Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
jeevanasamaram

ఈ సంచికలో >> కథలు >> దేవునివరం.

devunivaram

పూర్వం ఒక అడవిలో ఒక చెట్టుమీద ఒక పిట్ట గూడు కట్టుకుని నివసించేది.అది ఒక గుడ్డుపెట్టి, పొదిగింది ఆపిట్ట. కొద్దిరోజులకు ఆ గుడ్డు లొంచీ  ఒక పిల్ల పిట్ట బయటికి వచ్చింది.విచిత్రంగా చుట్టూ చూస్తూ, అమ్మ తెచ్చి నోట్లో పెట్టే ఆహారం తింటూ పెరగ సాగింది. ఆ పిల్ల పిట్టకు గూట్లోంచీ కనిపెంచే ప్రకృతి వింతగా ఉంది.పచ్చనిచెట్లూ, రంగులపూలూ అన్నీ వింతగానే ఉన్నాయి.క్రమేపీ దాని రెక్కల కు బలం వచ్చింది .అది గమనించిన తల్లిపిట్ట 'ఇహ తాను తనపిల్లకు తిండి సంపాదించి పెట్టనవసరం లేదనీ అదే స్వయంగా తిండి సంపాదించుకుని తినాల్సిన సమయం వచ్చిందనీ , ఇలాగే తాను తిండితెచ్చి పెడితే అది సోమరిగా తయారవు తుందనీ గ్రహించి 'ఒక రోజున  దాన్ని గూట్లోంచీ బయటికి తోసేసింది. పిల్లపిట్ట భయంతో రెక్కలు ఆడిస్తూ అలా అలా తనకు తెలీకుండానే ఎగిరి ఎగిరి పక్క నే ఉన్న పల్లెకు చేరి కనిపించిన ఒక చెట్టు కొమ్మమీద వాలింది.చుట్టూ చూసింది.

అదొక తోట. చుట్టూ రంగురంగుల పూలు, పండ్ల చెట్లూ, కూరమొక్కలూ ఉన్నాయి. అదొక వ్యక్తి ఇల్లు అని గ్రహించింది ఆపిల్లపిట్ట. ఇంతలో దానికి ఆకలేసింది.చుట్టూచూసింది.ఆఇంటి వారు  ఆచెట్టు మొదట్లో పక్షులకోసమే పోసిన గింజలు కనిపించాయి. చుట్టూ గమనించి ఎవ్వరూ లేరని నిర్ధారించుకుని మెల్లిగా కొమ్మమించీ వచ్చి ఆగింజలు తినింది.పొట్టనిండగానే దానికి చుట్టూ కనిపించిన రంగులపూలూ, ఆకులూ చూసి ఆశ్చర్యమేసింది. నీలం, ఎరుపు, ఆకుపచ్చ,పసుపుపచ్చ పింకు,ఆరంజి ఇంకా అనేక రంగుల పూల మీద ఆ పిల్లపక్షికి అమిత ప్రేమ  కలిగింది.చెట్టుకొమ్మమీద కూర్చుని ప్రకృతి అందాలను చూడసాగింది.'భగవతుడు ఎంత గొప చిత్ర కారుడు? ఇన్ని రంగురంగుల పులనెలా సృష్తించాడో!మహాత్ముడు!'అనుకుంటూ అది తన వంటికేసి చూసుకుంది. తన రెక్కలు నలుపు కలిసిన బూడిదరంగులో ఉండటం దానికేమీ నచ్చలేదు.తనరెక్కలూ ఆపూలరంగుల్లా ఉంటే ఎంత బావుణ్ణూ అను కుంది. వెంటనే అది దేవుని ప్రార్ధించ సాగింది.అలారోజుల తరబడీ ఏకాగ్రతగా ప్రార్ధించగా ప్రార్ధించగా చివరకు ఒకనాడు దేవుడు దిగివచ్చి ఎదు రుగా నిల్చున్నాడు. " ఓ బుజ్జి పిట్టా !ఏమి నీకోరిక!"అని అడిగాడు. అతడ్ని చూసి పిల్లపిట్ట , " నీవెవరు?" అంది. "నేనే దేవుడ్ని.  నీవురోజూ నన్ను ఎకాగ్రతతో, భక్తితో స్మరిస్తున్నావుకదా! అందుకే వచ్చాను.నీకేమి కావాలి?" అని అడిగాడు దేవుడు.

ఆ పిల్లపిట్ట" నీవు దేవుడివా! ఐతే నారెక్కలకు ఆపూల రంగులన్నీ వచ్చేలా చేయగలవా?"అంది."తప్పక చేస్తాను.నీవు ఏపూల రంగులుకావాలని కోరుకుంటున్నావో ఆపూరేకలపై నీ ఈకలు తగిలేలా ఎగురు.ఆరంగులు నీ ఈకలకు వచ్చే స్తాయి."అన్నాడు. పిల్లపిట్ట" ఆగాగు దేవుడా! వెళ్ళకు .నారెక్కలకు రంగులు అంటాకే వెళ్ళు.అందాకా ఆగు." అంటూ వెళ్ళి తన రెక్కలను విశాలంగా తెరచి మెల్లిగా పూల రెక్కలు విరక్కండా అక్కడున్న పసుపు చేమంతులూ, నీలాంబరాలు, ఆకు పచ్చ మనోరంజ నాలు, ఎరుపు గులాబీలు,పింకు బంతులూ తగిలేలా తనరెక్కలను చాపి తగిలించింది.ఎఱ్ఱ గులాబీ మీద తన ముక్కు ఆనించి వాసన చూసింది.అంతే దాని రెక్కలకు  పంచవర్ణాలూ అంటాయి. ముక్కు ఎఱ్ఱగా ఐంది.దేవుడు "ఓపంచవన్నెల చిలకా!ఇహనుంచీ నీపేరు అదే! పక్కనే ఉన్న నీటి తొట్టెలో నీ నీడ చూసుకో ఇహ నేను వెళతాను.

నీవు నేను సృష్టించిన ప్రకృతిని ప్రేమించి,ఏ అపకారమూ చేయ నందువల్ల,నేను సృష్టించిన పూలకు వేటికీ బాధకలిగించనందున, ప్రకృతిని ప్రేమిస్తూ, నన్ను ధ్యానిస్తూ ఉన్నందున నీరెక్కలకు పంచ వన్నెలు ఇస్తున్నాను,నీవు నన్ను స్మరించావుగనుక చక్కగా మానవులు మాట్లాడే మాటలు పలుక గలుగుతావు.అంతా నీ మాటల ను చిలక పలుకులు అంటారు. అరమాగినపండ్లు తింటూ అరుస్తూ, మాట్లాడుతూ మానవులకు ఇష్టమైన దానివిగా బ్రతుకుతావు, నీ సంతానానికీ ఇలా పంచ వన్నెల రెక్కలు వస్తూనే ఉంటాయి.నన్ను ఏకాగ్రతగా ధ్యానించిన వారి కోరికలు తీర్చడమే నాకు ఇష్టం" అనివరం ఇచ్చి మాయమయ్యాడు దేవుడు.చూశారా బాలలూ!ప్రకృతిని ప్రేమిస్తే దేవుడు సంతోషిస్తాడు.

మరిన్ని కథలు
manavatvam