Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Aditya Hrudayam

ఈ సంచికలో >> సినిమా >>

మ్యూజిక్ ముచ్చట్లు

music muchchatlu

పవన్ కళ్యాణ్ మ్యూజిక్ సెన్స్
1956 లో వచ్చిన సి.ఐ.డి. అనే హిందీ సినిమా లోని 'లేకే పెహ్ లా పెహ్ లా ప్యార్' పాట మొత్తం దేశాన్నే ఊపేసింది.
 ఓపి నయ్యర్ మ్యూజిక్ ,. అదే ట్యూన్ ని 'అభిమానం' సినిమాలో 'ఓహో బస్తీ దొరసానీ' పాటకి ఉపయోగించుకున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత ఈ పాట ఎన్ని రకాలుగా రీమిక్స్ అయిందో అది కూడా అందరికీ తెలుసు. ఇక దీనికి చేరిన కొత్త విశేషం ఏమిటంటే హాస్యనటుడు పద్మనాభం నిర్మాతగా తీసిన 'దేవత' లోని 'భళారే ధీరుడవీవేరా' పాట ఓపెనింగ్ కూడా ఇలాగే వుంటుందని అందరికీ తెలియడం. ఆ రోజుల్లో కొంతమందికి మాత్రమే తెలిసిన ఈ విషయం పవన్ కళ్యాణ్ నటించిన 'తీన్ మార్' సినిమాలోని 'బార్బీ బొమ్మకి చెల్లెలివా' పాట ద్వారా పూర్తిగా పాప్యులర్ అయిపోయింది. "ఈ పోలిక వుందని భలేగా కనుకున్నారు" అని 'తీన్ మార్' సంగీత దర్శకుడు మణిశర్మ తో అంటే "అబ్బెబ్బే ... అందులో నాదేం లేదు. ఈ రెండిట్నీ ఈజీగా కలపొచ్చు అనే ఐడియా పవన్ కళ్యాణ్ దే" అని నిజాన్ని మనస్ఫూర్తిగా ఒప్పేసుకున్నారు మణిశర్మ.

పకడో పకడో
ఇటీవల ఓ పత్రికలో వచ్చిన బిట్ ఇది. ఇందులో బాలు, కోదండపాణి అనుబంధం గురించి రాశారు. కానీ వేసింది మాత్రం బాలు, మాస్టర్ వేణు ఫొటో. ఎస్పీ కోదండపాణి ఎలా వుంటారో ఆ పక్కనే వున్న కలర్ ఫొటో చూసి తెలుసుకోవచ్చు.

 







రాజా (మ్యూజికాలజిస్ట్)

 

 

మరిన్ని సినిమా కబుర్లు
who is in photo with SVR