Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
vedika

ఈ సంచికలో >> సీరియల్స్

డెత్ మిస్టరీ



జరిగిన కథ: సినిమాలపై వచ్చే రివ్యూలు, పైరసీ భూతం, రిలీజ్ కన్నా ముందే, ఇంటర్నెట్ లో హల్ చల్ చేయడం గురించి తీవ్రంగా ఆలోచిస్తూంటాడు సిద్ధార్థ...ఆ తర్వాత
 

రెండ్రోజుల తర్వాత`

‘‘హల్లో సర్!’’ అంటూ పలకరించింది ప్రతిమ గొంతు.

‘‘హాయ్..’’  అన్నాడు సిద్దార్ధ.

‘‘ఇవాళ్టి డే ప్రోగ్రామంతా మీ ఇష్టం.  ఈవెనింగ్ కాల్షీట్ మాత్రం నాకే.  కాదనకండి ’’రిక్వెస్ట్ చేస్తోంది తను.

‘‘విషయమేంటీ?’’ అడిగాడు సిద్దార్థ.

‘‘సింపుల్ గా ఫ్రైడే’’ అంది నవ్వుతూ.

‘‘ఫ్రైడే ఫీవర్ మీకూ ఉందన్నమాట’’

‘‘అంటే...’’

‘‘ఫ్రైడే ఈవెనింగ్ నుంచే కదా వీకెండ్ స్టార్టయ్యేది’’

‘‘నేనుఎం ఎన్ సీ ఫ్రైడే గురించి మాట్లాడడం లేదు’’

‘‘మరి...’’

‘‘మీకు తెలుసుగా. ఇండస్ట్రీ ఫ్రైడేలన్నీ కొత్త సినిమాల్తోనే’’

‘‘ఓ.. అర్దమైంది.  ఇవాళేదో న్యూ మూవీరిలీజ్ కాబోతోందన్న మాట’’

‘‘మన మూవీయే.  ప్రియతమా’’ అంటూ నాలిక్కరుచుకుంది ప్రతిమ.

సినిమా పేరు చెప్తూ అవతల్నుంచి ఆమె ఖంగుతిన్న సంగతి సెల్ ఫోన్ ఇవతల సిద్దార్థ పని కట్టేసాడు.

కొన్ని సినిమాలంతే!

యువ హృదయాల్ని గిలిపెడుతూ చిలిపి పన్లు చేస్తాయి.

‘‘ఊ...చెప్పండి’’అన్నాడు సిద్దార్థ.

‘‘అదే... ఈ ఈవెనింగ్ మీరు మా గెస్ట్.  ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ లోని థియేటర్లో మనం కలుసుకుందాం. ఫస్డ్డే ... ఫస్ట్ షో సినిమా చూసి హిట్టో,  ఫట్టో చెప్పేయండి’’ అంది ప్రతిమ.

‘‘వెబ్ సైట్ రివ్యూలింకా రాలేదా?’’ అడిగాడు సిద్దార్థ.

‘‘వచ్చే ఉంటాయి’’

‘‘రేటింగెంతో?’’

‘‘ఊహూ... వాటిని నే అబ్జర్వ్ చేయను. నా దృష్టిలో వెదర్రిపోర్టెంతో... ఈ రివ్యూలూ అంతే. వాన పడుతుందని వాతావరణశాఖ చెప్తే ఆ రోజు మండే సూర్యుడు మరింత విజృంభిస్తాడని అర్ధం’’

‘‘అంటే...’’

‘‘అంటే ఏముంది?  సిన్మా బాగోలేదని ఈ సోకాల్డ్ వెబ్ రిపోర్టర్లు ఇచ్చిన రివ్యూల్ని తలకిందులు చేస్తూ ఎన్నో సినిమాలు హిట్టయ్యాయి’’‘‘ఒక్క మాట చెప్పండి ...మీ సినిమా పై మార్నింగ్ షో రిపోర్ట్ ఎలా వచ్చింది’’

‘‘పాజిటివ్ గానే...’’

