Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
who is lucky beauty in tollywood

ఈ సంచికలో >> సినిమా >>

Happy Dasara

‘గోవిందుడు..’ చరణ్‌ని మార్చేసింది

govindudu changed charan

తండ్రి మెగాస్టార్‌, బాబాయ్‌ పవర్‌ స్టార్‌. అభిమానుల అంచనాలేమో ఆకాశంలో. ‘మగధీర’ తర్వాత ‘ఆరెంజ్‌’ చేస్తే బెడిసి కొట్టింది. మాస్‌ సినిమా చేయక తప్పలేదు. ఆ తర్వాత ‘నాయక్‌’ కూడా మాస్‌ సినిమానే. ‘ఎవడు’ కూడా అలాంటిదే. చరణ్‌ నుంచి కొత్త తరహా సినిమా వస్తుందా? మాస్‌ జోనర్‌ని వదిలి క్లాస్‌ ఆడియన్స్‌ని చరణ్‌ తనవైపుకు తిప్పుకోలేడా? అనే ప్రశ్నలు వచ్చాయి.

వాటికి సమాధానంగా చరణ్‌ ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాని ఎంచుకున్నాడు. చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఫామ్‌లో లేని కృష్ణవంశీతో సినిమా చేయడం పెద్ద ‘మిస్టేక్‌’ అని ఎవరనుకున్నా, చరణ్‌ మాత్రం కృష్ణవంశీని నమ్మాడు. ఇండస్ట్రీ హిట్‌ కావాలని కోరుకోలేదు చరణ్‌. తనలోని నటుడ్ని ఎలివేట్‌ చేస్తూ మంచి సినిమా చేయాలనుకున్నాడు. అతని ఆశ తీరింది.

‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా గురించి హిట్‌, యావరేజ్‌ అనే టాక్‌ వస్తున్నప్పటికీ, పెర్ఫామెన్స్‌ వైజ్‌ రామ్‌చరణ్‌ ఎక్కువ మార్కులేయించుకున్నాడు. ఓ నటుడుకి ఇంతకన్నా కావాల్సిందేముంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ చరణ్‌కి కనెక్ట్‌ అయ్యారు. చరణ్‌ ఇప్పుడు ఏ సినిమా అయినా చేయొచ్చు. మాస్‌ సినిమా చేసినా, క్లాస్‌ సినిమా చేసినా మెప్పించగలడినిపించుకున్నాడు చరణ్‌. ప్రయోగం చేస్తేనే కదా ఫలితం వచ్చేది. అదే చరణ్‌ చేశాడు, సాధించాడు.

మరిన్ని సినిమా కబుర్లు
mother movie creating tention