Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
yatra

ఈ సంచికలో >> సీరియల్స్

వేదిక

జరిగిన కథ :హిందూ దేవుళ్ళ గురించి క్లాస్ మేట్ చులకనగా మాట్లాడటంతో చిన్నారి చంద్రకళ నొచ్చుకుంటుంది. క్రింద ఫ్లాట్ లో కొత్తగా దిగిన డాన్స్ మాస్టారు గారింటికి వెళ్ళి అక్కడందరూ ప్రాక్టీస్ చేసే డాన్స్ చూస్తూ సంబరపడుతుంటుంది......ఆ తర్వాత....

ఎగ్జామ్స్ అయ్యాయి.  ఒకటి రెండు రోజుల్లో, డాన్స్ సంగతి, ముందు నాన్నతో.. తరువాత, అమ్మతో మాట్లాడాలి...అనుకుంటూ డిన్నర్  ఫినిష్ చేసి వెళ్లి, నా గదిలో హోం వర్క్ బుక్స్ ముందేసుకున్నాను.

“కళా ఇలా రా,” పిలిచారు నాన్న.  డాన్స్ క్లాస్ ఆలోచనలోనే ఉన్న నేను మెల్లగా వెళ్లాను.

సిటింగ్ రూములో అమ్మా, నాన్నలతో కూర్చుని మాట్లాడుతున్న శివరామశర్మ మాస్టారుని చూసి ఆశ్చర్యపోయాను.  భయం కూడా వేసింది. క్లాసులో అంతమందికి డాన్స్ నేర్పించే ఆయన, మా ఇంట్లో మా అమ్మావాళ్ళతో వచ్చి ఏమి మాట్లాడుతున్నారో అర్ధం కాలేదు. మొన్న నన్ను పిలిచి, నా గురించి వివరాలు కనుక్కుని, డాన్స్ నేర్చుకోవాలని ఉందా? అని మాస్టారు అడిగినప్పుడు, తను ఔనని చెప్పడం గుర్తొచ్చింది. నాన్న దగ్గరగా వెళ్ళి నిలబడ్డాను.  “రేపటి నుంచి నువ్వు కూడా కూచిపూడి నేర్చుకో,” అన్నారు.చెప్పలేనంత సంతోషమనిపించింది.

“మీ మాస్టారు, ఆయనే వచ్చి, నిన్ను తప్పక డాన్సుకి పంపమని అడుగుతున్నారు. నీకు డాన్సెంత ఇష్టమో మాకు తెలుసుగా,” అన్నారు నాన్న నా  భుజాల చుట్టూ చేతులు వేస్తూ.

నేల చూపులు చూస్తుండిపోయాను.

“చంద్రా మరి ఇంకా అలకెందుకు? మాస్టారు గారి ఆశీర్వాదం తీసుకో,” అంది అమ్మ.

గుర్తొచ్చింది పెద్దవాళ్ళ పాదాలు తాకి నమస్కరించాలని.  అదే చేసాను.

మాస్టారు ఆశీర్వదించారు.

“సరే చంద్రకళ, రేపు చూస్తానమ్మా,” అంటూ బయలుదేరారు మాస్టారు.

**

కూచిపూడి  డాన్స్ నేర్చుకోబోతున్నందుకు గొప్పగా ఫీల్ అయ్యాను.  కొత్త ఎనెర్జీ వచ్చింది..

అదీ కాక,  వారం రోజుల్లో జరగబోయే  టాలెంట్ షో కి ఎలాగూ ప్రాక్టీస్ చేయిస్తుంది అమ్మ....  అంటే, నాకిక ఎప్పుడూ డాన్స్....డాన్స్... డాన్స్.... చదువులో మార్కులు, క్లాస్ ర్యాంక్ బాగానే ఉంటే, నా డాన్స్ క్లాసుకి అడ్డం ఉండదని చెప్పింది అమ్మ. కాబట్టి  హ్యాపీగా నిద్రపోయాను....

**

“త్వరగా బ్రేక్ ఫాస్ట్  చేసి పనులు కానివ్వు.  ఇది నీ మొట్ట మొదటి ‘టాలెంట్ షో’ కాంపిటీషన్ .. స్కూల్ కి వెళ్ళే దారిలో టెంపుల్ కి వెళదాము,” అంటూ పొద్దున్నే నిద్ర లేపింది అమ్మ.

‘అవును, ఇవాళే ‘టాలెంట్ షో’ అనిగుర్తు చేసుకొని, కొంచెం నర్వస్ గా ఫీల్  అయ్యాను.

