Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
navvunalugu yugaalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

18-09-2015 నుండి 24-09-2015 వరకు వారఫలాలు - శ్రీకాంత్

మేష రాశి : ఈవారం మొత్తంమీద మిశ్రమ ఫలితాలు పొందుతారు. నలుగురిలో పనిచేసే సమయంలో వారికి అనుగుణంగా నడుచుకొనుట సూచన. ఉద్యోగంలో అధికారులతో చేసిన చర్చలు క్రీయారూపంలోకి వచ్చే అవకాశం కలదు. సంతానం మూలన కొంత ఆందోళన చెందుటకు అవకాశం ఉంది ,సంతానపరమైన విషయాల్లో మార్పులను ఆశిస్తారు. స్త్రీ పరమైన విషయాల్లో మాత్రం జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. వాహనముల మూలాన కొంత ఊహించని ఖర్చులకు ఆస్కారం కలదు. కుటుంబంలో పెద్దల సహకారం లభిస్తుంది,వారినుండి ఆశించిన సహకారం లభిస్తుంది. మిత్రులతో కలిసి సమయాన్ని విందులలో గడుపుతారు. కొన్ని కొన్ని విషయాల్లో వ్యతిరేకవర్గం మూలాన ఇబ్బందులు కలుగుటకు అవకాశం ఉంది జాగ్రత్తగా వ్యవహరించుట సూచన.  వృషభ రాశి ఈవారం మొత్తంమీద నూతన ప్రయత్నాలు మొదలుపెట్టుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. స్త్రీలనుండి నూతన విషయాలను తెలుసుకొనే ఆస్కారం కలదు. సంతానం మూలాన ఊహించని ఇబ్బందులు పొందుతారు, ఈ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. సమయానికి భోజనం చేయుట, ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన.  బంధుమిత్రుల నుండి నూతన విషయాలను తెలుస్కోనే ఆస్కారం కలదు. విలువైన వస్తువులను కొనుగోలు చేయకండి సర్దుబాటు విధానం కలిగి ఉండుట మంచిది. ప్రయాణాలు చేస్తారు అందులో చిననాటి మిత్రులను కలిసే అవాకాశం ఉంది. నూతన పనులను మొదలు పెట్టుటకు ముందు దైవప్రార్థన చేయుట వలన మేలుజరుగుతుంది.               

మిథున రాశి : ఈవారం మొత్తంమీద ప్రయాణాలకు సమయం ఇస్తారు, దూరప్రదేశ ప్రయాణాలు చేయవలసి వస్తుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. స్త్రీ పరమైన విషయాలకు సమయం వెచ్చిస్తారు అలాగే వారికోసం ధనం వెచ్చిస్తారు. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట అలాగే నూతన నిర్ణయాలు తీసుకొనేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయుట మంచిది. పెట్టుబడులు అలాగే వ్యాపారపరమైన విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వలన లబ్దిని పొందుటకు అవకాశం కలదు.విలువైన వస్తువులను జాగ్రత్తగా కాపాడుకొనే ప్రయత్నం చేయుట మంచిది. అనవసరమైన విషయాల్లో తలదూర్చడం వలన మాటపడవలసి వస్తుంది జాగ్రత్త. కుటుంబసభ్యుల తీరు మిమ్మల్ని కాస్త ఆందోళనకు గురిచేసే అవకాశం ఉంది.    కర్కాటక రాశి : ఈవారం మొత్తంమీద చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. నలుగురిలో ఆశించిన మేర గుర్తింపును పొందుతారు. ప్రయాణాల విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోండి , అవసరమైతే వాయిదా వేయుట మంచిది. మీ మాటతీరు లేదా ఆలోచనా విధానం తోటివారిని ఇబ్బందికి గురిచేసే ఆస్కారం కలదు. విదేశీప్రయాణాలు కలిసి వస్తాయి, ప్రయత్నం చేయుట మంచిది. ఉద్యోగంలో మీరు తీసుకున్న నిర్ణయాలు ఊహించని మార్పులకు అవకాశం ఇస్తాయి.  ఆర్థికపరమైన విషయాల్లో అనుకోని ఖర్చులు కలుగుటకు అవకాశం ఉంది. విలువైనవస్తువులను కొనుగోలు చేసుకొనే అవకాశం ఉంది , మీ ఆలోచనలను పెద్దలకు తెలియజేయుట సూచన. మానసికపరంగా కొంత ఆందోళన తగ్గించుకొనే ప్రయత్నం చేయుట సూచన.       


