Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sahiteevanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

విమానాలు - బన్ను

Flights - Cancellation

డొమెస్టిక్ ఎయిర్ లైన్స్ ను ప్రైవేటు రంగాలకి ఇచ్చినా అందులో ప్రయాణించేది ప్రజలే ! ప్రజల అవసరాలను తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.

భారతీయులు గర్వంగా ఫీలయ్యేలా చేసిన 'విజయ్ మాల్యా' అనవసరంగా 'ఎయిర్ లైన్స్' లోకి వచ్చి దెబ్బతిన్నాడు. బ్రతికితే ఒక్కరోజన్నా విజయ్ మాల్యా లాగా బ్రతకాలి అనుకునేవాళ్లు ఎందరో వున్నారు. ఐతే "కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్" ను మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాపం ఆయన కుదేలైపోయాడు.

అదే కోవలో ఈరోజు "స్పైస్ జెట్ " పరిస్థితి కొనసాగుతోంది. నష్టాల్లో కూరుకుంది. ప్రభుత్వం 'బెయిల్ అవుట్ ' ఇవ్వలేదు సరికదా... కనీసం ఇంధనం కూడా ఇవ్వటం లేదు. ఆఖరి క్షణాల్లో ఫ్లైట్స్ ని రద్దు చేస్తున్నారు. దీనివల్ల ప్రజలే నష్టపోతున్నారు. ప్రభుత్వం అది గమనించాలి.

ప్రజల్ని కష్టపెట్టటం ఆపాలి . ఆ భాద్యత ప్రభుత్వానిదే !!

మరిన్ని శీర్షికలు
natyabharateeyam