వికెట్టు పవరు..
కలిసొచ్చిన సీజన్లో క్రికెట్టు ఫీవరు..
కప్పు వచ్చేదెవరికో కనిపెట్టేదెవరు?
పోటాపోటీలుగా పరుగుల తీన్మారు..
రికార్డులు బ్రేక్ చేసి మోతెక్కిస్తారు!!
ఎవరొచ్చినా తిప్పలే..
ఏపార్టీ అయినా ఓట్ల లెక్కలే!
అంతా ఒక తాను ముక్కలే..
ఆదమరిస్తే కోల్పోయేది హక్కులే..
మరిచి మళ్ళీ నమ్మితే చిక్కులే!!
!
ఎందుకీ తలవంపు?
తెలుగుమాటంటే చిన్న చూపు..
తెలుగువాడంటేనే వెక్కిరింపు!
తలమాసినవాళ్ళుగా చీదరింపు..
ఢిల్లీ పెద్దల తీరుతెన్నులే తప్పు !!