Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
naa preyasini pattiste koti

ఈ సంచికలో >> సీరియల్స్

వేదిక

జరిగిన కథ : ప్రతియేడూ లాగానే ఈసారి కూడా అందరూ కలిసి తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తారు. అక్కడ చంద్రకళకి మెడలో హారం వేస్తుంది అత్తయ్య. ఇంటికెళ్ళాకా చంద్రకళ డాన్స్ ప్రోగ్రాం తాలూకూ పేపర్ కవరేజ్ చూపిస్తారు భూషణ్ అంకుల్. రాణి చాలా స్నేహంగా మెలుగుతుంది....ఆ తర్వాత...

క్లాసు నుండి ఇంటికొచ్చాక   కళ్ళు తిరిగినట్టయ్యి,  ఎన్నడూ  లేని తలపోటుతో  సోఫాలో కూర్చుండిపోయాను.  అమ్మ మందు వేసి,  పాలు  తాగించి  పడుకోబెట్టింది.

**

ఆ మరునాడు అస్సలు కదలలేక పోయాను.  వొళ్ళంతా వేడిగా ఉంది. వెంటనే నన్ను ఆర్మీ హాస్పిటల్ కి తీసుకువెళ్ళారు. నాకసలు ఆ తరువాత ఏమయిందో తెలియదు.

**

కళ్ళు తెరిచేప్పటికి, హాస్పిటల్లోనే ఉన్నాను.  అమ్మ దగ్గరగా వచ్చి, “ఏమ్మా,  పెద్ద జ్వరం రా నీకు.  వైరల్  ఫీవర్ అంట.  ఇవాళ  మూడో రోజు.  నీరసించిపోయావమ్మా  చిట్టితల్లీ నువ్వు,” అంది అమ్మ.

నాకు మాత్రం తేలికగా, బాగానే ఉన్నాననిపించింది.  ఆ సాయంత్రమే హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చేసాను.

**

మా మాస్టారుగారు  వచ్చి  నన్ను చూసి వెళ్ళాక,  భూషణ్ అంకుల్, ఆంటీ వచ్చారు.

“ఏమ్మా, కళా,  హాస్పిటల్లో  రెండు  రోజుల క్రితం  కంటే,  ఇవాళ ఫ్రెష్ గా ఉన్నావు. నీకెప్పుడు  పూర్తి  ఓపిక  వస్తే  అప్పుడే  జెమిని  టి.వి. వారి ఇంటర్వ్యూ చేసేద్దాము.  డాన్స్ షూట్ కి మాత్రం  మరో  వారం  టైం  అడుగుదాము..  కాబట్టి బాగా తిని త్వరగా కోలుకో,” అన్నారు

అంకుల్.“వారంలోగా పూర్తిగా కోలుకుంటుంది... మీ షెడ్యూల్ ప్రకారమే చేద్దాం.  మీకు మాట రానివ్వదు లెండి మా చంద్రకళ.  నేను భరోసా,” అంది అమ్మ నవ్వుతూ..

“ఎల్లుండి శనివారం పొద్దున్న,  నేను మిమ్మల్ని మా గురువుగారు వద్దకు తీసుకువెళతాను. ...ఈ సమయంలో చంద్రకళకి అయన బ్లెసింగ్ అవసరం... అదీ కాక, కళకి బాగా దిష్టి తగిలింది....ఆయనే అవన్నీ చూస్తారు... ఆయన చాలా మహత్తున్నవాడు.  మామూలుగా అయితే,  ఎక్కడెక్కడి  వాళ్ళకైనా  ఆయన్ని  చూడాలంటే  అసాధ్యం.... మనకి యేళ్ళగా  తెలుసును  కాబట్టి  వెళ్ళగలం..... నిజానికి అయన ఓ ముస్లిం – ‘మస్తాన్ వలి’ అని,”  అన్నారు అంకుల్....

**

సరీగ్గా స్కూల్ రి-ఓపెన్ కి ముందు, మా జెమిని టి.వి ప్రోగ్రాం బాగా జరిగింది.  ఇంటర్వ్యూలో మా చదువులు, గురువులు, తల్లి తండ్రుల గురించి అడిగారు.  మా ఫ్యూచర్ ప్లాన్స్ గురించి అడిగారు.  నేను మంచి కూచిపూడి డాన్సర్ అవుతానన్నాను.  రాణి తానొక గొప్ప సింగర్ అవుతానన్నది.

మా ఆ ఇంటర్వ్యూ  జెమిని వారు ఇంచుమించు రోజుకోమారు టెలికాస్ట్ చేస్తున్నారు..

**

స్కూల్  రీ-వోపెన్  అయిన సెకండ్ డే,  నన్ను, రాణీ ని అసెంబ్లీలో అందరి ముందుకి పిలిచి, ‘స్కూలుకే ఎంతో పేరు తెచ్చిన టాలెంటెడ్ యంగ్ టీన్స్’ అంటూ, మా గురించి స్పెషల్ మెన్షన్ చేసారు, మా ప్రిన్సిపాల్.  స్కూల్లో  మా టి.వి ఇంటర్వ్యూ  చూసిన  ఫ్రెండ్స్, టీచర్స్ నాకు కంగ్రాచ్యులేషన్స్  చెప్పారు.