సింహ రాశి :  ఈవారం మొత్తంమీద నూతన పరిచయాలకు అవకాశం కలదు. వ్యాపారపరమైన లావాదేవీల్లో జాగ్రత్తగా లేకపోతే నూతన సమస్యలు పొందుటకు అవకాశం ఉంది. కోపాన్ని తగ్గించుకోవడం వలన మేలుజరుగుతుంది, వివాదాలకు దూరంగా ఉండుట సూచన. ఎవ్వరితోను మాటపట్టింపులకు పోకండి. కుటుంబసభ్యుల సూచనలకు ప్రాధాన్యం ఇవ్వడం వలన మేలుజరుగుతుంది. కొత్తగా చేపట్టిన ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. విదేశేప్రయత్నాలు కలిసి వస్తాయి ఈ విషయంలో ఒక నిర్ణయానికి రావడం అన్నివిధాల మేలుచేస్తుంది ఆలోచన చేయుట మంచిది. కుటుంబంలో సభ్యుల నుండి సహకారం కోరుకుంటారు. మిత్రులనుండి వచ్చిన సూచనల విషయంలో  బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం సూచన. 
కన్యా రాశి : ఈవారం మొత్తంమీద ఆలోచనల్లో స్వల్ప సందిగ్దత ఉంటుంది. ఒక నిర్ణయానికి రావడంలో సతమతమయ్యే ఆస్కారం కలదు. అనుభవజ్ఞుల సూచనల మేర నడుచుకోవడం సూచన. ఇష్టమైన వ్యక్తుల నుండి నూతన విషయాలు తెలుసుకొనే ఆస్కారం కలదు. నూతన పరిచయాలకు ఆస్కారం ఉంది, వారితో సమయాన్ని గడుపుటకు ఆస్కారం కలదు. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. సరైన ప్రణాళిక అవసరం.  క్రీడాకారులకు మంచి సమయం నూతన ఆలోచనలు చేయుట లాభిస్తుంది. సోదరులతో కలిసి చేసే పనులు ఒక కొలిక్కి వస్తాయి. ఉద్యోగంలో అధికారుల నుండి నూతన విషయాలు తెలుసుకుంటారు. సంతానపరమైన విషయాల్లో సంతృప్తికరమైన ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. వారిమూలన గౌరవం పెరుగుతుంది. తులా రాశి : ఈవారం మొత్తంమీద నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. వ్యాపారపరమైన విషయాల్లో నూతన నిర్ణయాలు తీసుకొనే ముందు పెద్దల అభిప్రాయాలను తీసుకోవడం మంచిది. చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం ఉంది. బంధువుల నుండి నూతన విషయాలు తెలుసుకొనే ఆస్కారం కలదు. కుటుంబంలో పెద్దలతో సమయాన్ని గడుపుటకు ఆస్కారం కలదు. చేపట్టిన పనులను సరైన ప్రణాళిక ప్రకారం ముందుకు వెళితే విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. స్వల్పప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది కొంత శారీరకపరమైన అలసటను కలిగి ఉంటారు. నూతన లావాదేవీల విషయంలో అనుభవజ్ఞుల సూచనల మేర నడుచుకోండి.  గతంలో చేపట్టిన పనులను పూర్తిచేసే ప్రయత్నం చేయుట అన్నివిధాల మంచిది. 
వృశ్చిక రాశి  : ఈవారం మొత్తంమీద కుటుంబంలో పెద్దలనుండి నూతన విషయాలు తెలుసుకొనే అవకాశం ఉంది. కుటుంబసభ్యుల్లో ఒకరి ఆరోగ్యం మిమ్మల్ని ఆందోళనకు గురిచేసే అవకాశం ఉంది. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు. విదేశీప్రయత్నాలు చేయవలసిన  ప్రయత్నం చేయుట వలన సఫలీకృతులు అవుతారు. వివాదాస్పదనిర్ణయాలకు దూరంగా ఉండుట సూచన. అనవసరమైన ఖర్చులు పెరుగుటకు ఆస్కారం ఉంది. కుటుంబంలో జీవితభాగస్వామి తో నూతన ఒప్పందాలు చేసుకొనే అవకాశం ఉంది. పూజల్లో పాల్గొనే ప్రయత్నం చేయండి. మాటతీరు విషయంలో కాస్త సర్దుబాటు అవసరం. మానసికంగా దృడంగా ఉండుట వలన మేలుజరుగుతుంది.     


