Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
jyoti patham

ఈ సంచికలో >> శీర్షికలు >>

జ్యోతిష్యం-విజ్ఞానం - -శ్రీకాంత్

 
శ్రీ గురుభ్యోర్నమః
 
 
మానవుడు నిరంతర పిపాసి అనునిత్యం ఏదో ఒక విషయం తెలుసుకోవాలనే ఆకాంక్ష,అన్వేషణ కొనసాగుతూనే ఉంటుంది అలాగే ఒక పక్క వేగంగా అభివృద్ధిచెందుతున్న సాంకేతికత మూలాన నేడు జ్యోతిషశాస్త్రాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాడు. జ్యోతిషం కర్మసిద్ధాంతం పైన ఆధారపడి ఉంది. గతజన్మలో చేసిన కర్మలు మనలను దిశానిర్దేశం చేస్తాయనేది నమ్మకం శాస్త్ర వచనం. జ్యోతి అంటే వెలుగు,ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడ అభివృద్ధి,విజ్ఞానం ఉంటాయనేది మన ఋషుల అభిప్రాయం. మానవుడు అనునిత్యం తన ప్రయాణాన్ని ఆ వెలుగును శోధించే దిశగా ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రయాణంలోనే భూకేంద్ర,సూర్య కేంద్ర సిద్దాంతాలను ప్రతిపాధించారు. సూర్యకేంద్ర సిద్ధాంతం అంటే సూర్యున్ని కేంద్రంగా చేసుకొని ఇతర గ్రహాలు తమ కక్ష్యల్లో పరిభామిస్తూ ఉంటవి. భూకేంద్ర సిద్ధాంతం అనగా గ్రహాలు భూమిని కేంద్రంగా చేసుకొని తిరుగుతాయి.

జ్యోతిషం మొత్తం నవగ్రహాలు,ద్వాదశ రాశులు ,27 నక్షత్రాలు ఏవిధంగా మానవుని పైన వాటి ప్రభావాన్ని చూపిస్తాయో తెలియజేస్తుంది. రవి,చంద్ర,కుజ,గురు,శుక్ర,శని,బుధ ఈ ఏడుగ్రహాలను అలాగే రాహు,కేతులను చాయగ్రహాలుగా జెలియ జేస్తుంది జ్యోతిషం. మేషం,వృషభం,మిథునం,కర్కాటకం,సింహం,కన్యా,తుల,వృశ్చికం,ధనుస్సు,మకరం,కుంభం,మీనం ఇవి ద్వాదశరాశులు. అశ్విని,భరణి,క్రుత్తిక.... రేవతి వరకు 27 ఇవి నక్షత్రాలు. వేదాంగాలలో జ్యోతిషం అనేది కంటిగా అభివర్ణించారు మహారుషులు. మిగతా వేదాంగాలు వేదంగురుంచి తెలుసు కోవడానికి ఉపయోగపడితే జ్యోతిషం మాత్రం ప్రక్రుతిపైన ఖగోళం లోని గ్రహాలు,నక్షత్రాలు ఏవిధంగా ప్రభావాన్ని చుపిస్తున్నాయో తెలియజేస్తుంది. అలాగే నేటి వైజ్ఞానిక కాలంలో అంతుచిక్కని ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలదు.

వెలుగు ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రకాశం,జ్ఞానం ఉంటవి అక్కడే ఆనందం ఉంటుంది. మనం దినవారి చర్యలో పగలు అలాగే రాత్రిని చూస్తున్నాం. పగలు మనలో శక్తిని,సంతోషాన్ని ఇస్తే రాత్రి భయాన్ని ఇస్తుంది. ఎవరు చెప్పారని మనమే కాదు జంతవులు, పక్షులు, మానవులు సైతం విశ్రాంతిని కోరుకుంట్టున్నాయి. అలాగే ప్రకృతిలోని మార్పుల మూలానే రుతువులు ఏర్పడుతున్నవి అలాగే వర్షాలు వస్తున్నవి అనేది స్పష్టం. వీటిని కూడా అధ్యయనం చేస్తున్నది జ్యోతిషం. రాశులు,గ్రహాలు,భావాలు ఎవవ్ని కలిసి మానవుల పైన ఏవిధంగా ప్రభావాన్ని చూపిస్తాయో తలిపేదే జ్యోతిషం. ద్వాదశభావాలు మనయొక్క ప్రతి కదలికలను తెలియజేస్తాయి. ముందుముందు భావాలు, రాశులు ఏవిధంగా ప్రభావాన్ని చూపిస్తాయో తెలుసుకుందాం.
మరిన్ని శీర్షికలు
jayajaya devam