Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
mega princess oka manasu movie fist look

ఈ సంచికలో >> సినిమా >>

'సుప్రీం'లో రాశి ఖన్నా సూపరో సూపర్‌

rashikahanna performence super..

అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'సుప్రీం' చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్‌తేజ సరసన ఈ చిత్రంలో రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో రాశి ఖన్నా మునుపెన్నడూ లేనంత గ్లామరస్‌గా కన్పిస్తోంది. పోలీస్‌ డ్రెస్‌లో రాశి ఖన్నా అదరహో అన్పించేలా వుంది. పాటల్లో అయితే డాన్సింగ్‌ సెన్సేషన్‌ అయిన సాయిధరమ్‌తేజకి పోటీగా స్టెప్పులేసి దుమ్మురేపింది. సాంగ్‌ ప్రోమోస్‌లో వీరిద్దరి డాన్సింగ్‌ స్కిల్స్‌, ఆన్‌ స్క్రీన్‌ కెమిస్ట్రీ సూపర్బ్‌గా ఉన్నాయి. అవకాశాలు వచ్చిపడుతున్నా, నిఖార్సయిన హిట్టు పడలేదు రాశి ఖన్నాకి. ఆ లోటు 'సుప్రీం'తో తీరిపోనుందని సినీ వర్గాలు అంచనా వేస్తుండడంతో రాశి ఖన్నా ఆనందం వ్యక్తం చేస్తోంది. 'రేయ్‌' చిత్రం అటూ ఇటూగా ఉన్నా 'పిల్లా నువ్వు లేని జీవితం', 'సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌' చిత్రాలతో మంచి మార్కెట్‌ సంపాదించుకున్నాడు సాయిధరమ్‌ తేజ. దాంతో, ఈ 'సప్రీం'పైనా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రెజినాకి బ్యాట్‌ టు బ్యాక్‌ రెండు హిట్లు ఇచ్చిన సాయిధరమ్‌, రాశి ఖన్నాకి కూడా మంచి హిట్‌ ఇస్తాడని అనుకుంటున్నారు ఇండస్ట్రీలో. మెగాస్టార్‌ చిరంజీవి నటించగా సూపర్‌ హిట్‌ అయిన 'అందం ఇందోళం..' పాటని ఈ చిత్రంలో రీమిక్స్‌ చేశారు. 

మరిన్ని సినిమా కబుర్లు
trisha as nayaki..