Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kekisalu

ఈ సంచికలో >> కథలు >> దటీజ్ స్వాతి

that is swati

నిన్ను..కత్తితో కాకుండా కంటి చూపుతో చంపేయాలనుందే..ఇదేమన్నా సతీ సావిత్రి యుగమా. సతీ సుమతి కాలమా..ఆ డర్టీ గూస్ గాడి పెళ్లికి..ఈ ప్రెట్టీ గూస్ చందనా చీర బొమ్మనా బ్లౌజుతో తయారవడం.. నీకసలు సిగ్గూ శరం లజ్జ అభిమానంలాంటి వేమైనా వున్నాయా..?" ఉడికి పోతూ అడిగింది సౌమ్య..డ్రస్సింగ్ మిర్రర్ ముందు తన అందాన్ని చూసుకుంటూ తయారవుతున్న స్వాతిని..చూస్తూ మండిపోతూ.. “ఆందంగా లేనా..ఈ చీరా జాకెట్లో.. ఆసలేం బాలేనా” ..మిశ్చివస్ గా అడిగింది మరింత రెచ్చగొడతూ..

“మాట మార్చకు..తిక్క రేగిందంటే తొక్కలో ఫ్రెండని కూడా చూడ్ను..లవ్వు పేరు చెప్పి ఇంత కాలం నీతో చెట్టా పట్టాలేసుకు తిరిగి ..కక్కిన కూడు లాంటి కట్నానికి కక్కుర్తి పడి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటుంటే..పీక పిసికి చంపేయాల్సింది పోయి..ఆ పుండా కోరు గాడి పెళ్లికి పట్టు చీర కట్టుకుని ..ప్రెండ్స్ అందర్నీ వెంటేసుకుని మరీ బయలు దేరుతున్నావ్..నిన్నేమైనా పిచ్చి కుక్క గాని కరిచిందా..మెంటలేమైనా ఎక్కిందా..”ఫ్లే రఫ్ అయిపోతున్న సౌమ్యను ఓరకంట చూస్తూ.“నా జడ బాగుందా..క్లిప్.. శారీకి సూటయ్యిందా.”. కావాలని మరింత రెచ్చగొడుతున్నట్లు చిరునవ్వుతో చూస్తూ చిద్విలాసంగా అడిగింది అద్దానికి అతుక్కు పోతూ.

“నీ ఎంకమ్మ..రెచ్చగొట్టావంటే..డెమ్మ..డెక్క..డాలీ..బూతులొచ్చేస్తాయ్..పిచ్చెక్కి పోయి కేరాఫ్ వైజాగ్ అయిపోతావ్..దాదాపు రెండేళ్లు నీ అందాన్నీ  ఆదాయాన్ని కూడా అంట నాకేశాడు కదే అంట్ల వెధవ..మీ డాడీ కడుపు కట్టుకుని కట్నం కూడా యిస్తానన్నారు కదా.. మరి వీడికిదేం రోగం. అమెరికా జాబ్ వచ్చింది కదా అది చూపించుకుని సంతలో పశువులా ఎక్కువ ధరకు అమ్ముడు పోయుంటాడీ పశువు..నేనప్పుడే చెప్పాను . ఇది మల్లీశ్వరి కాలం కాదు..కొవ్వు తప్ప లవ్వు లేదని.. ఎన్నో సార్లు మొత్తుకున్నాను.. నన్నో పిచ్చిదావిలా చూశావ్..సరే..అదంతా అయిపోయిన ఛాఫ్టర్ అన్నావు.. వదిలేశావ్..మరి ఇప్పుడు మళ్లీ పిచ్చి దానిలా బిహేవ్ చేస్తున్నావ్..నిన్నెలా అర్దం చేసుకోవాలో అర్దంగాక చచ్చిపోతున్నాను.” చీదేసివ సినిమాకు సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేద్దామన్న డైరెక్టర్ ని చూసిన ప్రొడ్యూసర్ లా ముఖం పెట్టేసింది సౌమ్య.

