Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
behind raasi voice

ఈ సంచికలో >> సినిమా >>

ప్రభాస్‌ చైనా యుద్ధాలు

china fights by prabhas

యాక్షన్‌ ఎపిసోడ్స్‌ విషయంలో టాలీవుడ్‌ దర్శక నిర్మాతలు, హీరోలు కొత్తదనం కోరుకుంటున్నారు. ఇందుకోసం ఇతర దేశాలకు చెందిన టెక్నీషియన్లను రప్పిస్తున్నారు. యాక్షన్‌ ఎపిసోడ్స్‌ విషయంలో పీటర్‌హెయిన్స్‌ సరికొత్త ఔట్‌ పుట్‌ ఇస్తున్నాడు ఇప్పటిదాకా. అయితే ఇంకో అడుగు ముందుకేసి, హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌ని రప్పిస్తున్నారు కొన్ని సినిమాల కోసం.

‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా కోసం ‘కిచా’ని రంగంలోకి దించారు. మనోజ్‌ ఓ సినిమా కోసం హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌ని వాడాడు. తాజాగా ‘బాహుబలి’ సినిమా కోసం రాజమౌళి చైనా వెళ్ళాడు. అక్కడి యుద్ధ కళల గురించి రాజమౌళి తెలుసుకుంటున్నాడు. వాటిని ‘బాహుబలి’లో వాడబోతున్నాడట రాజమౌళి.

సినిమా షూటింగ్‌ ప్రారంభమయ్యాక, యాక్షన్‌ ఎపిసోడ్స్‌ని ఎవరితో చేయించాలన్నదానిపై రాజమౌళి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశముంది. ప్రాచీన యుద్ధ కళల విషయంలో చైనాకి ప్రత్యేకమైన గుర్తింపు వుంది. ఆ యుద్ధకళల్ని హీరో ప్రభాస్‌ చేయాల్సి వుంటుందిప్పుడు ‘బాహుబలి’ కోసం.

‘మగధీర’ సినిమాలో కత్తి యుద్ధాలు.. ప్రత్యేకించి వందమందితో రామ్‌చరణ్‌ చేసే యుద్ధం.. ఆ సినిమాకే హైలైట్‌ అని చెప్పొచ్చు. మరి, ‘బాహుబలి’ కోసం రాజమౌళి, ప్రభాస్‌తో చేయించబోయే చైనా పోరాటాలు ఎలా వుంటాయో.!

మరిన్ని సినిమా కబుర్లు
collections for satire movie