**

రీసేస్ టైములో, క్లాస్ నుండి బయటకి రాగానే,  రాణి నా వద్దకు పరిగెత్తుకొచ్చింది.

“కళా, నిన్న జగదీష్ తో చాలాసేపు మాట్లాడాను.   నా దగ్గరున్న వీడియో  గేమ్స్, తన దగ్గరున్నవి  కంపేర్  చేశాము.  రేపు తన బర్తడే కదా!   కొత్తగా రిలీజ్ అయిన గేమ్స్, జగదీష్ కి  బర్తడే  గిఫ్ట్ గా పంపాను,” అంది సంతోషంగా.

‘ఢిల్లీ తిరిగి వెళ్ళాక, ఈ పది రోజుల్లో, అత్తయ్య  అమ్మతో  రెండు సార్లు  మాట్లాడి  ఉండచ్చు గాని,  జగదీష్  నాతో మాట్లాడలేదే?’  అనుకున్నాను.

“అవునూ, మస్తాన్ సాబ్  నిన్ను  బ్లెస్  చేసి, తావీజు ఇచ్చారటగా...అది వేసుకుంటున్నావా?” అడిగింది రాణి...

“ఆ... అమ్మ వాళ్ళకి  ఆయన  మీద  బాగా  నమ్మకం వచ్చింది... అమ్మ దాన్ని లాకెట్ గా వేసింది,” అన్నాను...

“అలా ఆయన బ్లెస్ చేసిన వాళ్ళు పెద్ద స్టార్స్ అయ్యారట కూడా......నీవేమన్నా స్టార్ అవ్వాలనుకుంటున్నావా?  లేక మాలాగా స్టూడియో కడతావా? సినిమాలు తీసి మిలియనేర్ అవ్వాలనా?” నన్ను సూటిగా చూసింది రాణి... ఏమనాలో తెలియక తల దించుకున్నాను...

“మరి డాడీ ఎందుకు నిన్ను ఆయన వద్దకు తీసుకెళ్ళినట్టు?  నీ మీద మా డాడీకి ఎక్కడలేని ఇంట్రెస్ట్,  సిల్లీ.... హి ఇజ్ టూ కైండ్ .....ఏమంటే నీలో మంచి టాలెంట్ ఉందంటారు...,”  ఇంకా తను ఏదో అనబోయే లోగా, రీసెస్ బెల్ నన్ను కాపాడింది...

**

ఇంటికెళ్ళాక  అమ్మకి  చెప్పాను,  మరునాడు జగదీష్  బావ  బర్తడే  అని.  అంతకు మించి రాణి అన్న  మాటలేవీ  చెప్పదలుచుకోలేదు.

“అవునా?” వాడికి  పద్దెనిమిదేళ్ళు  నిండుతాయి,  నీకంటే  నాలుగేళ్ళు  పెద్ద.  ఈ డిసెంబర్లో  నీకు  పద్నాలుగు  నిండుతాయి కదా,” అంది అమ్మ.

బాక్-పాక్  గదిలో  పెట్టి  డాన్స్ క్లాస్స్ కి  రెడీ అవుతుండగా,  “త్వరగా వచ్చి ఏమన్నా తిని, హార్లిక్స్ తాగి, క్లాస్ కి వెళ్ళు,”  పిలిచింది  అమ్మ

డైనింగ్ వద్ద, బాబు హార్లిక్స్ తాగుతూ,  ఏదో  లావుపాటి పుస్తకం చదువుతున్నాడు.  వాడు  ఎప్పుడూ ఏదో బుక్ చదువుతూనే ఉంటాడు.  వెళ్ళి  వాడి  పక్కనే కూర్చున్నాను.

“చంద్రా,  తేజ టి.వి వాళ్ళు ఫోన్ చేసారు.  ‘అన్నమయ్య సంకీర్తనం’  అనే వాళ్ళ ప్రోగ్రాములో  నిన్ను డాన్స్ చేయమని అడిగారు.   మాట్లాడి రేపు ఫోన్ చేస్తాన్నాను,”  చెప్పింది అమ్మ.

“అయితే, ‘చక్కని తల్లి’ డాన్స్ చేస్తానమ్మా.  అది కాక నీఇష్టం,”  అని అమ్మకి చెప్పి,  పుస్తకం  చదువుతున్న  బాబు వంక  తిరిగాను.

“ఏం చదువుతున్నావు?”  అడిగాను వాడ్ని.

పుస్తకలోకంలో ఉన్న వాడికి నా మాటే వినబడలేదు.

“అరేయ్  వినోద్, మరీ  చదవకు,  కళ్ళు పాడయిపోతాయి,”  అంటూ వాడి చెవి పిండి,  హార్లిక్స్ మాత్రం తాగేసి, డాన్స్ క్లాస్ కి వెళ్ళిపోయాను.