ధనస్సు రాశి  : ఈవారం మొత్తంమీద తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు కలిసి వచ్చే ఆవకాశం ఉంది. ఉద్యోగంలో శ్రమ,పనిభారం తప్పక పోవచ్చును. కుటుంబంలోని సభ్యులు మీ ఆలోచనలను వ్యతిరేకించే అవకాశం కలదు. విలువైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. చిననాటి మిత్రులను కలుసుకొనే అవకాశం ఉంది, వారితో కలిసి నూతన పనులను చేపట్టుటకు అవకాశం కలదు. ఊహించని ప్రయాణాలు చేయుటకు ఆస్కారం కలదు,చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవడం వలన ఇబ్బందులు తొలగుతాయి. కుటుంబసభ్యుల నుండి మీరు ఆశించిన మేర సహాయసహకారాలు రాకపోవడం మూలాన కొంత అసంతృప్తిని కలిగి ఉండే అవకాశం కలదు. 

           మకర రాశి : ఈవారం మొత్తంమీద ఉద్యోగంలో అధికారుల నుండి ప్రశంశలు పొందుతారు. చేపట్టిన పనులను కాస్త ఆలస్యం అయినను విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. కుటుంబసభ్యులకు మీ ఆలోచనలు తెలియజేసే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం జాగ్రత్తగా లేకపోతే చిన్న చిన్న ఇబ్బందులు పొందుటకు అవకాశం కలదు. వాహనముల మూలాన ఇబ్బందులు తప్పకపోవచ్చును. సోదరులతో చర్చలకు ఆస్కారం కలదు. కుటుంభభాద్యతలు పెరుగుతాయి అలాగే మీవైన ఆలోచనలు కలిగి ఉండుట మంచిది. ఇష్టమైన పనులకు సమయం ఇస్తారు. ప్రయాణాలు సాధ్యమైనంత వరకు వాయిదావేయుట వలన మేలుజరుగుతుంది. దూరప్రదేశం నుండి వచ్చు వార్తలు మీలో కొత్త కొత్త సందేహాలను పెంచుటకు అవకాశం ఉంది.  

 కుంభ రాశి :  ఈవారం మొత్తంమీద చర్చాపరమైన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. వ్రుత్తి మరియు ఉద్యోగాల్లో నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. జీవితభాగస్వామితో స్వల్ప విభేదాలు వచ్చే అవకాశం కలదు. చిన్నపాటి సర్దుబాట్లు చేసుకోవడం వలన మేలుజరుగుతుంది. ప్రయాణాలకు సమయాన్ని కేటాయించే అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో ఊహించని ఖర్చులను పొందుతారు. విందులలో పాల్గొనే అవకాశం ఉంది. గత కొంత కాలంగా ఎదురుచూస్తున్నా ఫలితాలు మీకు అనుకూలంగా రావడం మంచిది. తల్లి తరుపు బంధువుల నుండి ఇబ్బందులు కలుగుటకు అవకాశం ఉంది జాగ్రత్త. రుణపరమైన విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి.    

 

    


మీన రాశి : ఈవారం మొత్తంమీద పెద్దలతో చేపట్టిన చర్చలు ఒక కొలిక్కి వస్తాయి. దూరప్రదేశాల నుండి నూతన విషయాలు తెలుసుకొనే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుతారు. కుటుంబంలో పెద్దల నుండి నూతన విషయాలు తెలుసుకొనే అవకాశం ఉంది, చర్చలకు అవకాశం కలదు. జీవితభాగస్వామికి మీ ఆలోచనలు తెలియజేస్తారు. స్వల్ప అనారోగ్యసమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. మొండిఆలోచనలు చేయకండి అందరితో సరదాగా గడిపే ప్రయత్నం మేలుచేస్తుంది. సోదరిమూలన కొంత ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది కావున ఈ విషయంలో మీరుకూడా ద్వందవైకరి కలిగి ఉండుట మీకు అవసరం. ప్రయాణాలు చేయకపోవడం సూచన.  

 


టి. శ్రీకాంత్
వాగ్దేవి జ్యోతిషాలయం 

మరిన్ని శీర్షికలు
sahiteevanam