Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
rain sentiment for varun

ఈ సంచికలో >> సినిమా >>

డాన్సింగ్‌ సెన్సేషన్‌ అనాల్సిందేనంట

must say dancing sensation

హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ని ‘గోల్డెన్‌ లెగ్‌’ అంటున్నారు తెలుగు సినిమాల్లో. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’, ‘లక్ష్యం’ సినిమాలు విజయం సాధించడం ద్వారా ఆమెకు ఆ గుర్తింపు దక్కింది. అది గుర్తింపు కాదు, గౌరవం అంటూ సక్సెస్‌ ఫుల్‌ కెరీర్‌ని ఎంజాయ్‌ చేస్తున్న రకుల్‌ ప్రీత్‌సింగ్‌, ‘రఫ్‌’ సినిమాలో డాన్సులు అద్భుతంగా చేసిందట.

‘రఫ్‌’ సినిమాలో హీరో ఆది. డైలాగ్‌ కింగ్‌ సాయికుమార్‌ తనయుడు ఆది నటించే సినిమాల్లో డాన్సులు సూపర్బ్‌గా ఉంటాయని అందరికీ తెలుసు. అతనితో పోటీ పడ్డమంటే తేలిక కాదు. అందుకే రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ఆదితో పోటీ పడి డాన్సులు చేసి, డాన్సింగ్‌ సెన్సేషన్‌ అన్పించుకోవాలనుకుంటుందట.

‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’లో రకుల్‌కి పెద్దగా డాన్సులు చేసే అవకాశం రాలేదు. ‘లక్ష్యం’లో కొంచెం డాన్స్‌ చేసే అవకాశమొచ్చింది. ‘కరెంటు తీగ’లో కూడా అంతే. ‘రఫ్‌’లో మాత్రం డాన్సులు రఫ్పాడిరచేసిందట రకుల్‌ ప్రీత్‌సింగ్‌. ‘రఫ్‌’ చూశాక డాన్సింగ్‌ సెన్సేషన్‌ అని రకుల్‌కి గుర్తింపు వస్తుందని చిత్ర యూనిట్‌ అంటోంది.

మరిన్ని సినిమా కబుర్లు
when is mega star movie