‘‘ఇంటర్ నెట్ లో సినిమా రిలీజైనా  కూడానా?’’

‘‘ఔను... ఇంటర్నెట్ సినిమాలో లేని సీన్లు యాడ్ చేసామంటూ వరుస యాడ్స్ ఇచ్చాం కదా!  ఆ ప్రోమోస్ వర్కవుటయ్యాయి’’

‘‘ఇంతకీ... ఆజ్ కీ షామ్... తేరీ నామ్’’ అన్నాడు సిద్దార్థ.

‘‘చెప్పానుగా... మీరు మా గెస్ట్ అని.  తప్పకుండా రండి.  వస్తే...మీకో సర్ ప్రయిజ్’’

0‘‘ఏంటది?’’

‘‘ముందే చెప్తే అర్దమేముంటుంది. రండి. ఫైవ్ థర్ టీకి థియేటర్ దగ్గర మీ కోసం వెయిట్ చేస్తాను’’

‘‘ఓకే... అలాగే’’ అన్నాడు సిద్దార్థ.

ఫోన్ పెట్టేసిన రెండు నిముషాలకే మళ్లీ ప్రతిమ దగ్గర్నుంచీ కాల్ వచ్చింది.

‘‘చెప్పడమేదైనా మరిచిపోయారా?’’

‘‘పిలవడం మరిచి పోయాను’’

‘‘పిలిచారు కదా!’’

‘‘మిమ్మల్ని కాదు... మీ ఫ్రెండ్ కం అసిస్టెంట్ కం క్రయింరిపోర్టర్తే జాని.  మీతో అతడ్ని కూడా మూవీకి తీసుకురండి.  మరిచిపోరు కదా!’’

‘‘అలాగే... మేమిద్దరం వస్తాం’’ కాల్ కట్ అయింది.

ఆ తర్వాత ఓ క్షణం కూడా ఆలస్యం చేయకుండా తేజాకి ఇన్ ఫాం చేసాడు సిద్దార్థ.

‘‘థాంక్స్! నన్నూగుర్తుపెట్టుకుని పిలిచినందుకు’ ’ఎగ్జయిటింగ్ అ తడి మాటల్లోనే  తెలుస్తోంది.

‘‘కానీ, సారీ! ’’

‘‘ఏం...?’’

‘‘ఈవెనింగ్ నాకో అర్జంట్ వర్క్ ఉంది.  ఓ కేసు విషయమై డిస్కస్ చేసేందుకు ఢల్లీి నుంచి ఇద్దరు ఇంపార్టెంట్ వ్యక్తులు వస్తున్నారు’’‘‘అంటే...’’‘‘మూవీకి నువ్వెళ్లు.  నే రాలేను’ ’అన్నాడు సిద్దార్థ.

‘‘నువ్వు లేకుండా సినిమాకి నేనెలా వెళ్లేది?’’

‘‘బైక్ మీద...’’

‘‘ఒక్కడినే...’’

‘‘హాల్లో జనాలు చాలా మందే ఉంటారు’’

‘‘చుట్టూ ఎంత మంది ఉన్నా... నువ్వు లేకపోతే నేనొక్కడినే కదా’’

‘‘ప్రతిమ ఉంటుందిగా’’ ఒక్కసారి తేజ ఒళ్లు రaల్లుమంది.

‘‘ఔను... నీ తోడుగా ప్రతిమ ఉంటుంది. ఈవినింగ్ ఇద్దరూ సినిమా చూడండి.  నేనిక్కడ ప ని చూసుకుంటాను’’

‘‘ప్లీజ్.. నువ్వూ రావాలి’’

‘‘కుదరదన్నాను కదా!’’

‘‘అయితే,  నేనూ వెళ్లను’’ అన్నాడు తేజ.

ఆ తర్వాత ఆ మాటే నిజమైంది తేజ విషయంలో.

