Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
neevele naa praanam

ఈ సంచికలో >> కథలు >> ఆత్మతో ఒక రాత్రి

atmato oka ratri

 గతసంచికలో ఏం జరిగిందంటే... http://www.gotelugu.com/issue149/3819/telugu-stories/aatmato-oka-ratri/

"ఆత్మలంటే చాలా కౄరంగా వుంటాయనే కదరా చదివాము.. సినిమాల్లో చూశాము... మరి నువ్వేమో విరుద్దంగా చెబుతున్నావు."

"అలాగని కాదు.. అందులో చాలా రకాలుగా వుంటాయి. చాలా వాటికి తాము చని పోయామన్న విషయం కూడా తెలీదు. ఉదాహరణకు ఏదైనా ఫాక్టరీలో ప్రమాదం జరిగి చనిపోయిన ఆత్మలు కొన్ని అటూ ఇటూ తిరిగుతూ, మామూలుగానే పని చేసుకుటున్నట్లు ఫీలవుతూంటాయి.  చని పోయిన విషయం గుర్తు చేస్తే చాలు వెళ్ళి పోతాయి.. వాటి ఆయుష్షు ముఖ్యంగా వాటిలో మిగిలి వున్న ఎనర్జీని బట్టి లేదా తీరని ఆకాంక్షల తీవ్రతను బట్టి ఆధార పడి వుంటుంది... వీటిని ఎక్కువగా ఆకర్షించేది నీళ్ళు... నీటికి దగ్గరగా వుండడానికి ఇష్ట పడతాయి... కాబట్టి పాడు బడిన బావులకు

దూరంగా వుండడం మంచిది.. కొంత మంది శరీరాలు ఆత్మలను ఎక్కువగా ఆకర్షించడం చూశాను... కారణం తెలీదు... అన్ని ఆత్మలు వెంబడించి మన వెంట రాలేవు... అవి చనిపోయేనాటి మానసిక స్థితిని బట్టి ఆధార పడి వుంటుంది... శాస్త్రీయ విజ్ఞానం చెప్పేవన్ని నిజాలే కావచ్చు.. కాని, పూర్తి నిజాలు కావు... ఈ రోజు ఒక సిద్దాంతాన్ని నిర్ధారిస్తే, కొద్ది రోజుల తరువాత అమెండ్మెంట్ల పేరుతో దాన్ని మారుస్తున్నారు... అనంత విశ్వంలో అణువంత నిజాన్ని కూడ ఆధునిక శాస్త్రం నిర్ధారించలేక పోయిందన్నది స్వయంగా ఎంతోమంది విజ్ఞానుల అభిప్రాయమే... భౌతికాతీతమైన శక్తులను నమ్మక పోవడమే దీనికి కారణం... ఇతర గ్రహాల మధ్యన సూర్యుడుంటాడన్న నిజాన్ని తెలియజేయడమే కాకుండా, సామాన్యుడికి సైతం అర్థమయ్యేలా ప్రార్థనా మందిరాల్లో ప్రతిష్టించిన మన ఋషులని పిలువ బడే పురాతన విజ్ఞానులు వెల్లడించిన విషయాలను కాదని, వేల సంవత్సరాల తరువాత అది నిజమేనని గుర్తించి ముద్రవేసిన పాక్సాత్య ఆధునిక విజ్ఞానానికి దాసోహమంటున్న మనకు అన్నీ విపరీతం గాను, మూఢ  నమ్మకాలు గాను కనిపించడంలో ఆశ్చర్యమేమి లేదు.. ఆచరించే పద్దతుల్లో పెను మార్పులు రావడం వల్ల కొన్ని మూఢాచారాలు ఏర్పడ్డమాట నిజమే కాని... అన్నీ కాదు... ఆ మాట కొస్తే మన కంటే పాశ్చాత్యులకే మూఢ నమ్మకాలెక్కువ. అధ్వయనం చేస్తే నీకే అర్థమవుతుంది..."

శేఖర్ కన్ ఫ్యూజన్లో తల వూపుతున్నాడు.