“అలికి ముగ్గులేస్తే అట్ల తద్దె అయిపోతుందా..? కార్డులు ప్రింటైనంత మాత్రాన..కల్యాణమై పోయినట్లేనా?..బిట్వీన్ సిప్ అండ కప్ మిలియన్స్ ఆప్ స్లిప్స్..ఈ సోదంతా ఎందుకే సౌమ్యా..ఎక్స్ ఎంపీ గారమ్మాయట బ్రైడ్..ఒకటేమిటి  వంద ఐటమ్స్ వుంటాయ్..కుమ్మేద్దాం అంతే..అయినా నాకో డౌట్..ఏ సూరేకాంతమో ,ఛాయా దేవో పెట్టకుండా నీకు సూట్ కాని సౌమ్యెందుకు పెట్టార్రా బాబో”!

డ్రమెటైజ్ చేసింది..స్వాతి.. అది తెచ్చి పెట్టుకున్నబింకమని అర్దం చేసుకున్న సౌమ్య  మూగదై పోయింది.

******

ఫంక్షన్ హాల్ చాలా రిచ్ గా హుందాగా వుంది. అప్పటికే కార్యక్రమం మొదలై పోయింది. స్వాతి తన ప్రెండ్సితో ఓ మూల సెటిలై పోయింది.
“అలంకరించిన దున్నపోతులా ఎలా వెలిగి పోతున్నాడో చూడవే..నీ మాజీ. “.కామెంట్ చేసింది సౌమ్య..స్వాతి ముఖంలోకి చూస్తూ.
“ మనకెందుకే అవన్నీ..వచ్చామా..తిన్నామా..వెళ్లామా..దట్సాల్”. సినిమా డైలాగ్ చెప్పి..వెయిటర్ అందించిన కూల్ డ్రింక్ సిప్ చేస్తూ.” .సినిమాని ఎంజాయ్ చెయ్యి తల్లీ..కోతి ముఖం హీరోల్నికడుపులో తిప్పుతున్నా భరిస్తున్నాం..ఇది ఫ్రివ్యూ ..ఫ్రీవ్యూ..హీరో నచ్చకపోతే హీరోయిన్ని దేఖ్..” పొంతన లేకుండా సినిమా కబుర్లు చెప్తున్న స్వాతిని అదోలా చూస్తూ..దీని కివ్వాళ ఏదో అయ్యింది..అని కన్ ఫం చేసేసుకుంది..సౌమ్య.

సర్వాలంకార భూషితైన పెళ్లి కూతురిని ముత్తైదువలు తీసుకొచ్చారు .

“వావ్..హీరోయిన్ ..సూపర్ “..సౌమ్య చెవిలో గుసగుసలాడేసింది స్వాతి.
“నీకన్నా కాదులే..ఔనూ అదేంటి..పెళ్లి మంటపానికెళ్లాల్సిన లావణ్య ఇటొస్తోంది.” ?.స్టేజి ముందుకొస్తున్న పెళ్లి కూతుర్ని వింతగా చూస్తూ కామెంట్ చేసింది సౌమ్య.

“కేట్ వాకేమోనె..అద్దిరి పోయింది కదా..విజిల్ కొట్టవే ఓసారి.”.గడ్డం పట్టేసింది..
పౌడర్ ఫేస్ పెట్టేసింది..సౌమ్య.
హుందాగా స్టేజ్ ముందుకొచ్చిన పెళ్లి కూతురు చేతిలోకి ఎఫ్ ఎం మైకు తీసుకుంది.  .ఒక్క సారిగా శబ్దం గడ్డ కట్టుకు పోయింది..మంత్రాల శబ్దం కూడా మూగబోయింది..
“ఆహుతులందరికీ నా నమస్కారాలు..నాపేరు లావణ్య..ఫెళ్లి కూతుర్ని..జరగబోయే పెళ్లిని మీరెలాగూ చూస్తారు..మేరేజెస్ ఆర్ మేడిన్ హెవెన్ ఆంటారు..నాపెళ్లి మాత్రం యిక్కడే ఓ మేరేజ్ బ్యూరో వాళ్ల ద్వారా ఫిక్స్ చేయబడింది..ఒక నాడు మా డాడీ చెప్పారు..నీకో మంచి సంబంధం చూశాను..అబ్బాయిది ఈ ఊరే  ..సాఫ్ట్ వేర్ ఇంజినీర్  ..అమెరికాలో జాబ్..నువ్వు ..స్కైప్ లో మాట్లాడు..ఫేస్ బుక్ చూడు..నువ్వు ఓకే అంటే మిగతా విషయాలు నేను చూసుకుంటానన్నారు..ఓ సగటు ఆడపిల్లకి..ఇంత కంటే ఏంకావాలి చెప్పండి..సరే అన్నాను. అలా ఫిక్సయ్యింది ఈ మేరేజ్ . కంప్యూటర్ సైజు కార్డులేయించి ..ఎక్స్  ఎంపీ లెవెల్లో వూరంతా పంచేశారు..ఎటు చూసినా ఆనందమే..మేఘాల్లో తేలిపోతున్న నాకు..వూహించని ఓ పిడుగు పాటు ..”

