Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
humour interview

ఈ సంచికలో >> శీర్షికలు >>

వెజ్ బిర్యానీ. - -పాలచర్ల శ్రీనివాసు

వెజ్ బిర్యానీ.


కావాల్సిన పదార్థాలు.
బియ్యం మూడు గ్లాసులు, కూరగాయల ముక్కలు, నీళ్ళు నాలుగున్నర గ్లాసులు, నూనె, ఉప్పు, తగినంత. పచ్చిమిర్చి రెండు లేదా మూడు. పలావ్ ఆకులు రెండు. గ్రైండ్ చేసిన యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క పొడి. అల్లం-వెల్లుల్లి పేస్ట్.

తయారు చేయు విధానం :
చాలా సింపుల్ గా చేసే వెజ్ బిర్యానీ ఇది. యాలకులు , లవంగాలు, తినేప్పుడు అడ్డొస్తాయని చాలామంది అంటూంటారు. అందుకని, అవి లేకుండా చాలా సులభంగా చేసే పద్ధతి ఇప్పుడు చూద్దాం.

బాణలిలో నూనె వేసి, మరుగుతున్న ఆ నూనెలో ముందుగా తరిగి పెట్టుకున్న కూరగాయ ముక్కలు, పచ్చిమిర్చి, పలావ్ ఆకులను, గ్రైండ్ చేసిన యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క పొడిని, అల్లం-వెల్లుల్లి పేస్టుని వేసి బాగా కలపాలి. ఇది బాగా వేగిన తర్వాత, మూడు గ్లాసుల బియ్యానికి నాలుగున్నర గ్లాసుల నీళ్ళు కలిపి రైస్ కుక్కర్ లో వేసి, అందులో ఈ వేయించిన మిశ్రమాన్ని కలిపి రైస్ తోబాటు బాగా ఉడకనివ్వాలి. వేడి వేడి వెజ్ బిర్యానీ రెడీ.....

మరిన్ని శీర్షికలు
padyam - bhavam