"ఆత్మలతో ఇంటెరాక్ట్ అవ్వాలంటె ఏవొ ఇక్విప్ మెంట్ వాడతారని విన్నాను...!"

"ఆ... అవును నాలాగా స్పెసియల్ ఎబిలిటి లేని వారు ఎలెక్త్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ ను కొలిచే EMF మీటర్లు, తెర్మోగ్రాఫిక్, డిజిటల్ ఆడియో రికార్దర్స్ లాంటి పరికరాలు  వాడతారు... కాని నాకవి అవసరం లేదు...ఇంకో విషయం, కొంతమంది వాళ్ళ ఆత్మీయుల ఆత్మలతో ఇంటెరాక్ట్ అవ్వాలని మాస్ స్పిరిట్ మీడిఏటర్ల సహాయం తీసుకునే ప్రయత్నం చేస్తూంటారు... అది చాలావరకు కమర్షియల్ బేస్డ్ అయివుంటుంది... నమ్మడం అంత మంచిది కాదు... జెన్యూనుగా ఆ పవర్ వున్న వాళ్ళు  దాన్నో వ్యాపరంగా మార్చుకొనే రిస్కు తీసుకోరన్నది నా నమ్మకం.. "  

శేఖర్తో మాట్లాడుతున్నా మనసంతా ఎందుకో బాధగా వుంది... అవకాశం వున్నా ఏమి చేయలేక పోయానన్న బాధ...

ఏదో ఒకటి చేయాలి... ఈ రోజే... పరంధామయ్య గారు రేపే మమ్మల్ని బలవంతంగా తరిమేసేలా వున్నారు.

ఎవరకీ చెప్పకుండా రాత్రి ఒక్కణ్ణే వెళ్ళి ప్రయత్నించడానికి నిర్ణయించుకున్నాను... నిన్ననే ఆ యింటి తాలూకు దారి గట్ర వివరాలన్ని సేకరించి పెట్టాను... సో, ఈ రోజు రాత్రే ప్రయత్నించాలి.... చీకటి ప్రపంచంతో సంబంధాలు ఏర్పడ్డాక, టార్చి లాంటి వస్తువులు నా దగ్గర రెడీగా వుంచుకోవడం అలవాటయి పోయింది. అన్నీ వోసారి చెక్ చేసుకున్నాను...

******

 

అనుకున్న ప్రకారం రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో అందరూ మంచి నిద్రలో వుండగా బయలుదేరాను. పదిహేను నిమిషాల్లో ఆ ఇంటిని చేరుకున్నాను..

పెద్ద గేటు... లోపలంతా చీకటి... దారిలో కూడా మనుష్యులెక్కడా కనబడలేదు... సాధారణంగా పల్లెటూళ్ళో తొందరగా నిద్ర పోవడం  అలవాటు... అందులోను ఈ ఇంటి గురించి జనాల్లో కొంచెం భయం కూడా వుండడం వల్ల అంతా నిర్మానుష్యంగా వుంది. కప్పలు, మరి కొన్ని చిన్న చిన్న క్రిములు చేస్తన్న శబ్దాలు తప్ప మరేమి వినిపించడం లేదు.... గేట్ తీసుకొని లోపలికి ప్రవేశించాను.

టార్చ్ సహాయంతో ముఖ ద్వారం వైపు అడుగులు వేస్తున్నాను... అతను చుట్టు పక్కలే వుంటే నా సెన్స్ వైబ్రేషన్ వల్ల తెలిసి పోతుంది... అలాంటిదేది అనిపించలేదు... మెట్లెక్కడం మొదలు పెట్టాను... ఆ రోజు రాత్రి ఆత్మను చూసింది ఈ మెట్ల పైనే.... ఒక్క సారిగా నాలో వైబ్రేషన్ మొదలయ్యింది. చుట్టు పక్కలే వున్నాడన్న మాట. మళ్ళి నార్మల్ అయ్యింది... బహుషా లోపలికి వెళ్ళి వుండవచ్చు... నన్ను భయ పెట్టే ప్రయత్నం చేయలేదంటే అతను ఖచ్చితంగా పశ్చాత్తాప పడుతున్న ఆత్మ అయి వుండాలి... తాళం వేయ లేదు... తలుపు చిన్నగా ముందుకు తోసాను

