Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
daring and dashing

ఈ సంచికలో >> సినిమా >>

నగ్నత్వాన్నీ ఓ కళగానే చూడాలి: నందనాసేన్‌

find to nudity as a art

బాలీవుడ్‌ హీరోయిన్‌ నందనా సేన్‌ విభిన్నమైన చిత్రాల్లోనే నటిస్తుంది. కథ ఎంతో గొప్పగా ఉంటే తప్ప నటించడానికి ఒప్పుకోదు. ఆమెకు అంత ప్రత్యేకమైన గుర్తింపు వుందంటే కారణం ఆమె చేసిన సినిమాలే. ‘రంగ్‌ రసియా’ అనే సినిమాలో నగ్నంగా కనిపించనుంది నందనా సేన్‌. ఈ సినిమా క్లిప్‌ ఒకటి ఇంటర్నెట్‌లో సంచరిస్తోంది.

ప్రముఖ చిత్రకారుడు రవివర్మ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాలో నందనా సేన్‌ నగ్నంగా కనిపించింది. అది వివాదాస్పదం కావడంతో సినిమా విడుదల కూడా ఆలస్యమయ్యింది. నగ్నత్వం గురించి చెబుతూ, నటన అనేది ఓ కళ అని, కళాత్మకంగా వుండటం కోసం ఒక్కోసారి నగ్నత్వం కూడా తప్పదని, దాన్ని కళ కోణంలోనే చూడాల్సి వుంటుందని అభిప్రాయం వెలిబుచ్చింది.

రణ్‌దీప్‌ హుడా, నందనా సేన్‌ల మధ్య రొమాంటిక్‌ సీన్స్‌ ఈ సినిమాకి హైలైట్‌ అవుతాయట. ‘రంగ్‌ రసియా’ చిత్రంలో నందనా సేన్‌ పాత్ర పేరు సుగంధ. ఈ పాత్ర తనకు మంచి గుర్తింపునిస్తుందని నందనాసేన్‌ చెప్పింది.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam