Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cinechuraka

ఈ సంచికలో >> సినిమా >>

పూరి ‘జ్యోతిలక్ష్మి’ అదిరింది

puri's jyothilakshmi adhurs

జ్యోతిలక్ష్మి పేరుతో సినిమా టైటిల్‌ పెట్టాలని పూరి జగన్నాథ్‌కి ఎందుకు అనిపించింది? ఏమో తెలియదుగానీ ఈ టైటిల్‌ గురించిన చర్చ తెలుగు సినీ పరిశ్రమలో బాగా జరుగుతుంది. సినిమాకి టైటిల్‌ పెట్టడం ఓ ఆర్ట్‌. ఆ ఆర్ట్‌లో ఆరితేరిన మొనగాడు పూరి జగన్నాథ్‌. ఏ సినిమా టైటిల్‌ పెట్టినా వెరైటీగా ఆలోచించే పూరి జగన్నాథ్‌, ‘జ్యోతిలక్ష్మి’ పేరును కూడా వెరైటీగానే ఆలోచించి ఉంటాడు.

‘ఇడియట్‌’, ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ ‘దేవుడు చేసిన మనుషులు’ ‘నేనింతే’ ఇలా పూరి ఏ సినిమా తీసినా, ఆ సినిమా టైటిల్‌ సినిమాకి స్పెషల్‌ క్రేజ్‌ తెచ్చాయి. ‘జ్యోతిలక్ష్మి’ కథ ఏంటో తెలియదుగాని టైటిల్‌ ప్రకటించగానే ఆ సినిమా పట్ల ఆసక్తి పెరిగింది. ఛార్మి ప్రధాన పాత్రలో ఈ సినిమా రూపొందనుంది. ఛార్మికి లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు కొత్త కావు. ‘మంత్ర’ వంటి చిత్రాలతో ఛార్మి ప్రత్యేక గుర్తింపు పొందింది.

టైటిల్‌తోనే ఆకట్టుకున్న ‘జ్యోతిలక్ష్మి’ సినిమాగానూ ప్రేక్షకుల్ని అలరిస్తే, ఛార్మికి పెద్ద బ్రేక్‌ లభించినట్లే. కొన్నాళ్ళుగా తెలుగు సినీ పరిశ్రమలో ఛార్మి హవా తగ్గింది. ‘జ్యోతిలక్ష్మి’తో ఆమె హవా మళ్ళీ పెరుగుతుందని అనుకోవచ్చు. ‘జ్యోతిలక్ష్మి’ హిట్టయితే, పూరికి ఛార్మి రుణపడిపోతుంది.

మరిన్ని సినిమా కబుర్లు
movie hit song double hits