తెరుచుకో లేదు... పాత కాలం నాటి తలుపులు ...కాస్త గట్టి గానే తోయాల్సొచ్చింది... పెద్ద చప్పుడుతో తెరుచుకుంది..  అడుగు లోపలికేస్తోంటే మళ్ళీ వైబ్రేషన్స్ మొదలయ్యాయి.. భయం ఏదో మూలకు ఎప్పుడూ వుంటుంది...

"భుజంగ రావు గారు... మీరిక్కడే వున్నారని తెలుసు... నేను వెంకట్... మీతో మాట్లాడాలని వచ్చాను..."

రెస్పాన్స్ లేదు.. మెల్లగ ఒక్కొక్క అడుగు ముందుకేస్తున్నాను.. ఇంతలో దడేల్మని ఏదో ఇత్తడి బిందె కింద పడ్డ శబ్దమొచ్చింది... ఉలిక్కిపడ్డాను.. వెన్నెముకలో చలి మొదలైయ్యింది... భయ పెట్టాలని చూస్తోందని అర్థమయ్యింది... ఇంత దూరమొచ్చాక వెను దిరగలేను. కాస్సేపు నిశ్శబ్దం.. 

"నన్ను నమ్మండి నేను మీ సమస్యలు తెలుకుందామని మాత్రమే వచ్చాను... మీ సంపద కోసం కాదు..." ధైర్యం కూడ గట్టుకొని మాట్లాడుతున్నాను...

బదులు లేదు.. పల్లెటూరి పట్టుదల... పని జరగదేమోనన్న అనుమానం మొదలయ్యింది. 

"సార్ మీకు సహాయం చేయాలన్న అభిప్రయంతో వచ్చాను.. సహకరించండి...ప్లీస్"

టైం చూసుకున్నాను పన్నెండు కావస్తోంది.... ఓ అయిదు నిమిషాలు అలానే నిలబడి వున్నాను... వైబ్రేషన్స్ బాగా పెరిగాయి.. నన్ను తాకుతూ ముందు కెళ్ళినట్లు అనిపించింది... ఇలా తాకడం చాలా రేర్ గా జరుగుతూంటుంది... వళ్ళు జలధరించింది... కాస్సేపల వుండి పోయాను...

ఎదురుగా ఆకారం కనిపించడం మొదలయ్యింది... అతను నన్ను నమ్మినట్లు నాకర్థమయ్యింది

ట్రెడిషనల్ పల్లెటూరి పెద్దల డ్రస్సు... తలపాగ కూడా వుంది... బల హీనమైన ఆకారం కళ్ళ చుట్టూ నల్లని చారలు... తీక్షణంగా చూస్తున్నాడు...అంత దగ్గరగా చూస్తూంటే నా కాళ్ళలో చిన్న వణుకు మొదలయ్యింది... 

" మీగురించి విన్నాను... మీ ఫీలింగ్స్ అర్థం చేసుకో గలను... మీరిప్పుడు శరీరంతో లేరన్న విషయం మీకు తెలుసనే అనుకుంటాను... "

మాటలు కలిపే ప్రయత్నం చేస్తున్నాను..

"నాకు తెలుసు..." గంభీరమైన గొంతు....

అతి కష్టం మీద అతన్ని నా మార్గంలో తీసుకు రాగలిగాను...నాకు కొద్ది కొద్ది గా బెరుకు భయం తగ్గి పోయి అతన్ని మాటల్లో పెట్టడం మొదలు పెట్టాను..అతని మాటల్లో పశ్చాత్తాపం తప్ప మరే ఫీలింగ్ కనబడటం లేదు..ఎంత సమయం అలా గడిచిపోయిందో గుర్తించ లేదు...వృధాగా పోగొట్టుకున్న జీవితం గురించి బాధ పడుతూనే వున్నాడు.. భయంకరంగా రోదిస్తున్నాడు..ఒక్కోసారి భయమేసింది కూడా...మరో అవకాషముంటే ఎలా ఉపయోగించుకోవాలనుకుంటున్నాడొ చెప్పాడు... ధనార్జన కోసం తను చేసిన తప్పులు, పాపాలు, కనీసం భార్య, పిల్లల్ను సుఖ పెట్టలేక పోయానన్న అసంతృప్తి అతన్ని ఇలా ఆత్మ రూపంలో అలమటించేలా చేస్తున్నాయని అర్థమయ్యింది..ఏం చేస్తే అతను సంతృప్తి పడతాడో తెలుసుకున్నాను... నేను చేయ గలిగినవన్నీ చేస్తానని మాటిచ్చాను...  సమాధానంగా కేవలం రోదనే వినిపిస్తోంది...

వున్నట్టుండి ఆ భయంకరమైనా రోదన ఆగిపోయింది... ఆకారం కూడా కనుమరుగైపోయింది... అంతా నిశ్శబ్దం...

"భుజంగరావు గారు..." పిలిచాను బదులు లేదు... నిశ్శబ్దమే సమాధానమయ్యింది...

"మీకిచ్చిన మాటను తప్పకుండా నిలబెట్టుకుంటాను... మీకది సంతృప్తిని కలిగించివుంటే దానికి గుర్తుగా ఒకసారి కనిపించండి...."

మళ్ళీ సమాధానం లేదు...

"సరే నేను వెళ్ళిపోతున్నాను... కనీసం ఎదైన చిన్న శబ్దం చేశారంటే మీరు నా మాటలు నమ్మి, తృప్తి పడ్డారని భావిస్తాను..."

నిశ్శబ్దం... కొద్దిసేపు ఎదురు చూసి నిరాశతో వెను దిరిగాను... అప్పుడు వినిపించింది... నీళ్ళ గ్లాసు క్రింద పడ్డ శబ్దం...

ఆతమ చేసిన శబ్దమా... లేక యాదృచ్చికమా...

"ప్లీస్ మరో సారి... " అనుకోకుండా నా నోటినుండి వెలువడింది...

మళ్ళీ అలాంటి శబ్దమే వినిపించింది... భుజంగ రావు గారు నన్ను నమ్మారన్న విషయం అర్థమయ్యింది.

తృప్తిగా బయటికొచ్చి రోడ్డెక్కాను... అప్రయత్నంగా ఒకసారి ఆ ఇంటి వైపు చుశాను... మెట్లపైన మళ్ళీ అదే ఆకారం...కాని ఈ సారి చూపు తీక్షణంగా

లేదు... అంత సేపు ఆత్మతో మాట్లాడినప్పటికి తిరిగి మళ్ళీ సడన్ గా కనిపించేప్పటకి సహజమైన భయం ఒక్క క్షణం వెన్నులో పాకినట్లయింది.  మొహం రోడ్డు వైపుకు తిప్పి పరిగెత్తినంత స్పీడుగా నడవడం మొదలు పెట్టాను... ఇంకా చీకటి గానే వుంది... టైం రెండు కావస్తోంది. రూము చేరే సరికి శేఖర్ మేల్కొని వున్నాడు...

******

 

"ఏరా ఎక్కడికెళ్ళావ్... నువ్విలాంటిదేదో చేస్తావని అనుమానంగానే వుంది....ఎక్కడ ఆ ఇంట్లో చిక్కుకు పోయావోనన్న భయంతో చచ్చిపోయాననుకో... తిరిగొచ్చి బ్రతికించావు..." గుక్క తిప్పుకోకుండా మాట్లాడేస్తున్నాడు...

"మోర్నింగ్ మాట్లాడుదాం ఇక పడుకో...." అంటూ నేను కూడా నడుం వాల్చాను... ఇక నిద్ర పట్టే అవకాశం లేదు... అసలు కనీసం వారం రోజులు నిద్రలో కూడా అవే దృశ్యాలు కనిపిస్తాయని తెలుసు....

ఉదయం కాల కృత్యాలు తీర్చుకున్నాక పరంధామయ్య గారిని కలిసి ముందుగా అతని  నిర్ణయానికి విరుద్దంగా నడుచుకున్నన్నదుకు క్షమార్పణ కోరుకున్నాను...అతను బాగా అప్సెట్ అయ్యారనిపించింది... చాలాసేపు సర్దిచెప్పాక శాంతించారు...

"అదికాదయ్య నీకేదైనా జరిగివుంటె మాకెంత బాధగా వుండేదో ఆలోచించావా....?" పెద్దాయన ఆందోళన అర్థం చేసుకోగలను....

అతను మరికొంచెం శాంతించాక, రాత్రి జరిగిన ప్రతి విషయం చెప్పాను... మొదట్లో ఆయన దిగ్ బ్రాంతికి లోనైనట్లు కనిపించారు...

"మీరు నమ్మరేమోనన్న అనుమానంతో, మీకు భుజంగ రావు గారికి మాత్రమే తెలిసిన చిన్ననాటి సంఘటన తాలూకు పదమొకటి తెలుసుకొచ్చాను..." అంటూ ఆ పదాన్ని చెప్పాను...

అది చిన్న వయసులో  ఒకసారి వాళ్ళు గొడవపడ్డప్పుడు భుజంగ రావు గారిని పరంధామయ్య గారు తిట్టిని ఒక బూతు మాటను సంఘటనతో సహా గుర్తు చేశాను...

పరంధామయ్యగారి మొహం కాస్తా ఇబ్బందిగా పెట్టారు... 

"అవునయ్యా నిజమే... నా జీవింతంలో మొదటి సారే కాదు చివరి సారిగా కూడా పలికిన్ ఏకైక తిట్టు అది..." నా అనుభవాన్ని అతను నమ్మినట్లు  అర్థమయ్యింది..భుజంగరావుగారు ఎక్కడెక్కడ దబ్బు దాచారు... ఎవరెవరికి ఎంత అప్పులిచ్చారు... వాటిని వసూలు చేసి ఏవిధంగా ఖర్చు పెడితే అతని ఆత్మ శాంతిస్తుందో వివరంగా చెప్పాను.. ఆయన చాల సంతోషించారు... నన్నెంతగానో మెచ్చుకున్నారు...

"సార్... ప్రతి మనిషి ఏదో కారణంగానే మనిషి జన్మ తీసుకుంటాడు... కర్తవ్యాన్ని గుర్తించిన వాడు ఆ అవకాశాన్ని సద్వినియోగం  చేసుకుంటాడు... అమాయకత్వంతో అమూల్యమైన జీవితాన్ని వృధా చేసుకునే వాళ్ళు పడే బాధకు మరో నిదర్షనమే భుజంగ రావు గారి జీవితానుభవం .. ఇలాంటి పశ్చాత్తాప పడే ఆత్మలకు సహాయం చేయడమే నా పుట్టుకకు  కారణమేమో ...అదే నా కర్తవ్యంగా భావిస్తూ, నా శరీరం సహకరించేవరకు ఇదే ప్రయత్నంలో వుండాలన్నదే నా అభిలాష..."

అనుకున్న ప్రకారమే పరంధామయ్య గారు తన మిత్రుడు బుజంగ రావు గారు దాచుకున్న సంపదను, అప్పుల రూపంలో  వున్న ధనాన్ని, అన్నదానం, స్కూలు నిర్మాణం లాంటి సత్కార్యాలకు వినియోగించి,  భుజంగరావుగారి ఆత్మకు శాంతిచేకూరేల చేశారు... మరో అత్మ సమస్యను తీర్చానన్న సతృప్తిని నాకు దక్కేలా చేశారు....

 

మరిన్ని కథలు
ennika