్రయత్నాలు మొదలుపెడతారు. కుటుంబసభ్యుల నుండి ఆశించిన సహకారం లభిచుట చేత సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం కలదు. చిననాటి మిత్రులను కలుస్తారు వారినుండి నూతన విషయాలను తెల్సుకొనే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మాత్రం పెద్దలతో చర్చలు చేయకండి వారికి అనుగుణంగా నడుచుకొనుట వలన మేలుజరుగుతుంది. ప్రయాణాలు వాయిదా వేయుట సూచన, ప్రయాణాల మూలాన ఒత్తిడి పెరుగుటకు అవకాశం కలదు. ఇష్టమైన పనుల యందు ఉత్సాహంను చూపిస్తారు మిగితా విషయాల్లో పెద్దగా స్పందించరు. అనారోగ్యసమస్యలను అశ్రద్ధ చేయకండి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. ఉద్యోగంలో క్రమశిక్షణ మేలుచేస్తుంది లేకపోతే మాట పడవలసి రావోచ్చును అధికారులకు అనుగున్మగా నడుచుకొనుట వలన మేలుజరుగుతుంది.    

 

కుంభ రాశి

ఈ వారం మొత్తంమీద తలపెట్టిన పనులను కాస్త ఇబ్బందికి లోనయిన విజయవంతంగా పూర్తిచేయటకు అవకాశం ఉంది. కుటుంబసభ్యులతో మీయొక్క ఆలోచనలను పంచుకొనే అవకాశం ఉంది వారిని కొంత నిరుత్సహంకు గురిచేసే అవకాశం ఉంది. ఉద్యోగంలో మాత్రం అధికారులతో సంప్రదింపులు చేసే అవకాశం ఉంది మీ ఆలోచనలను వారికి తెలియజేసే అవకాశం కలదు. దూరప్రదేశప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది.  అనవసరమైన ఆలోచనలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయుట వలన మేలుజరుగుతుంది. వ్యాపారపరమైన విషయాల్లో కొంత నష్టం ఎదుర్కొంటారు కావున నూతన పెట్టుబడులు పెట్టక పోవడం మంచిది. అశుభవార్తను వింటారు కొంత మానసికంగా ఒత్తడి తప్పదు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులు తప్పవు. ప్రయాణాలు చేయునపుడు జాగ్రత్తగా ఉండుట సూచన. దూరప్రదేశం లో ఉన్న వారినుండి నూతన విషయాలు తెలుస్కోనే అవకాశం ఉంది నిదానం అవసరం.

 

మీన రాశి

ఈ వారం మొత్తంమీద బందుమిత్రుల నుండి నూతన సూచనలు అలాగే సలహాలను పొందుటకు అవకాశం ఉంది వాటిని పాటించే ప్రయత్నం చేయుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో మిశ్రమఫలితాలు పొందుతారు. పనిభారం ఉంటుంది కాకపోతే ప్రణాలికా బద్దంగా ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. చిన్న చిన్న నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది ఉత్సాహంను కలిగిఉండి ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. ప్రయాణాలు వాయిదా వేస్తారు దూరప్రదేశంలో నున్న మిత్రులతో సమాచరం సేకరిస్తారు. అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది విందులలో పాల్గొంటారు వాటికీ సమయాన్ని ఇస్తారు. వినోదాల పట్ల మక్కువను కలిగి ఉంటారు. ఆరోగ్యం విషయంలో మాత్రం అశ్రద్ద వద్దు కొంత ఇబ్బందులు తప్పకపోవచును. చిన్న చిన్న విషయాలను వదిలివేసే ప్రయత్నం చేయుటమంచిది. వ్యాపారంలో కొంత నూతన సమస్యలను ఎదుర్కొంటారు.  

శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిష్యాలయం

మరిన్ని శీర్షికలు
sahiteevanam