Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscope 22nd may  to 28th may

ఈ సంచికలో >> శీర్షికలు >>

పద్యం-భావం - సేకర్త : సుప్రీత

 వేమన పద్యం

 

అల్పుడెపుడు పల్కు ఆడంబరముగాను
సజ్జనుండు పల్కు చల్లగాను
కంచుమ్రోగునట్లు కనకంబు మ్రోగునా
విశ్వదాభి రామ వినుర వేమ. 

 

తాత్పర్యం

నీచుడు చెడ్డవాడు ఎప్పుడూ ఆడంబరముగా మట్లాడుతారు, మంచివాడు ఎప్పుడూ మంచి మాటలే మాట్లాడుతాడు, కంచు మ్రోగినట్లు బంగారం  మ్రోగదు కదా.  

విశ్లేషణ

చెడ్డవాళ్ళు ఎప్పుడు మనిషి మనస్సు కష్టపెట్టేలాగా మట్లాడుతారు. మంచివాళ్ళు మంచి మాటలు మాట్లాడుతూ ఎదుటి వారి మనస్సు ఆహ్లాదంగా ఉంచుతారు. కంచుకి మోత ఎక్కువ విలువ తక్కువ చెడ్డవాడి లాగ. అదే విధంగా బంగారానికి విలువ ఎక్కువ మోత తక్కువ మంచివాడిలాగ అని ఈ పద్యం లో నీతి. 

దాశరధీ పద్యం

పదయుగళంబు భూగగన్ భగములన్ వెననూని విక్రమా
స్పదమగు సబ్బలీంద్రునొక పాదమునము దలక్రిందనొత్తి మే
లొదవజగత్ర్వయంబు బురుహూతుంకియ్వయ వటుండవైన చి
త్సదలమూర్తి వీవెకద దాశరధీ కరుణాపయోనిధీ.
 

తాత్పర్యం  

ఓ రామా ఇంద్రభోగములనునభవించినా ఆశ కి అంతు ఉండదు. మేరు పర్వతమంత ఆస్తి ఉన్నా కూడా ఒక్క కాసు కూడా వెంట రాదు. తెలిసీ తెలియక చేసిన పాపములు మాత్రము     వదలవు. మరుజన్మ నిష్తపడని నన్ను నా కర్మానుభవమును నాశనము చేసి రక్షింపుము. 

విశ్లేషణ 

కొంత మంది మనిషులకి అన్నిటికన్నా డబ్బే ముఖ్యం . ఎంత డబ్బు సంపాదించినా ఇంకా ధన దాహం తీరదు.ఆశ కి అంతు ఉండదు కొందరు మితిమీరిన ఆశ తో తప్పుడు మార్గమో నడుస్తూ కూడా డబ్బు సంపాదిస్తారు. మనకి మేరు పర్వతం అంత ఆస్తి ఉన్నపటికినీ కూడ మనిషి పోయినప్పుడు ఒక్క కాసు కూడా వెంట రాదు. మనతో వచ్చేది మన కర్మ మత్రమే మనం చేసిన పాప పుణ్యాలు. మనం చేసిన పాపం మళ్ళి జన్మ నెత్తి అనుభవించాలి ఓ రామ నాకు మరు జన్మ అక్కర్లేదు నా పాపాలని నాశనం చేసి నన్ను రక్షించు అని ఈ పద్యం లో నీతి .

సుమతీ శతకం

లావుగలవానికంటెను
భావింపఁగ నీతిపరుఁడు బలవంతుండౌ
గ్రావంబంత గజంబును
మావటివాఁడెక్కినట్లు మహిలో సుమతీ!


తాత్పర్యం 

పెద్ద పర్వతమంటి ఏనుగుకంటే చిన్నవాడైన మావటి లోబరుచుకుని ఎక్కుచున్నాడు కనక మావటి గొప్పవాడు. అలాగే శరీరబలం కలవాని కంటే బుద్ధిబలం కలవాడే నిజమైన బలవంతుడు.

విశ్లేషణ

కొంతమంది మనుషులకి శరీరం దృడం గా ఉంటుంది కాని మనసికంగా బలహీనులు , చురుకుగా ఉండరు. వారికున్న శారిరక బలంతో విర్ర వీగుతారు . కాని నిజానికి శరీరక బలం కలవాడి కంటే , బుద్ది బలం కలవాడు నిజమైన బలవంతుడు ఎందుకంటే ఏనుగు ఎంత బలమైనదైనా , శరీరం ఎంత దృడంగా ఉన్నా మావటి వాడు దానిని లోబరుచుకుంటాడు. మావటి వాడికి ఎనుగు లొంగిపోవాల్సిందే అందుకే బుద్దిబలమే గొప్పది అని ఈ పద్యం లో నీతి .

మరిన్ని శీర్షికలు