ఒక్కసారిగా మూగదైపోయింది లావణ్య..ఆహుతులంతా అయోమయంలో పడిపోయారు. వెంటనే తేరుకుంది  లావణ్య..” ఆరోజు మెహందీ ఫంక్షన్ లో..నా  ఫోన్ కో మెయిలొచ్చింది..ఓపేన్ చేశాను..ఒక చిన్న లెటర్ ..దయచేసి వినండి..” తన సెల్ ఫోన్ ఓపెన్ చేసి..చదవడం మొదలు పెట్టింది.

పెళ్లి కొడుకు తరఫు వాళ్లు గొడవ చెయ్యబోతే అప్పటికే అలర్టయిన పోలీసులు అదుపు చేసేశారు.
“మిస్  లావణ్యా..కంగ్రాచ్యులేషన్స్ ..నీ కాబోయే .. వరుడు గోపీ... నేనూ టూ యియర్స్ నుండీ లవ్ లో వున్నాం..మా అమ్మా నాన్నా కట్నాలకాశపడే టైపని బీదరుపు లేడిస్తే మా డాడీని కట్నం యిచ్చేందుకు కూడా ఒప్పించాను..పెళ్లికి డేట్  ఫిక్సు చేసుకొస్తానని వెళ్లిన వాడు ముఖం వేలాడేసుకు వచ్చి..కాళ్లు పట్టుకుని కహానీలు చెప్పబోయాడు .అవసాన దశలో వున్న తన తల్లి కోరిక తీర్చడం కోసం కాన్ట్ బట్ పొజిషన్ లో కమిటయ్యా నన్నాడు..బాస్టర్డ్ ..అధిక ధరకు అమ్ముడు పోయాడని అర్దమై పోయింది. ముఖం మీద ఉమ్మేసి పొమ్మన్నాను..ఇలాంటి” నీచ్ కమీన్ కుత్తే గాడి నా”  నేను లవ్ చేసిందని ..సిగ్గుతో చితికి పోయాను..రేపు నీతో పెళ్లయ్యాక మరో తండ్రి ఎక్కువ కట్నం ఆశ చూపితే వీడి అమ్మా నాన్నలు నిన్నుఏ పెట్రోలో కిరోసినో పోసి డెఫినెట్ గా చంపేస్తారు. ఐ స్వేరిట్ . నా ఫేస్ బుక్ చూడు..నా మెయిల్ ఐడి పాస్ వర్డ్ లు యిస్తున్నాను.. నా మెయిల్ ఓపెన్ చేసి చూడు  ..మా భాగవతం బట్ట బయలౌతుంది. మీ నాన్న గారికున్న ఇన్ ప్లూయెన్స్ తో ఎంక్వైరి చేయించు.. ఈ ఫ్యామిలీ బతుకు మీకే అర్దమవుతుంది..బెస్టాఫ్ లక్..” ఆ లెటర్ మా డాడీకి చూపించా..    
“ఇఫ్ ఇటీజ్ ట్రూ ఐ విల్ సీ దైర్ ఎండ్ అన్నారు.” ఎంక్వైరీ చేయించారు..ట్రూ అని కన్పం ఆయ్యింది. నేను ప్రజల కోసం బ్రతికిన వ్యక్తిని..వీడి ప్యామిలీ కి ఏ ఆడ పిల్లా బలి కాకూడదు..వీడి ఫ్యామిలీలో మరో యిద్దరు పెళ్లికెదిగిన పశవులున్నాయని తెలిసింది ..ఓ పది లక్షలు ఖర్చనుకుందాం..మన బంధువులకి విందిచ్చామనుకుందాం..కనీసం మన బంధువులనైనా హెచ్చరించిన వాళ్లమవుదాం ..చివరి నిమిషం వరకు లీక్ కాకూడదు..నీ జీవితంతో బాటు మరో యిద్దరు ఆడ పిల్లల జీవితాల్ని కాపాడిన ఆ అమ్మాయిని మర్చిపోకు..” అన్నారు. మోస పోయిన స్వాతికి ఫోన్ చేసాను..ఆ వెధవ ముఖం చూడను గాక చూడనంది.. విషయం వివరించాను.పబ్లిక్ స్టేజి మీద ఆ పశవును  అయిదు నిమిషాలు తనకు అప్పగించాలన్న షరతు మీద వస్తానంది..వచ్చింది..ప్లీజ్ కం స్వాతీ !” అంటుంటే .. ఫస్ట్ షాటుకు ఉవ్విళ్లూరుతున్న బ్రాండ్ న్యూ హీరోయిన్ లా దిగ్గున లేచి సౌమ్యను చిలిపిగా చూసి కొంటెగా కన్నుకొట్టి పెళ్లి మంటపం మీదికి దూసుకు పోయింది స్వాతి.. ద రెబల్ హీరోయిన్ ఆఫ్ ద ఫంక్షన్.

