Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
courier boy kalyan is comming

ఈ సంచికలో >> సినిమా >>

వర్మ ప్రొడ్యూసర్‌, జె.డి చక్రి డైరెక్టర్‌

varma producer, jd.director
సక్సెస్‌ఫుల్‌ హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా చాలా సినిమాల్లో నటించి, తన నటనలోని అనేక వేరియేషన్స్‌ను చూపించిన హీరో జె.డి చక్రవర్తి. కేవలం నటనకే కాదు సినీ టెక్నికల్‌ రంగంలో కూడా తన హవా చూపించాడు. గతంలో తాను హీరోగా చేసినప్పటి సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మ ఇప్పుడు చక్రి సినిమాకి ప్రొడ్యూసర్‌గా మారాడట. పాత స్నేహంతో చక్రి చేయబోతున్న ఒక సినిమాకి వర్మ ప్రొడ్యూసర్‌గా పని చేయడానికి ఒప్పుకున్నాడట. కంప్లీట్‌ డిటెయిల్స్‌ కొన్ని రోజుల్లో వెల్లడవుతాయి.

ఇప్పుడు చక్రి, దేవాకట్టా డైరెక్షన్‌లో మంచు విష్ణు, ప్రణీత జంటగా నటిస్తున్న 'డైనమైట్‌' సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈయన మళయాళంలో చేసిన 'భాస్కర్‌ ది రాస్కెల్‌' సినిమా పెద్ద హిట్‌ కావడంతో ఆ సినిమాను త్వరలో తమిళంలో, హిందీలో రీమేక్‌ చేసే యోచనలో ఉన్నారట. తమిళంలో ఘనవిజయం సాధించిన 'అరిమనంబి' సినిమాకి రీమేక్‌గా వచ్చిన ఈ సినిమా తెలుగులో కూడా అంతే విజయం సాధిస్తుందని చక్రి అంటున్నాడు. 
మరిన్ని సినిమా కబుర్లు
mega appearence in sardar gabbarsingh