**

మరునాడు  బ్రేక్ఫాస్ట్  దగ్గర  తేజ టి.వి ప్రోగ్రాం  విషయం ఎత్తింది అమ్మ.  “మూడు ఐటమ్స్ చేయమన్నారు.  ‘చక్కనితల్లి,  బ్రహ్మమొక్కటే, చిరుతనవ్వులవాడు’ చేయవచ్చు.  నీవు కొరియాగ్రాఫ్  చేసుకున్న  ఐటెం  ‘చక్కని తల్లి’  చేయడానికి మంచి అవకాశం.  పది రోజుల్లో కాల్ షీట్ ఉంటుందన్నారు,” అంది.

“ఇవాల్టి నుండే ప్రాక్టీస్ చేస్తా,  కొత్త కాస్ట్యూమ్స్ కావాలమ్మా.  కృష్ణని రమ్మను,” అన్నాను.

“షూట్ షెడ్యూల్ చేసాక చెప్పు.  లీవ్ తీసుకుంటా,” అన్నారు నాన్న.

గబుక్కున జగదీష్ బర్త్ డే గుర్తొచ్చింది.

“అమ్మా జగదీష్  బావకి  ఫోన్  చేయనా? బర్తడే విషెస్ చెబుతాను,”  అడిగాను.

లేచి ఫోన్ చేసింది అమ్మ.

అత్తయ్యతో మాట్లాడింది.  “అవునా, ఏమిటో  మరి!  ఇద్దరూ  పోటీ  పడుతున్నారా  వాడ్ని  విష్  చేయడానికి?  బాగుంది.  చంద్ర  స్కూల్ కి వెళ్ళబోతుంది.  వాడ్ని పిలువు వదినా.  విష్  చేసి  వెళుతుంది,” అంటూ ఫోన్ నాకిచ్చింది.

“జగదీష్ బావ, హాపీ బర్తడే,” అన్నాను.

“హాయ్ చంద్రా, థాంక్స్.  ఈ బర్తడే కొంచెం స్పెషల్ అంటుంది మమ్మీ...పొద్దున్నే, రాణి, ఇప్పుడు నువ్వు  విష్  చేసారని.  ఇప్పటివరకు నాకు ఇలా ‘అమ్మాయిలు’  ఫోన్ చేసి విష్ చేయలేదు మరి,”  నవ్వాడు జగదీష్.  “మళ్ళీ  చేస్తాను.  స్కూల్ కి టైం అయింది,” అన్నాడు.“

ఓకే, నాక్కూడా,” ఫోన్ అమ్మకిచ్చాను.

**వారం రోజులు ప్రాక్టీస్ చేసి, తేజ టి.వి. కి మొత్తం నాలుగు ఐటమ్స్ చేసాను.  బాగా వచ్చిందన్నారు.  అమ్మ చేతికి ‘పారితోషికం’ అంటూ కవర్ అందించారు.

**

‘తేజ’ టి.వి లో నా డాన్సస్ టెలికాస్ట్ అయినప్పుడల్లా,  చూసిన స్కూల్ మేట్స్  నాకు కంగ్రాచ్యులేషన్స్ చెబుతూనే ఉంటారు.

‘షూట్  అయ్యి  అప్పుడే ఆరు నెలలవుతున్నా,  వారానికి  ఒకసారైనా  ఏదో ఒక సందర్భంలో నా ఐటమ్స్ ఇలా టెలికాస్ట్  అవుతూనే ఉండడం బాగుంది’ అనుకుంటాను.....

**

ఎగ్జామ్స్ కి చదువుకోవాలని పొద్దున్నే లేచాను. హాల్లో నుండి టి.వి వినబడుతుంది.  మామూలుగా  అమ్మ పొద్దున్నే టి.వి పెట్టదు.  అదీ అంత వాల్యూమ్?

హ్యాపీ బర్తడే టు చంద్రకళ’ అని అనౌన్స్మెంట్ వినబడింది.

ఇవాళ డిసెంబర్  ట్వెల్త్, నా బర్తడే. 

టి.వి లో నా డాన్స్ ఐటమ్  టెలికాస్ట్  చేస్తున్నారు.  పరుగున  హాల్లోకి రాబోయాను.

డోర్-వే లో నవ్వుతూ అమ్మ నిలబడి ఉంది...నన్ను హగ్ చేసి ‘హ్యాపీ బర్తడే’ తల్లీ” అంది....

“ఇవాల్టి టెలికాస్ట్ మాత్రం, నేను రిక్వెస్ట్ చేసానురా,” అంది అమ్మ....

అమ్మ వెనుకే నాన్న, బాబు కూడా ఉన్నారు....నన్ను విష్ చేసారు...

ఇంతలో ఫోన్ రింగ్ అవడంతో, అందరం హాల్లోకి వచ్చాము. 

మణత్తయ్య ఫోన్...జగదీష్ కూడా నాకు విషెస్ చెప్పాడు

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
deathmistery