స్వాతినలా చూస్తూనే.. పెళ్లి కొడుకు షివరై పోతే..వాడి కుటుంబ సభ్యులు భూకంపాన్ని కళ్లారా చూసిన నేపాలీల్లా..వణికిపోయారు .
ఎదురొచ్చి  ఎక్స్ ఎంపీ చలపతిరావు గారు స్వాతిని అక్కున చేర్చుకున్నారు..లావణ్య  స్వాతిని కౌగిలించేసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టేసి.. డాడీని చూస్తూ..

“డాడీ మాతో కేసు పెట్టిస్తారో..వాడి పాస్ పోర్టు సీజ్ చేయిస్తారో అప్ టు యు.. అమ్మాయిల జీవితాలతో  ఆడుకునే ఇలాంటి మృగాళ్ల కుటుంబాలమ సభ్య సమాజం భహిష్కరించాలి..అదీ వీడి  కుటుంబంతోనే మొదలవ్వాలి. ఆహుతులందరినీ చేతులు జోడించి వేడుకుంటున్నాను.. అమ్మా నాన్నలు అమ్మాయిలకు పెళ్లి చేయడమే తమ జీవితాశయంగా ఫీలైపోతున్నారు..దానిని నేను తప్పు పట్టడం లేదు..సంబంధం కలుపుకునే ముందు తర తరాల వంశ చరిత్రలు చూడలేకపోయినా..కనీసం ఇరుగూ పొరుగూనైనా ఎంక్వైరీ చేయండి  ..ఇటువంటి కొజ్జా కుటుంబాల గురించి కనీసం హింటైవా దొరుకుతుంది ..కమీషన్ల కోసం క్కుర్తి పడే మ్యారేజ్ బ్యూరోలను గుడ్డిగా నమ్మకండి... స్వాతికి నేను వాగ్దానం చేశాను..ఈ కుక్కను ఓ అయిదు నిమిషాలు సరెండర్ చేస్తానని..నౌ టైం హేజ్ కం.”.అంటూనే బిక్క చచ్చి పోయ నిలబడున్నపెళ్లి కొడుకు జుట్టు పట్టుకుని లాక్కొచ్చి స్వాతి ముందు నిలబెట్టింది.

అంతే..భద్రకాళిలా మారిన స్వాతి కాలి చెప్పు తీసి..దవడ పళ్లు రాలేలా బాదేసింది.

కల్యాణ మంటపం ఆహుతులు కొట్టిన చప్పట్లతో కమనీయమై పోయింది.

మరిన్ని కథలు
avagahana