**

మేము వెళ్ళిన కాసేపటికి స్కూల్ ఆడిటోరియం కిక్కిరిసి పోయింది. ‘వేదిక’  పైన మొత్తం  ట్వెల్వ్  స్టూడెంట్స్  పర్ ఫాం చెయ్యాలి.  సాంగ్- డాన్స్- ఇన్స్ ట్రు మెంట్స్-పోయెట్రీ -రిసైటింగ్ డివిజన్స్ లో  ‘షో‘ జరుగుతుంది.

బయట ఇతర స్కూల్స్ నుంచి ‘జడ్జెస్’ వచ్చారని  చెప్పింది అమ్మ.

**

నా టర్న్ వచ్చింది... ‘వేదిక’ మీద అడుగు పెట్టి, ఒక్కసారి కిక్కిరిసిన ఆడిటోరియం వంక చూసాను..నర్వస్ గా అనిపించలేదు....హ్యాపీగా, ఎనర్జటిక్  గా  అనిపించింది..

నేర్చుకున్న దానికంటే, బాగా చెయ్యాలని,  కాన్ఫిడెంట్  గా  చేసాను.

**

ప్రోగ్రాం అవగానే,  ‘గంటలో విన్నర్స్  నేమ్స్ అనౌన్స్ చేస్తామంది మా మ్యూజిక్ మేడమ్. ఆ  బ్రేక్ లో, ఆర్కెస్ట్రా  క్లాస్  వాళ్ళ మ్యూజిక్ వింటూ, అమ్మ పక్కనే కూర్చున్నాను.

నేనే గెలుస్తానేమో!  గెలిస్తే ఏం చేయాలి.... లేదంటే నేను సెలెక్ట్ కానేమో!  అప్పుడేమి చెయ్యాలి...ఏడవ కూడదు...కానీ మరి బాడ్ గా ఫీల్ అవుతానుగా! ఇలా నాలో ఎన్నో ఆలోచనలు.....

**

మరి కాసేపటికి,  విన్నర్స్ ని అనౌన్స్ చేయడానికి, వేదిక పైకి వచ్చిన మా ప్రిన్సిపాల్ ని చూసి, నర్వస్  గా అనిపించి, గట్టిగా చెవులు మూసుకున్నాను.  అమ్మ నవ్వుతూ చెవుల మీద నుండి నా చేతులు తీసేసింది.

అన్ని డివిజన్స్ లో విన్నర్స్ ని అనౌన్స్  చేసాక, “డాన్స్ డివిజన్ విన్నర్స్ ఆర్ - నివేదిత పాల్ – ఫర్ - వెస్టర్న్ డాన్సింగ్, ఎండ్, చంద్రకళ మధురై - ఫర్ – క్లాసికల్ డాన్సింగ్,”  అని నవ్వుతూ, “గివ్  దీజ్  విన్నర్స్ ఎ బిగ్ అప్లాజ్,”  అంది మా ప్రిన్సిపాల్.

‘నేను నిజంగా  నా పేరు విన్నానా?’ అని నమ్మలేక పోయాను...

అందరూ చప్పట్లు కొట్టారు.  చాలా మంది నాకు ‘కంగ్రాచ్యులేషన్స్’ చెప్పారు.

**

‘టాలెంట్ షో’ విన్నర్స్ ఫోటోస్, మా స్కూల్ బులెటిన్ బోర్డ్ మీద పెట్టి, అసెంబ్లీలో మా గురించి గొప్పగా మెచ్చుకున్నారు  మా ప్రిసిపాల్  మేడమ్.

‘చెన్నై సెంట్రల్ యంగ్ టాలెంట్ ‘షో’  లో పార్టిసిపేషన్ గురించి మాకు పేపర్స్ అందించారు .... 

**

‘చెన్నై ‘షో’ కి, వాణీ మహల్ ‘వేదిక’ మీద పర్ ఫాం  చేసాను.  నా పర్ఫామెన్స్  చాలా బాగుందని మెచ్చుకుని, నన్ను  ‘చైల్డ్ ప్రాడిజీ’  అంటూ అనౌన్స్ చేసి, నాకు ‘ట్రోఫీ’  ప్రెజెంట్  చేసారు  ఆ  ఫౌండేషన్  వాళ్ళు.  అనుకోని  ఈ అవార్డు కి నేను, అమ్మ, నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము.

నాకైతే, ఉత్సాహంతో నిద్ర పట్టలేదు...

**

పొద్దున్న లేచేప్పటికి, అమ్మా నాన్న పేపర్ చదువుతున్నారు...న్యూస్ పేపర్స్ లో ‘చెన్నై టాలెంట్ షో’ రీవ్యూస్ వచ్చాయంది అమ్మ......‘సెవెన్ – ఇయర్ - ఓల్డ్ చైల్డ్ ప్రాడిజీ’ అంటూ నా ఫొటోతో పాటు నా డాన్స్ గురించి గొప్పగా రాసారట పేపర్ లో.. ‘కాళీయ మర్దనం’ ఎపిసోడ్ ని డాన్స్ కి ‘హై-లైట్ ‘ గా పేర్కొన్నారంట.

