Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscope 11th september to 17th september

ఈ సంచికలో >> శీర్షికలు >>

సాహితీవనం - వనం వెంకట వరప్రసాద రావు

sahiteevanam

ఆముక్తమాల్యద  (గత సంచిక తరువాయి)

గోదాదేవి విరహతాపముతో నలిగిపోతుంటే చెలికత్తెలు వెళాకోళం చేస్తూ చెలరేగిపోతున్నారు. స్రగ్విణి అనే చెలికత్తె అందుకుని యిలా టున్నది.

అనినన్స్రగ్విణి వల్కె దన్ను జెలులారా నే లతాడోల జి
క్కన నూపం దెగి వ్రాల దీని చనువ్రేకం బేక్రియం దాల్తునో 
యని పట్టం దినమధ్యమార్కరుచిఖిద్యన్మంజరుల్వోని వా
డినపాలిండ్లను బెండుబొమ్మగతి నుండె న్సందిటం జుల్కనై   

ఒకనాడు నేను ఈమెను లతల ఉయ్యాలలో ఊపుతుంటే, బహుశా ఆమె శరీరపు తాపానికి కాబోలు, ఆ లతలు తెగి, ఈమె క్రింద డబోయింది. డకుండా పట్టుకుందామనుకుంటూ ఈమె వక్షోజభారాన్ని నేనెలా మోయగలనో అని భయపడుతూ ఈమెను పట్టుకోగా బెండుతో చేసిన మ్మలాగా, తేలిగ్గా ఉన్నదీమె,మధ్యందిన మార్తాండుని వేడిమికి వాడిపోయిన పూలగుత్తులవలె వాడిపోయి, వడలిపోయి ఉన్నాయి ఈమె కుచములు! అంత విరహతాపం తల్లీ, ఈ తల్లికి అన్నది. గోదాదేవికి చిరుకోపం వచ్చింది.

ఆర్పగ దీర్పగ మిక్కిలి 
నేర్పుగల వయస్యలట్లు నెలతలు మీ మీ 
నేర్పున బలికెద రక్కర 
యేర్పడ మీ కీ విచార మేటికి జెపుడీ

పెద్ద ఆర్చేవాళ్ళ లాగా తీర్చేవాళ్ళ లాగా మాట్లాడుతున్నారు, నాకు కదా బాధ, మీకీ విచారమెందుకు చెప్పండి అని చిరు కసరు కసిరింది. అలా సిరి వాళ్ళను పంపడమో, తేలికగా వాళ్ళ నోళ్ళకు తాళం వెయ్యడమో చేస్తుంది కానీ, ఒకోసారి రాత్రుళ్ళు విరహతాపాన్ని తట్టుకోలేక గోవిందుని లా నిష్ఠూరా లాడుతుంది గోదాదేవి.

అభినవకువలయ శ్యామకోమలమైన 
డామూపు మకరకుండలము దాల్ప
నిస్తులాస్యశ్రీ వయస్స్తంభనిక్షిప్త 
నింబచ్ఛదభ్రువల్పంబు నిక్క 
బరువంపు మంకెనవిరి వంపు నరవంపు 
వాతెర చెంద్రంపు వాన గురియ 
నందంపు మెరుగు వాలారు కన్గవ చూడ్కి 
శ్రవణ కుండల కాంతి సవతు గాగ

సప్తభువనాంగనానురంజనకు సప్త 
విధ పరీవాహముగ గానసుధ వెలార్చు 
మాడ్కి వేణువుపై వ్రేళ్ళు మార్చి మార్చి
మరులుకొలిపితె గోవింద మందసతుల

తెలుగు సాహిత్యంలో అత్యద్భుతమైన శ్రీకృష్ణ వర్ణనలలో యిది ఒకటి అని, పోతనకు శ్రీకృష్ణ వర్ణనలలో ప్రథమస్థానంఅని ఈ వ్యాసకర్త ఉద్దేశం. ధ్ర మహాభాగవతంలో దాదాపూ ఇలానే ఉన్న పద్యము ఒకటి ప్రసాదించాడు పోతన,శ్రీకృష్ణ దేవరాయ చక్రవర్తి యిక్కడ ఆముక్తమాల్యదలో దిగాడు. వేణుగానం చేస్తున్న శ్రీకృష్ణుని వర్ణచిత్రం, రాయల వర్ణనా విచిత్రం ఈ పద్యం.కొత్త నల్లకలువను అంటే అప్పుడే విచ్చుకున్న ల్లకలువను బోలిన నల్లని ఎడమ భుజము (అభినవకువలయశ్యామకోమలమైన డామూపు) పైన శ్రీకృష్ణుని మకరకుండలము ఉన్నది. దుకంటే ఆయన ముఖం కొద్దిగా ఎడమ ప్రక్కకు వాలి ఉన్నది. ఆయన సాటిలేని ముఖ కళకు దృష్టి దోషం తగిలి ఆ ముఖకళకు వయసు గ్గకుండాదిష్టి తీయడానికి ఉంచిన వేపాకులాగా ఆయన భ్రుకుటి కొద్దిగా పైకిలేచి ఉన్నది(నిస్తులాస్యశ్రీ వయస్స్తంభనిక్షిప్త నింబచ్ఛదభ్రువల్పంబు నిక్క) పీడలూ పిశాచాలూ సోకకుండా వేపమండలను కట్టడం జానపదుల జీవనవిధానంలో ఒక శం, వేపాకు వలన వయసు సడలిపోకుండా ఉంటుంది అని ఆరోగ్య సూత్రము ఇందులో నిక్షిప్తం చేశాడు రాయలవారు. వేణుగానం స్తున్నందువలన గమకాలకు అనుగుణంగా ఎగసిన కనుబొమ వర్ణన! విచ్చిన కారణంగా వయసు వచ్చినకారణంగా మిడిసిపడుతున్న ధూక ష్పం లాంటి ఎర్రని క్రింది పెదవి ఎర్రనెర్రని కాంతులనుకురిపిస్తున్నది,ఆ పూవు యొక్క అతిశయాన్ని చులకన చేస్తున్నది, దాన్ని వెర్రిదాన్ని స్తున్నది. ఆ క్రింది పెదవి వేణువును వాయిస్తున్న కారణంగా సగం వాలి, సగం తెరిచి ఉన్నది.(బరువంపు మంకెనవిరి వంపు నరవంపు వాతెర ద్రంపు వాన గురియ) అందంగా మెరుస్తున్న వాలుగన్నుల చూపుల కాంతి భుజము మీదికి వాలిన చెవికుండలముల కాంతితో పోటీ డుతున్నది(నందంపు మెరుగు వాలారు కన్గవ చూడ్కి శ్రవణ కుండల కాంతి సవతు గాగ)యిలా ఏడులోకాలలోని స్త్రీల మనసులను జింపజేయడం కోసం ఏడు విధములైన స్వరసమ్మేళనంగా, గానము అనే ఏడు విధముల ప్రవాహాన్ని పారిస్తూ, వ్రేళ్ళను మార్చి మార్చి ణువుపై ఆడిస్తున్నావా గోవిందా? వ్రేళ్ళకొసలపై ఆడించినట్టు గొల్ల మందల సతులను (మందబుద్దులు వెర్రివాళ్ళు ఐన స్త్రీలను అని కూడా రక) హింపజేసి వారికి మరులు కొల్పుతున్నావా గోవిందా అని గోవింద నామస్మరణం చేస్తున్నది గోదాదేవి. 