తేజాని ఆటపట్టించేందుకు అర్జంట్ పని ఉందని చెప్పినా... సాయంత్రం ఇద్దరూ కలిసే సినిమాకెళ్లాలనుకున్నాడు సిద్దార్థ. అంతలోనే ఓ అవాంతరం వచ్చిపడడంతో రాలేని పరిస్థితిలో పడిపోయాడు తేజ.  అదే సంగతి సిద్దార్థకి కాల్ చేసి మరీ చెప్పాడు.‘‘ఏంఏమైందీ?’’ అడిగాడుసిద్దార్థ.

‘‘మా క్రయింబు లెటెన్ యాంకర్ వరలక్ష్మి తెలుసు కదా! తన లైఫ్క్రై సిస్లో పడిరది. అర్జంట్ గాపోలీస్ హెల్ప్ తీసుకోవాలి. ఇప్పుడిద్దరం సీపీ ని కలిసేందుకు వెళ్తున్నాం’’ చెప్పాడు తేజ.

‘‘సినిమా చూసిరా... మా స్టోరీ సిల్వర్ స్క్రీన్ పై తర్వాత చూద్దువు గానీ’’ అన్నాడు తేజ.

వరలక్ష్మి నచ్చిన ఓ వ్యక్తితో టూ ఇయర్స్ గా  ‘లివిన్ రిలేషన్ షిప్’ లో ఉంది. మనసిచ్చి పుచ్చుకున్నారు. మూడు ముళ్ల ముచ్చట లేకుండానే ఒకే కప్పు కింద సహజీవనం సాగిస్తున్నారు. వరలక్ష్మి పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా... ‘పేరెంట్స్ ని ఒప్పించేందుకు కాస్త టైం కావాలం’టూ ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వస్తున్నాడు. అప్పుడెప్పుడో ఇంటర్లో కలిసి చదువుకుని ఇన్నేళ్ల తర్వాత సిటీలో తారస పడ్డ ఆ ఇద్దరి మధ్య చనువు పెరిగి ఓ ఇంట్లోనే కలిసుండేలా చేసింది.   సాగినంతవరకూసహజీవనంసరదాగానేఉంటుంది. ఎవరిస్వేచ్ఛకు ఎవరూ అడ్డుకారు. ఈరిలేషన్షిప్లోఒకరిపైఒకరికిప్రేమ, అభిమానం, ఆత్మీయతలాంటిభావవ్యక్తీకరణకుఆకాశమంతచోటుంది.  అదే సమయంలో ఎవరికీ ఎవరిపై హక్కే లేదు. హృదయాల్లో కల్మషం చేరనంత వరకూ ఈ బంధం ఓకే. రెక్కలు విప్పుకున్న స్వేచ్ఛ డబుల్ ఓకే. తేడావస్తేనే చికాకు.
ప్రస్తుతం వరలక్ష్మి ఆ చికాకులో పడిపోయింది. ఆ మధ్యాహ్నం తేజ క్యాబిన్ లోకి వచ్చిన వరలక్ష్మి... ‘‘ప్లీజ్! నా కోసం కాస్త సమయం కేటాయించగలరా?’’ దీనంగా అభ్యర్ధించింది. 

ఆ క్షణంలో ఆమెని చూడగానే పీకల్లోతు ఇబ్బందుల్లో కూరుకుపోయినట్లు ఎవరికైనా ఇట్టే అర్ధమైపోతుంది.

‘‘ఏం అలా ఉన్నారు?’’ అడిగాడు తేజ. ఆ చిన్ని పరామర్శకే ఆమె కళ్లలో సముద్రాలు పొంగాయి. ముఖానికున్న మేకప్ చెరిగిపోయింది. ఖంగుమనే కంఠస్వరంతో క్రయిం బులెటెన్ కి యాంకరింగ్ చేస్తోంది ఈమేనా? అనుమానం వచ్చింది తేజాకి.

‘‘ప్లీజ్!  ఎంత కష్టమొచ్చినా...నేనున్నాను మీకు అండగా. ముందు ఆ కన్నీళ్లు తుడుచుకుని, వెక్కిళ్లు ఆపి అసలు విషయం చెప్పండి’’ అన్నాడు బుజ్జగింపుగా.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
naa preyasinipattiuste koti