కన్నన్  చేత వేరే పేపర్స్ కూడా తెప్పించి నాకు చదివి చెప్పింది అమ్మ.

‘క్విక్  ఫ్లోయింగ్  సిల్వర్’  తో  పోల్చారట  నా  డాన్స్  స్టైల్  ని.  “అంటే, పాదరసంలా వేగంగా, చకచకా కదిలినట్టు డాన్స్ చేసావన్నమాట,” నాన్న నవ్వుతూ వివరించారు నాకు.

**

అమ్మ నాకు ‘డాన్స్ భాష’ లో ట్యూషన్  చెబుతానంది...  ప్రతి సండే ఓ గంటసేపు ఎలాగూ మా చేత తెలుగు  పద్యాలు, శ్లోకాలు చెప్పిస్తుంది.  తెలుగు చక్కగా మాట్లాడాలని  కూడా చెబుతూనే ఉంటుంది.“అదేంటమ్మా?”, ‘డాన్స్ భాష’ అని ఉంటుందా?” అడిగాను.

“ఉంటుందిగా మరి... - ‘ప్రేక్షకులు,  అభినయం,  లయజ్ఞానం, పాదాభివందనం, కరతాళధ్వనులు, హావభావాలు’ వంటి పదాలు ఇంకా మరెన్నో ఉన్నాయి,” అంది అమ్మ.వాటికి  అర్ధాలు  చెప్పడమే తన  డాన్స్-భాషా ట్యూషన్ అంది..

అలాగే కొన్ని ఇంగ్లిష్ మాటలకి కూడానట.

**

అన్నిరకాల యాక్టివిటీస్ తో, ఇంటిల్లిపాది బిజీగా  అయిపోయాము.... నాకు టైం ఉంటేనే పాట క్లాస్ కి వెళుతున్నాను.....ఎగ్జామ్స్  దగ్గిరైనప్పుడల్లా మాత్రం,  డాన్స్ - మ్యూజిక్ నుండి బ్రేక్ తీసుకుంటున్నాను.

శనాదివారాలు, బాబు – నాన్న ఆర్మీ-స్పోర్ట్స్ ఆక్టివిటీస్ లో పార్టిసిపేట్  చేస్తుంటారు.

నాన్న  ఫ్రెండ్ - భూషణ్ అంకుల్ వాళ్ళ స్టూడియో ఫంక్షన్స్ కి,  అమ్మవాళ్ళతో  తప్పక  వెళుతుంటాను..

స్కూల్ టాలెంట్ షో లో గెలిచి, మరో సారి కూడా  ‘చెన్నై యంగ్ టాలెంట్’  ట్రోఫీ గెలుచుకున్నాను. ‘గోవిందాశ్రిత  గోకుల బృందా’ అనే పాటకి అమ్మ  నేర్పిన  డాన్స్ చేసాను....

**

“మూడేళ్ళు  ఫాస్ట్ గా  గడిచిపోయాయి.  అప్పుడే  ఫోర్త్  స్టాండర్డ్  కంప్లీట్ అయిపోతుంది. వచ్చే వారం నుండి ఫైనల్ ఎగ్జామ్స్  చంద్రా నీకు,” అంది అమ్మ బ్రేక్ ఫాస్ట్ దగ్గర.

‘ఔను, మూడేళ్ళగా -చదువు, డాన్స్ పాఠాలు, స్కూల్ మ్యూజిక్ బాండ్ తో  ఉత్సాహంగా గడిచిపోతుంది. మా మ్యూజిక్ మేడమ్ నన్ను స్కూల్  సింగింగ్ గ్రూప్ లో పెట్టింది.  డాన్స్ క్లాస్లో అడుగులు - జతులు నేర్చుకొని ప్రోగ్రెస్ అవుతున్నాను’ .

నేను, తమ్ముడు కూడా స్కూల్లో మంచి మార్క్స్ తెచ్చుకుంటామని అమ్మ హ్యాపీ.

**

ఫోర్త్ స్టాండర్డ్ ఎగ్జామ్స్ అయ్యాయి.

పేరెంట్స్ డే, స్పోర్ట్స్ డే ఈవెంట్స్ లో పాల్గొన్నాను.  అన్నిట్లో  ప్రైజ్ లు కూడా గెలుచుకున్నాను.

నేను ఫిఫ్త్ స్టాండర్డ్ కి, తమ్ముడు అప్పర్ కే.జి కి వచ్చాము.  సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి.

నాన్న లీవ్ తీసుకున్నారు... వెకేషన్ కి గుంటూరు వెళుతున్నామంది అమ్మ.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్