ఏడు లోకాలు అంటే ఏడు ఊర్ధ్వ లోకాలు. ఊర్ధ్వ లోకాలు అంటే ఊర్ధ్వ దిశకు, అంటే ఉన్నతికి దారి తీసే లోకాలు. అవి భూలోకము, వర్లోకము, ర్లోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము.ఊర్ధ్వదిశన ఉన్నలోకాలు, ఉన్నతమైన ముక్తిని ఇచ్చే లోకాలు యివి. ధోలోకాలు, అంటే క్రిందికి ఉన్న లోకాలు,అంటే ఉన్నతికి నోచుకోని జీవులున్న లోకాలు ఉన్నాయి, అతల, వితల, సుతల, రసాతల, తలాతల,మహాతల, పాతాళ లోకాలు. ఈ క్రిందిలోకాల వారు ఆయనకు మోహితులు కారు, వారికి ఆయనవైపు మనసు పోదు, ఉన్నతి దరు, దుకని వారివి అధోలోకాలు. ఏడు లోకాలలోని స్త్రీలు అంటే ఏడు లోకాలలోని జీవులు అందరూ అని ఒక మెరుపు. ఎందుకంటే జీవులందరూ లే, పురాణ పురుషుడు, ఏకైక పురుషుడు శ్రీకృష్ణుడు ఒక్కడే కనుక. కనుక ఊర్ధ్వ దిశను, దశను పొందాలనుకునే ఏడు లోకాల స్త్రీలు కృష్ణుని పు చూడవలసిందే, ఆయన మోహంలో పడవలసిందే, ఆయనవల్లనే రంజిల్లవలసిందే, అదీ నిర్దేశపూర్వకమైన రహస్యపు వెల్లడి. సప్తస్వరాలు దరికీ తెలిసినవే.ప్రవాహము అంటే ప్రవహించేది. అంటే నది అని అర్ధం. నది అంటే గంగా నది అని విశేషం. ఆ గంగ కూడా శివుని రసునుండి ఏడు పాయలుగా ఏడు పేర్లతో భూమి మీదకు ప్రవహించింది. ' నా ధాటికి శివుడు తట్టుకుంటాడా? చూస్తాను' అని గర్వంతో శివుని రస్సుమీదికి దూకింది గంగ. అది కనిపెట్టిన పరమశివుడు తన జటాజూటాన్ని బిలంలాగా పెంచి ఒక్క బిందువును పట్టుకున్నట్టు గంగను పట్టి చాడు. మరలా భగీరథుని ప్రార్ధనలకు కరిగి నెమ్మదిగా, హిమశైల శిఖరంమీద బ్రహ్మదేవుడు నిర్మించిన బిందు సరస్సులోకి గంగను దిలిపెట్టాడు. అక్కడినుండి ఏడు పాయలుగా గంగ ప్రవహించింది. హ్లాదిని, పావని, నళిని అనే మూడు పాయలు తూర్పుదిశకు, సీత, చక్షువు, ధువు అనే మూడుపాయలు ఉత్తరదిశకు ప్రవహించాయి.

ఏడవ పాయ భగీరథుని అభీష్టాన్ని తీర్చడంకోసం ఆతనివెంట నడిచి భాగీరథి ఐంది. కనుక ఏడు లోకాలలోని స్త్రీలు, ఏడు స్వరాలు, ఏడు వాహాలు అని సమంజసంగా, సరసంగా, రమణీయమైన రహస్యాలను ఈ పద్యంలో రాశులుగా పోశాడు రాయలవారు. 

 (కొనసాగింపు చ్చేవారం)

మరిన్ని శీర్షికలు
horn